Political News

విచార‌ణ‌కు రండి..: సాయిరెడ్డికి నోటీసులు

“విచార‌ణ‌కు రండి. ఈ నెల 18న హాజ‌రై మాకు స‌హ‌క‌రించండి. వ‌చ్చేప్పుడు మీ వ‌ద్ద ఉన్న ఆధారాలు వివ‌రాలు కూడా తీసుకురండి!” అని వైసీపీ మాజీ నాయ‌కుడు, రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు వి. విజ‌యసాయిరెడ్డికి వైసీపీ హ‌యాంలో జ‌రిగిన మ‌ద్యం కుంభ‌కోణంపై విచార‌ణ చేస్తున్న ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం అధికారులు తాజాగా నోటీసులు పంపించారు. ఆయ‌న ఈమెయిల్ స‌హావాట్సాప్‌ల‌కు ఈ నోటీసులు పంపించార‌ని అధికారులు తెలిపారు.

ఈ నెల 18న విజ‌య‌వాడ‌లోని ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందం కార్యాల‌యం(విజ‌య‌వాడ‌లోని పోలీసు క‌మిష‌న‌రేట్‌)లో హాజ‌రు కావాల‌ని సాయిరెడ్డికి తేల్చిచెప్పారు. కాగా.. ఈ కేసులో సాయిరెడ్డికి నోటీసులు జారీ చేయడం ఇదే తొలిసారి. గ‌తంలో మ‌రో కేసులో ఆయ‌న‌ను ఏపీ సీఐడీ అధికారులు విచార‌ణ‌కు పిలిచారు. ఇప్పుడు మ‌ద్యంకుంభ‌కోణంలో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని తాఖీదులు ఇచ్చారు. ప్ర‌స్తుతం బెంగ‌ళూరు లో సొంత మీడియా ఛానెల్ ప‌నుల‌పై బిజీగా ఉన్న సాయిరెడ్డి ఏమేర‌కు సిట్‌కు స‌హ‌క‌రిస్తారో చూడాలి.

ఇదిలావుంటే.. వైసీపీ హ‌యాంలో న‌కిలీ బ్రాండ్లు త‌యారు చేసి.. ప్ర‌జ‌ల‌కు ఎక్కువ మొత్తాల‌కు లిక్క‌ర్ విక్ర‌యించి.. సొమ్ములు చేసుకున్నార‌న్న అభియోగాలు ఉన్నాయి. దీనిపై కూట‌మి ప్ర‌భుత్వం ద‌ర్యాప్తు న‌కు ఆదేశించింది. ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. దీనిలో భాగంగా ఈ కుంభ‌కోణానికి క‌ర్త‌-క‌ర్మ‌-క్రియ‌గా భావిస్తున్న క‌సిరెడ్డి రాజ‌శేఖ‌ర‌రెడ్డిని వెంటాడుతోంది. ఇప్ప‌ట‌కే మూడు సార్లు విచార‌ణ‌కు పిలిచినా ఆయ‌న త‌ప్పించుకుంటున్నారు.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, రాయ‌దుర్గం వంటి చోట్ల ఉన్న ఆయ‌న నివాసాల్లో సోదాలు నిర్వ‌హించి.. విలువైన ప‌త్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సాయిరెడ్డికి కూడా.. నోటీసులు ఇచ్చా రు. ఈయ‌న‌కు చెందిన బంధువుల ప్ర‌మేయం లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఉంద‌ని అధికారులు చెబుతున్నారు.

This post was last modified on April 15, 2025 3:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ట్రెండీ కామెడీతో నవ్వించే మురారి

​సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…

15 minutes ago

సమంతలో పెళ్ళి తెచ్చిన కళ

ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…

52 minutes ago

సంతృప్తిలో ‘రెవెన్యూ’నే అసలు సమస్య.. ఏంటి వివాదం!

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…

1 hour ago

15 ఏళ్లుగా బ్రష్ చేయలేదు.. 35 ఏళ్లుగా సబ్బు ముట్టుకోలేదు..

ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…

2 hours ago

పవర్ స్టార్ ఇప్పుడు టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…

3 hours ago

మెగా మాస్ ఈజ్ బ్యాక్

మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…

3 hours ago