Political News

సోనియా అల్లుడికి ఈడీ న‌జ‌ర్‌.. ఏం జ‌రిగింది?

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నాయ‌కురాలు.. సోనియా గాంధీ అల్లుడు.. ప్రియాంక గాంధీ భ‌ర్త‌.. రాబ‌ర్ట్ వాద్రాను ఎన్ ఫోర్స్‌మెంటు డైరెక్ట‌రేట్ (ఈడీ) అధికారులు మ‌రోసారి టార్గెట్ చేశారు. విచార‌ణ‌కురావాలంటూ.. తాజాగా ఆయ‌న‌కు నోటీసులు పంపించారు. ఈ నెల 20న ఢిల్లీలోని త‌మ‌ కార్యాల‌యానికి రావాలంటూ.. ఈడీ అధికారులు నోటీసుల్లో స్ప‌ష్టం చేశారు. వ‌చ్చేప్పుడు.. గుర్గావ్‌లోని భూములకు సంబంధించి ఉన్న ఆధారాల‌ను కూడా తీసుకురావాల‌ని పేర్కొన్నారు.

కాగా.. గ‌త మూడేళ్ల కింద‌టే వాద్రాపై కేసులు న‌మోద‌య్యాయి. అయితే.. ఆయ‌న వీటిని గ‌తంలోనే కోర్టులో స‌వాల్ చేయ‌గా.. కొన్ని కేసుల్లో స్టే ల‌భించినా.. గుర్గావ్ భూముల‌కు సంబంధించి.. మాత్రం కోర్టు విచార‌ణ వాయిదాప‌డంది. ఈ నేప‌థ్యంలోనే ఇటీవ‌ల ఈడీ ఈ కేసుల విచార‌ణ‌ను ముమ్మ‌రం చేసింది. గ‌త నెల‌లోనే ఒక నోటీసును జారీ చేసింది. ఈ నెల 8న విచార‌ణ‌కు రావాల‌ని ఆదేశించింది. అయితే.. వాద్రా ఈ విచార‌ణ‌కు రాకుండా..ఈడీ త‌న ప‌రివారం చెప్పిన‌ట్టు వింటోంద‌ని రాజ‌కీయ విమ‌ర్శ‌లు చేశారు.

ఇక‌, అస‌లు విష‌యానికి వ‌స్తే… కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని యూపీఏ ప్ర‌భుత్వం తొలి ద‌శ‌లో అంటే.. 2004-14 మ‌ధ్య ఢిల్లీకి స‌మీపంలోని గుర్గావ్‌లో రియ‌ల్ ఎస్టేట్ వెంచ‌ర్ వేసి దానిని 1000 కోట్ల‌కు విక్ర‌యిం చార‌న్న ఆరోప‌ణ‌లు వున్నాయి. అయితే.. ఈబూములు ఇచ్చిన వారికి వాద్రా తిరిగి సొమ్ములు చెల్లించ కుండానే.. వాటిని ఆక్ర‌మించార‌ని ఫిర్యాదులు వ‌చ్చాయి. వాస్త‌వానికి యూపీలో 2 హ‌యాంలోనే ఈ కేసులు వ‌చ్చినా.. అప్ప‌ట్లో తొక్కిపెట్టారు. మోడీ అధికారంలోకి వ‌చ్చాక ఈ కేసుల్లో క‌ద‌లిక వ‌చ్చింది.

మొత్తం రూ.7.5 కోట్ల విలువైన భూ వ్యవహారంలో కేసులు న‌మోదై.. విచార‌ణ ద‌శ‌కు కూడా వ‌చ్చాయి. అయితే.. కోర్టుల జోక్యంతో విచార‌ణ మంద‌గించింది. కాగా.. ఇప్పుడు మ‌రోసారి వాద్రాకు వ‌రుస నోటీసులు రావ‌డం గ‌మ‌నార్హం. కాగా.. దీనిపై కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు విరుచుకుప‌డ్డారు. గుజ‌రాత్‌పై తాము ఫోక‌స్ చేస్తున్నందుకే.. త‌మ పార్టీ నాయ‌కుల కుటుంబాల‌పై కేసులు పెడుతున్నార‌ని విచార‌ణ‌ల పేరుతో వేధిస్తున్నార‌ని కేంద్రంపై విమ‌ర్శ‌లు ఎక్కు పెట్టారు.

This post was last modified on April 15, 2025 4:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రష్యా అధ్యక్షుడికి గోంగూర, ఆవకాయ తినిపించిన మోదీ

వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…

1 hour ago

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

2 hours ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

3 hours ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

4 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

6 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

8 hours ago