Political News

ఏడాది టైం పెట్టి 10 నెలల్లోనే.. తండ్రికి తగ్గ తనయుడు!

ఎవ‌రైనా నాయ‌కులు ఎన్నిక‌ల‌కు ముందు ఏదైనా హామీ ఇస్తే.. దానిని నెర‌వేర్చేందుకు స‌మ‌యం ప‌డుతుంది. పైగా గెలిచిన త‌ర్వాత‌.. వారిచ్చిన హామీల‌ను అమ‌లు చేయాలంటూ.. ప్ర‌జ‌లు గుర్తు చేయాల్సిన ప‌రిస్థితి కూడా ఉంటుంది. అందుకే.. నాయ‌కులు ఇచ్చే హామీల్లో స‌గానికి పైగా అమ‌లుకు నోచుకోవ‌డం క‌ష్ట‌మ‌నే టాక్ ఉంది. అయితే.. ఈ వాద‌న‌ను కొట్టి పారేస్తూ.. మంత్రి నారా లోకేష్‌.. త‌న తండ్రి చంద్ర‌బాబుకు తగ్గ త‌న‌యుడిగా పేరు తెచ్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

తాజాగా ఆదివారం నారా లోకేష్ త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం మంగళగిరిలో 100 పడకల ఆసుపత్రికి  శంకు స్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మానికి కూట‌మి మిత్ర పక్షాల నాయ‌కులు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక,  సినిమా టోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ స‌హా.. టీడీపీ నాయ‌కుల‌ను కూడా ఆహ్వానించారు. ఎలాంటి అట్ట‌హాసం లేకుండా.. సాధార‌ణంగానే ఈ కార్య‌క్ర‌మానికి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్టును వ‌చ్చే ఏడాది ఇదే స‌మ‌యానికి పూర్తి చేయాల‌న్న సంక‌ల్పంతో ఉన్నామ‌ని ఈ సంద‌ర్భంగా నారా లోకేష్ చెప్పారు.

అయితే.. వాస్త‌వానికి గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు మంగ‌ళ‌గిరిలో ప‌ర్య‌టించి యువ‌గ‌ళం పాద‌యాత్ర  చేసిన నారా లోకేష్‌.. తన‌ను గెలిపిస్తే.. ఏడాదిలో 100 ప‌డ‌క‌ల ఆసుప‌త్రికి శ్రీకారం చుడ‌తామ‌ని హామీ ఇచ్చారు. అయితే..ఎప్ప‌టిలాగానే.. అంద‌రిలాగానే.. నారా లోకేష్ కూడా.. త‌న ప‌నుల్లో ప‌డి ఈ విష‌యం మ‌రిచిపోతార‌ని.. మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు అనుకున్నారు. కానీ, దీనికి భిన్నంగా.. తాను ఇచ్చిన ఏడాది గ‌డువుకు రెండు మాసాల ముందే శంకుస్థాప‌న చేశారు.

అంటే.. కేవ‌లం 10 మాసాల్లోనే స‌ర్కారు నుంచి అనుమ‌తులు తెచ్చుకుని ఈ కార్య‌క్ర‌మానికి శ్రీకారం చుట్ట‌డం విశేషం. ప్ర‌స్తుతం మంగ‌ళ‌గిరి ప్ర‌జ‌లు సాధార‌ణ వైద్యానికి ఎయిమ్స్‌ను ఆశ్ర‌యిస్తున్నారు. అయితే.. ఇక్క‌డ ప‌డ‌క‌లు ఉన్నా.. ప్ర‌జ‌ల రాక‌పోక‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. దీంతో ఇక్క‌డి వారికి ప్ర‌త్యేకంగాఆసుప‌త్రి అవ‌స‌ర‌మ‌ని భావించిన నారా లోకేష్‌.. ఎన్నిక‌ల స‌మ‌యంలో హామీ ఇచ్చారు. ఇప్పుడు కార్యాచ‌ర‌ణ‌కు పూనుకొన్నారు.

This post was last modified on April 14, 2025 3:56 pm

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

40 minutes ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

7 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

9 hours ago