Movie News

మ‌ళ్లీ మంట‌లు పుట్టించేస్తున్న త‌మ‌న్నా

ఒక‌ప్పుడు ఐటెం సాంగ్స్ అంటే అందుకోసమే కొంద‌రు భామ‌లుండేవారు. వాళ్లే ఆ పాట‌లు చేసేవారు. కానీ గ‌త ద‌శాబ్ద కాలంలో అంతా మారిపోయింది. స్టార్ హీరోయిన్లే ఐటెం సాంగ్స్‌లో అద‌ర‌గొట్టేస్తున్నారు. ఆ పాట‌ల‌ను హీరోయిన్లు త‌క్కువ‌గా చూసే రోజులు ఎప్పుడో పోయాయి. టాలీవుడ్లో అగ్ర క‌థానాయిక‌లుగా వెలుగొందిన అనుష్క‌, కాజ‌ల్ అగ‌ర్వాల్, త‌మ‌న్నా భాటియా, శ్రుతి హాస‌న్.. ఇలా అంద‌రూ ఐటెం సాంగ్స్‌లో మెరిసిన వాళ్లే. ప్ర‌స్తుతం ఈ పాట‌ల‌కు బాగా పేరుప‌డ్డ క‌థానాయిక అంటే త‌మ‌న్నా అనే చెప్పాలి. ఆల్రెడీ ద‌క్షిణాదిన చెప్పుకోద‌గ్గ సంఖ్య‌లో ఐటెం సాంగ్స్ చేసిన మిల్కీ బ్యూటీ.. ఈ మ‌ధ్య హిందీ చిత్రాల్లో స్పెష‌ల్ సాంగ్స్‌తో అక్క‌డి జ‌నాల‌ను ఒక ఊపు ఊపేస్తోంది.

గ‌త ఏడాది వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ స్త్రీ-2లో త‌మ‌న్నా పాట ఎంత హైలైట్ అయిందో తెలిసిందే. అందులో త‌మ‌న్నా డ్యాన్స్ మూమెంట్స్, త‌న అంద‌చందాలు కుర్ర‌కారును ఊపేశాయి. ఇప్పుడు మ‌రో ఐటెం సాంగ్‌తో ర‌చ్చ షురూ చేసింది త‌మ‌న్నా. అజ‌య్ దేవ‌గ‌ణ్ హీరోగా న‌టించిన రైడ్-2 కోసం త‌మ‌న్నా ఒక ఐటెం సాంగ్ చేసింది. ఇటీవ‌లే ట్రైల‌ర్‌తో క్లాస్ ప్రేక్ష‌కుల దృష్టిని ఆక‌ర్షించిన చిత్ర బృందం.. తాజాగా ఐటెం సాంగ్‌తో మాస్‌కు, యూత్‌కు వ‌ల వేసింది.

ఇప్ప‌టిదాకా త‌మ‌న్నా చేసిన అన్ని ఐటెం సాంగ్స్ కంటే ఇది హాట్ హాట్‌గా ఉండ‌డం.. కుర్రాళ్ల‌ను బాగా క‌వ్వించేలా త‌మ‌న్నా లుక్స్, స్టెప్స్ ఉండ‌డంతో సోష‌ల్ మీడియాలో ఈ పాట ట్రెండింగ్‌లో ఉంది. త‌మ‌న్నా షార్ట్ వీడియోలు క‌ట్ చేసి కుర్రాళ్లు వైర‌ల్ చేస్తున్నారు. స్త్రీ-2 త‌ర‌హాలోనే రైడ్-2కు కూడా త‌మ‌న్నా పాట హైలైట్ అయి ప్రేక్ష‌కుల‌ను థియేట‌ర్ల‌కు ర‌ప్పించేలా ఉంది. సూప‌ర్ హిట్ మూవీ రైడ్‌కు సీక్వెల్‌గా తెరకెక్కిన రైడ్-2 మే 1న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. త‌న కెరీర్లో క‌ల్ట్ క్యారెక్ట‌ర్‌గా నిలిచిపోయిన అమ‌య్ ప‌ట్నాయ‌క్ పాత్ర‌లో అజ‌య్ మ‌రోసారి అద‌ర‌గొట్టేలా ఉన్నాడు. రైడ్‌లో ఇలియానా క‌థానాయిక‌గా న‌టించ‌గా.. సీక్వెల్లో వాణి క‌పూర్ అజ‌య్‌కి జంట‌గా క‌నిపించ‌నుంది.

This post was last modified on April 14, 2025 11:23 am

Share

Recent Posts

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

1 hour ago

రణబాలికి ఇంతకంటే ఏం కావాలి

ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…

6 hours ago

ఊహించని మార్పులతో దృశ్యం 3

కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…

7 hours ago

ఒకే నెలలో సాయిపల్లవి డబుల్ బొనాంజా

గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…

7 hours ago

40 సంవత్సరాల రాక్షసుడు… ఇది చిరంజీవి కెజిఎఫ్

కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…

8 hours ago

లక్ష కోట్లతో ‘రాయలసీమ రైజింగ్‘

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రాభివృద్ధి జెట్ స్పీడ్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు అమరావతి…

10 hours ago