బాలీవుడ్లో విలక్షణ పాత్రలతో మంచి గుర్తింపు సంపాదించి.. దక్షిణాదిన కూడా కొన్ని సినిమాల్లో నటించింది రాధికా ఆప్టే.. ‘ధోని’, ‘కబాలి’ చిత్రాల్లో నటించిన రాధికా.. తెలుగులో నందమూరి బాలకృష్ణ సరసన ‘లయన్’, ‘లెజెండ్’ చిత్రాలు చేసిన సంగతి తెలిసిందే. ఐతే ‘లెజెండ్’ తర్వాత రాధిక మళ్లీ తెలుగులో కనిపించలేదు. ఈ సంగతి పక్కన పెడితే తాను దక్షిణాదిన నటించిన ఓ చిత్రం షూట్ సందర్భంగా హీరో తనతో అనుచితంగా ప్రవర్తించడం గురించి రాధికా ఓ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు ఆ మధ్య చర్చనీయాంశంగా మారాయి. ఆ హీరో ఎవరనే విషయంలో డిస్కషన్లు బాగానే జరిగాయి.
ఆ చేదు అనుభవం వల్లేనేమో మళ్లీ సౌత్ సినిమాల్లో రాధికా నటించనే లేదు. ఆమెకూ ఇక్కడి వాళ్లు ఛాన్సులివ్వలేదు. ఐతే చాలా గ్యాప్ తర్వాత రాధికా ఓ తెలుగు చిత్రంలో నటించబోతున్నట్లు సమాచారం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి నటించనున్న చిత్రంలో రాధికా కీలక పాత్ర చేయబోతోందట. ఇది పాన్ ఇండియా మూవీనే అయినప్పటికీ.. బేసిగ్గా తెలుగు చిత్రమే.
ఇందులో ఇప్పటికే టబు ఓ ముఖ్య పాత్ర చేస్తోంది. ఐతే ఆమెది సేతుపతికి జోడీగా ఉండే పాత్ర కాదట. రాధికాకే ఆ ఛాన్స్ ఇచ్చాడట పూరి. సేతుపతి, టబు, రాధికా లాంటి కాస్టింగ్ అంటే ఈ సినిమా పట్ల ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తి ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. కాస్టింగ్‌గా క్యూరియాసిటీ పెంచడంలో పూరి బాగానే విజయవంతం అవుతున్నాడు. ఇక స్క్రిప్టులోనూ బలం ఉండి, టేకింగ్‌లోనూ ఒకప్పటిలా మెరుపులు మెరిపించగలిగితే పూరి ఖాతాలో మళ్లీ ఓ హిట్ పడబోతున్నట్లే. జూన్‌లో ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లబోతోంది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక, ప్రి ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
This post was last modified on April 13, 2025 4:46 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…