ఏపీలోని పొలిటికల్ కేపిటల్ విజవాయడలో శనివారం ఓ ఆసక్తికర సన్నివేశం కనిపించింది. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ కీలక నేత, పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్ఎన్ వర్మ కలిసి కనిపించారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేయి చాపగా.. వర్మ చంద్రబాబుకు షేక్ హ్యాండ్ ఇస్తూ కనిపించారు. ఈ సన్నివేశం అక్కడున్న వారితో పాటుగా ఈ ఫొటోను చూసిన వారందరిలోనూ ఆసక్తి రేకెత్తించింది. ఈ సందర్భంగా వర్మ పక్కనే ఉన్న ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజు… ఎక్కడ తాను అడ్డుపడితే ఆ వారిద్దరి ఫొటో సంపూర్ణం కనిపించదోనన్న భావనతో ఓ వైపునకు జరిగి మరీ నిలబడిన తీరు కూడా కనిపించింది.
2024 సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు వర్మ అప్పటికే సర్వసన్నద్ధమయ్యారు. అయితే ఎన్నికలకు కాస్తంత ముందుగా జనసేన, బీజేపీతో టీడీపీ పొత్తు ప్రకటించిన చంద్రబాబు… కూటమిగా పోటీ చేయనున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచి పోటీ చేస్తానని తెలిపారు. పవన్ ప్రతిపాదనకు ఓకే చెప్పేసిన చంద్రబాబు… పొత్తు నేపథ్యంలో మిత్రపక్షాలకు అవకాశం ఇవ్వాల్సి ఉందని, మీ సీటును పవన్ కోసం త్యాగం చేయాలని వర్మతో చెప్పారు. చంద్రబాబు మాటకు ఏమాత్రం ఎదురు చెప్పని వర్మ ఉన్నపళంగా పవన్ అభ్యర్థిత్వానికి ఓటేశారు. ఎన్నికల్లో పవన్ గెలుపు కోసం అహరహం శ్రమించారు. పవన్ ను మంచి మెజారిటీతో గెలిపించారు.
ఆ తర్వాత అంతా అనుకున్నట్లుగానే కూటమి బంపర్ మెజారిటీతో విక్టరీ కొట్టడం, చంద్రబాబు సీఎంగా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టడం, పవన్ కల్యాణ్ కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవి దక్కడంతో వర్మ చాలా సంతోషించారు. అయితే ఎన్నికల సందర్భంగా వర్మకు ఎమ్మెల్సీ అవకాశం కల్పిస్తానన్న చంద్రబాబు హామీ ఇప్పటిదాకా నెరవేరలేదు. ఇప్పటికే రెండు దఫాలుగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినా వర్మకు మాత్రం ఛాన్స్ దక్కలేదు. దీంతో వర్మ కామ్ గానే ఉన్నా.. ఆయన అనుచర వర్గం మాత్రం ఒకింత అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్నారు. త్యాగం చేసిన తమ నేతను ఎప్పుడు పట్టించుకుంటారు అంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రెండు పార్టీలతో పొత్తు ఉన్న నేపథ్యంలో అనుకున్నవన్నీ అనుకున్నట్లుగానే సాగిపోవు కదా. అదే విషయాన్ని ఇటు చంద్రబాబు, అటు వర్మ కూడా ఆకళింపు చేసుకునే సాగుతున్నారు.
ఇలాంటి క్రమంలో టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుమారుడి నిశ్చితార్థ వేడుకలు శనివారం విజయవాడలో ఘనంగా జరిగాయి. ఈ వేడుకకు చంద్రబాబు హాజరయ్యారు. అదే సమయంలో వర్మ కూడా రఘురామకృష్ణరాజుతో కలిసి ఈ కార్యక్రమానికి వచ్చారు. ఈ సందర్భంగా తనకు కనిపించిన వర్మను చంద్రబాబు ఆప్యాయంగా పలకరించగా… అధినేత కనిపించగానే చంద్రబాబు వద్దకు వర్మ కూడా పరుగున వెళ్లారు. ఇద్దరు నేతలూ చేతులు కలుపుకున్నారు. అయితే ఈ సందర్భంగా వారిద్దరి మధ్య ఏ మాటలు కలిశాయన్నది మాత్రం తెలియరాలేదు. చాలా కాలం తర్వాత ఈ ఇద్దరు నేతలు ఓ పెళ్లి వేడుకలో కలిసి ఇలా చేతులు కలిపి కనిపించిన తీరు టీడీపీ శ్రేణులను ఆనంద డోలికల్లో తేలియాడేలా చేశాయని మాత్రం చెప్పక తప్పదు.
This post was last modified on April 12, 2025 7:44 pm
మెగాస్టార్ ఫాంటసీ మూవీ విశ్వంభర నుంచి ప్రమోషన్ పరంగా ఇప్పటిదాకా రెండు కంటెంట్స్ వచ్చాయి. మొదటిది టీజర్. దీనికొచ్సిన నెగటివిటీ…
మాములుగా సీనియర్ దర్శకులకు వరసగా డిజాస్టర్లు పడితే కంబ్యాక్ కావడం అంత సులభంగా ఉండదు. అసలు వాళ్ళ కథలు వినడానికే…
ఇంజెక్షన్ అని వినగానే చిన్న పిల్లలే కాదు, పెద్దవాళ్లలో కూడా భయం కనిపిస్తుంది. దీనికి వైద్య పరంగా ట్రిపనోఫోబియా అని…
ఏపీలో కీలకమైన ఓ రాజ్యసభ సీటు ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా షెడ్యూల్ ప్రకటించింది. వైసీపీ నుంచి…
డీజే దువ్వాడ జగన్నాథంతో ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా హీరోయిన్ గా తన స్థాయిని అమాంతం పెంచేసిన సినిమాల్లో అల వైకుంఠపురములో…
చాట్ GPT - డీప్ సీక్ - మెటా.. ఇలా ఏఐ టెక్నాలజీతో ప్రపంచం రోజుకో కొత్త తరహా అద్బుతానికి…