తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు పెట్టుకోవడంపై ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం రాత్రి పొద్దు పోయాక.. గుంటూరు జిల్లా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిలో బీజేపీతో అన్నాడీఎంకే పొత్తును స్వాగతిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. పొత్తు ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. తమిళనాడు ప్రజలకు మంచి పాలన అందించేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలను ప్రతి ఒక్కరూ హర్షిస్తారని తెలిపారు.
అంతేకాదు.. అన్నాడీఎంకే సారథ్యంలో బీజేపీ నడుస్తుందని ప్రకటించడం ద్వారా తమిళుల మనసును కమలం పార్టీ నాయకు లు చూరగొన్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. ముఖ్యమంత్రి అభ్యర్థిగా పళని స్వామిని ఎంచుకోవడం ద్వారా అనుభవంతో కూడిన నాయకులకు బీజేపీ పెద్దపీట వేస్తున్న సంకేతాలు ఇచ్చినట్టు అయిందని అన్నారు. తమిళనాడులోని చాలా జిల్లాలు వెనుక బడ్డాయని.. బీజేపీ సారథ్యంలో అన్నాడీఎంకే కూటమి ప్రభుత్వం ఏర్పడితే.. రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందుతాయని పవన్ చెప్పారు. ఎన్డీయే విధి విధానాలతో కూటమి పాలిత రాష్ట్రాలు అభివృద్ధిలో పయనిస్తున్నాయని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అధికారంలోకి వచ్చేందుకు అన్నాడీఎంకేకు.. జాతీ య పార్టీ బీజేపీతో పొత్తు అనివార్యమైంది. ఇక, తమ దక్షిణాది విస్తరణ ఆకాంక్షను సఫలం చేసుకునేందుకు బీజేపీకి కూడా.. పొత్తు అవసరం. 2024లో జరిగిన ఎన్నికల్లో బీజేపీ ఇలా పొత్తు పెట్టుకునే కొంత మేరకు లబ్ధి పొందింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు అన్నాడీఎంకేతో హుటాహుటిన పొత్తు పెట్టుకోవడం గమనార్హం. ఈ విషయంలో ప్రముఖ ఆడిటర్, ఆర్ ఎస్ ఎస్ క్రియాశీలక నాయకుడు గురుమూర్తి సలహా తీసుకున్న కేంద్ర హోం మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్‌షా ఏమాత్రం ఆలస్యం చేయకుండా పొత్తును ప్రకటించడం గమనార్హం.
అంతేకాదు.. అతి పెద్ద జాతీయ పార్టీగా అవతరించిన బీజేపీ.. తమిళనాడులో మాత్రం అన్నాడీఎంకే సారథ్యంలో పనిచేస్తుందని కూడా ఆయన ప్రకటించి.. అందరినీ ఆశ్చర్యంలోకి నెట్టారు. వెంటనే గ్రామ గ్రామాన.. పర్యటించి.. డీఎంకే ప్రభుత్వ వ్యతిరేకతను పెంచాలని మీడియా ముఖంగానే బీజేపీ, అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలకు బీజేపీ అగ్రనేత సూచించారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సహా ఇతర చిన్నా చితకా పార్టీలతో పొత్తులో ఉన్న డీఎంకేను బలంగా ఢీ కొట్టేందుకు.. దాదాపు ఏడాది ముందుగానే బీజేపీ వ్యూహాత్మక అడుగులు వేయడంగమనార్హం.
This post was last modified on April 12, 2025 10:29 am
నవంబర్ దీపావళి పండక్కు బాక్సాఫిస్ పోటీ మంచి రసవత్తరంగా మారబోతోంది. ముందుగా 'రామాయణ పార్ట్ 1' వస్తుంది కాబట్టి దానికి…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుల జాబితా తీస్తే.. అందులో టాప్-10లో ఉండే పేరు. ఆయన చేయని పాత్ర…
యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో క్యారెక్టర్ రోల్స్ చేసుకునే అమ్మాయి వంద కోట్ల వసూళ్లు రాబట్టిన సినిమాలో భాగం కావడం..…
తెలుగులో సముద్రం నేపథ్యంతో వచ్చిన సినిమాలు తక్కువే. తీరప్రాంతం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నప్పటికీ పూర్తిగా ఈ బ్యాక్ డ్రాప్ లో…
ఆరు సంవత్సరాల క్రితం నేరుగా ఓటిటిలో రిలీజైన సినిమా మూకుతి అమ్మన్. తెలుగులో అమ్మోరు తల్లిగా డబ్బింగ్ చేశారు. బాగానే…