పెట్టుబడులను ఆకర్షించే విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు పోటీ పడుతున్నట్లే కనిపిస్తున్నాయి. అయితే ఎక్కడ కూడా ఇరు రాష్ట్రాల మధ్య పొరపొచ్చాలు గానీ, అభిప్రాయ బేధాలు గానీ తలెత్తకుండా ముందుకు సాగుతున్నాయి. నిన్నటిదాకా పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ నిలిస్తే… ఇప్పుడు ఆ స్థానాన్ని ఏపీ దాదాపుగా లాగేసుకునే దిశగా దూసుకుపోతోందని చెప్పక తప్పదు. ఇరు రాష్ట్రాలకు భౌగోళిక వ్యత్యాసాలు ఉన్న నేపథ్యంలో ఎవరికి వారుగా తమ రాష్ట్రాలకు సరిపడ రంగాలను ఎంచుకుని ముందుకు సాగుతున్నాయి. ఇక ఇరు రాష్ట్రాలకు అనుకూలంగా ఉన్న రంగాల్లో ఏపీ ఒకింత దూకుడుగా సాగుతోందని చెప్పక తప్పదు.
ప్రస్తుతం మహారాష్ట్ర రాజధాని ముంబైలో దక్షిణాసియా 20వ హోటల్ ఇన్వెస్ట్ మెంట్ కాన్ఫరెన్స్ వర్క్ షాప్ జరుగుతోంది. ఈ వర్క్ షాప్ కు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన పర్యాటక శాఖ మంత్రులు హాజరవుతున్నారు. ఈ వర్క్ షాప్ కు హాజరయ్యే విషయంలో తెలంగాణ టూరిజం మినిస్టర్ జూపల్లి కృష్ణారావు కంటే ఏపీ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ ఒక అడుగు ముందున్నారు. జూపల్లి గురువారం ఈ సమావేశాలకు హాజరు అవుతుండగా.. బుధవారం ప్రారంభమైన ఈ వర్క్ షాప్ తొలిరోజు సమావేశాల్లోనే సందడి చేశారు. తొలి రోజే దుర్గేశ్ 20కి పైగా ప్రముఖ సంస్థలతో భేటీ అయ్యారు. ఈ వర్క్ షాప్ ఆద్యంతం దుర్గేశ్ బృందం కొనసాగనుంది. అయితే తొలి రోజు భేటీకి కారణమేమిటో తెలియదు గానీ జూపల్లి మాత్రం హాజరు కాలేదు. గురువారం జరిగే ఈ వర్క్ షాప్ నకు మాత్రం ఆయన హాజరు అవుతున్నారు.
ఏపీ నుంచి ఈ వర్క్ షాప్ నకు వెళ్లిన బృందానికి దుర్గేశ్ నేతృత్వం వహిస్తుండగా… రాష్ట్ర పర్యాటక శాఖ కార్యదర్శి అజయ్ జైన్, టూరిజం మేనేజింగ్ డైరెక్టర్ ఆమ్రపాలిలతో పాటు పర్యాటక రంగానికి చెందిన పలువురు కీలక అధికారులు ఈ బృందంలో ఉన్నారు. రాష్ట్రంలో నూతనంగా హోటళ్ల ఏర్పాటుకు గల అవకాశాలను ఈ సందర్భంగా ఆయా సంస్థల ప్రతినిధులకు ఈ బృందం వివరించింది. ఇప్పటికే అభివృద్ది చెంది పర్యాటకంగా మంచి స్కోప్ ఉన్న విశాఖ, తిరుపతిలతో పాటు నూతనంగా నిర్మితమవుతున్న అమరావతి, అభివృద్దిలో దూసుకుపోతున్న రాజమహేంద్రవరంలలో హోటళ్ల ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను ఆయా సంస్థల ముందు పెట్టారు. ఈ వర్క్ షాప్ ద్వారా భారీ ఎత్తున పెట్టుబడులు రాబట్టే దిశగా దుర్గేశ్ బృందం సాగుతోంది.
This post was last modified on April 10, 2025 6:19 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…