Political News

పవన్ కొడుకు ప్రమాదంపై జగన్ దిగ్భ్రాంతి.. బాబు, లోకేశ్ ల స్పందన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పవన్ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డారన్న విషయం తెలిసి తాను షాక్ కు గురయ్యానని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు. ఇలాంటి కష్ట సమయంలో పవన్ కుటుంబానికి అండగా నిలబడాల్సిన అవసరం ఉందని జగన్ అభిప్రాయపడ్డారు. పవన్ కుమారుడు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు జగన్ అభిలషించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా జగన్ ఓ ఆసక్తికర సందేశాన్ని పోస్టు చేశారు. అందులో పవన్ ను ‘పవన్ గారు’ అంటూ జగన్ సంబోధించడం గమనార్హం. నిత్యం పవన్ పై రాజకీయంగా విరుచుకుపడే జగన్ నుంచి పవన్ కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలిసినంతనే విచారం వ్యక్తం చేస్తూ ప్రకటన విడుదల కావడం గమనార్హం.

ఏడున్నరేళ్ల వయసున్న పవన్ కుమారుడు పవనోవిచ్ సింగపూర్ లో ప్రైమరి విద్యనభ్యసిస్తున్నారు. అందుకోసం పవన్ సతీమణి అన్నా లెజినోవా సింగపూర్ లోనే ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం 8 గంటల సమయంలో పవనోవిచ్ చదవుతున్న పాఠశాలలో ఉన్నట్లుండి అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ సమయంలో పవనోవిచ్ తో పాటు మరికొందరు పిల్లలు పాఠశాలలోనే ఉన్నారు. ఈ ప్రమాదంలో పవనోవిచ్ కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. మంటల కారణంగా ఎగసిన పొగను పీల్చిన కారణంగా పవనోవిచ్ శ్వాస సంబంధిత ఇబ్బందికి కూడా గురయ్యారు. వేగంగా స్పందించిన సింగపూర్ అధికారులు సహాయక చర్యలను చేపట్టి… పాఠశాలలోని పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవనోవిచ్ పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే.. పవన్ కుమారుడు అగ్ని ప్రమాదంలో గాయపడ్డారని తెలిసిన వెంటనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు స్పందించారు. అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు గాయపడిన విషయం తనను ఆందోళనకు గురి చేసిందని చంద్రబాబు అన్నారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న పవనోవిచ్ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ఆయన అభిలషించారు. మరోవైపు పవన్ కుమారుడు గాయపడ్డ విషయం తెలిసినంతనే అందరికంటే ముందు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ వేగంగా స్పందించారు. సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ అన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారన్న విషయం తనను షాక్ కు గురి చేసిందని లోకేశ్ తన సందేశంలో పేర్కొన్నారు. మార్క్ శంకర్ త్వరగా కోలుకోవాలని, కష్ట కాలంలో ఉన్న పవన్ కుటుంబానికి ధైర్యాన్ని ప్రసాదించాలని ఆయన అభిలషించారు.

Satya

Recent Posts

జెన్‌-జీ రాజకీయం మొదలుపెట్టిన పవన్

ఏపీ అధికార పార్టీ జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. పార్టీలో యువ‌త‌రాన్ని ఆకర్షించేందుకు..…

40 minutes ago

పాలన… ప్లానింగ్… బాగున్నాయి లోకేష్

పాల‌న విష‌యంలో మంత్రి లోకేష్ ప‌క్కా ప్లానింగ్‌తో వ్య‌వ‌హ‌రిస్తున్నారా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. రాజ‌కీయాల‌ను విధాన‌ప‌ర‌మైన అంశాల‌ను క‌ల‌గాపుల‌గం…

3 hours ago

ఇక RCB అభిమానులను ఎవరు ఆపలేరు

పద్దెనిమిదేళ్ల అవమానాలు, ఎగతాళి మాటలకు బెంగళూరు జట్టు శాశ్వతంగా ముగింపు పలికింది. ఐపీఎల్ చరిత్రలో ట్రోల్స్ కు కేరాఫ్ అడ్రస్…

5 hours ago

గ్రేటర్ హైద‌రాబాద్ ఎల‌క్ష‌న్స్‌… ప్లాన్ ఏంటి సీఎం సార్?

గ్రేట‌ర్ హైద‌రాబాద్ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే పాల‌క మండ‌లి కూడా ర‌ద్ద‌యింది. ప్ర‌త్యేక అధికారి పాల‌న‌లోకి…

5 hours ago

అనుపమలో కొత్త కోణం బయటికొచ్చిందే

ఈ మధ్య కనిపించడం కాస్త తగ్గించినా హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ను మన ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోరు. మొన్న…

6 hours ago

సోష‌ల్ ఉద్య‌మం: ఏపీలో తెలంగాణ విగ్ర‌హాలు|

ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో కాక్రోచ్ జ‌న‌తా పార్టీ సృష్టించిన ప్ర‌భంజ‌నం అంద‌రికీ తెలిసిందే. బొద్దింక‌ల పార్టీగా ప్రారంభ‌మై.. ఒక వైపు…

6 hours ago