ప్రధాని మోడీని చూశారో.. లేక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని చూశారో తెలియదు కానీ.. కార్పొరేట్ దిగ్గజాలు.. బీజేపీపై విరాళాల వర్షం కురిపించారు. ఒక్క 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 2,243 కోట్ల రూపాల మేరకు విరాళాలు అందించారు. అన్ని జాతీయ పార్టీలకు కలిపి అందిన విరాళాల్లో 88 శాతం నిధులు ఒక్క బీజేపీకే అందాయంటే.. వారు భయపడుతున్నారో.. లేక.. ఉదారత చూపిస్తున్నారో అర్థమవుతుందని అంటున్నారు పరిశీలకులు. మొత్తంగా 8,358 మంది నుంచి రూ.2.243 కోట్ల విరాళాలు బీజేపీకి లభించాయి. వీరిలో 3,478 మంది కార్పొరేట్ దిగ్గజాలు, వ్యాపార వేత్తలే ఉండడం గమనార్హం.
మరో జాతీయ పార్టీ కాంగ్రెస్ విషయానికి వస్తే రూ.281.48 కోట్లు విరాళాల రూపంలో సమకూరాయి. ఈ పార్టీకి 1,994 మంది విరాళాలు అందించారు. ఈ మేరకు ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదిక ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తన నివేదికలో వెల్లడించింది. ఎన్నికల సంఘం ఇచ్చిన నివేదికలో రూ.20 వేలకు మించి ఇచ్చిన విరాళాలను ప్రధానంగా ప్రస్తావించింది.
‘కార్పొరేట్’ కాసుల వర్షం
బీజేపీకి కార్పొరేట్ సంస్థల నుంచి కాసుల వర్షం కురిసింది. ప్రడెంట్ ఎలక్టోరల్ ట్రస్ట్ రూ.723,675 కోట్లు విరాళంగా ఇచ్చింది. కాంగ్రెస్ కు రూ.158 కోట్లు అందించింది. టైమ్స్ ఎలక్టోరల్ ట్రస్ట్ బీజేపీకి నాలుగు సార్లుగా రూ.127.5 కోట్లు ఇచ్చింది. డెరైన్ ఇన్వెస్ట్మెంట్స్ సంస్థ రూ.50 కోట్లు కమలం ఖాతాలో వేసింది. కాంగ్రెస్‌కు రూ.3.2 కోట్లు ఇచ్చింది. ఆక్మే సోలార్ ఎనర్జీ సంస్థ 51 కోట్లు, భారత్ బయోటెక్ రూ.50 కోట్లు, రుంగా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.50 కోట్లు, దినేశ్ చంద్ర ఆర్. అగర్వాల్ ఇన్ఫ్రా రూ.30 కోట్లు బీజేపీకి సమర్పించాయి.
మరిన్ని వివరాలు..
This post was last modified on April 8, 2025 9:58 am
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…