వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు అనుకూలంగా వైసీపీ ఓటేసిందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. దీనిపై మై నారిటీ ముస్లింలు.. చర్చ చేస్తున్నారు. దీనిలో వాస్తవం ఎంత? అనేదానిపై వారు దృష్టి పెట్టారు. అయితే.. ఈ విషయంపై వైసీపీ ఎదురు దాడి చేసింది. తాము పూర్తిగా మైనారిటీలకు అనుకూలమేనని.. లోక్‌సభలో ఈ మేరకు ఓటింగుకు కూడా దూరంగా ఉండి.. వ్యతిరేకంగా ఓటేశామని చెప్పింది. కానీ, రాజ్యసభకు వచ్చే సరికి.. మాత్రం.. వైసీపీ సభ్యుడు నత్వానీఅనుకూలంగా ఓటేశారు.
దీనిని టీడీపీ హైలెట్ చేసింది. అయితే.. ఇది తమకు డ్యామేజీగా మారుతుందని భావించిన వైసీపీ వెంట నే ఎదురు దాడి ప్రారంభించినా.. అది పెద్దగా సక్సెస్ కాలేదు. దీంతో ఇప్పుడు ఏంచేయాలన్న అంశంపై వైసీపీ అంతర్మథనం చెందుతున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది. వివరణల మీద వివరణలు ఇచ్చి నా.. దీనిని నమ్మే పరిస్థితి లేకపోవడం గమనార్హం. మరోవైపు వక్ఫ్ బిల్లుకు తాము మద్దతు ప్రకటించినప్ప టికీ.. మైనారిటీలకు అన్యాయం జరక్కుండా సవరణలు ప్రతిపాదించి సక్సెస్ అయ్యామని టీడీపీ చెబుతోంది.
ఈ మొత్తం పరిణామాలు వైసీపీపై ఒత్తిడిని పెంచుతున్నాయి. బిల్లు విషయంలో వైసీపీది ద్వంద్వ వైఖరి అంటూ సోషల్ మీడియాలో ఓ రేంజ్‌లో కామెంట్లు కూడా పడుతున్నాయి. అంతేకాదు.. మరికొందరు జగన్ మార్క్ డబుల్ గేమ్ అంటూ.. కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు మరోసారి లోక్‌సభలో వక్ఫ్ బిల్లుపై చర్చ జరిగినప్పుడు వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారని ప్రచారం చేస్తున్నారు. అలాగే ఆ పార్టీ నలుగురు ఎంపీలు బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని కూడా సోషల్ మీడియాలో చెబుతున్నప్పటికీ.. దీనికి పెద్దగా స్పందన అయితే కనిపించడం లేదు.
ఈ నేపథ్యంలోనే వైసీపీ ఇప్పుడు కింకర్తవ్యం అంటూ.. తల పట్టుకుంది. మైనారిటీ ఓటు బ్యాంకుపై ఈ పార్టీ బారీ ఆశలు పెట్టుకోవడం.. గత ఎన్నికల సమయంలోనూ బీజేపీ చేతులు చాపినా స్నేహ హస్తం అందించకపోవడానికి కూడా ఇదే కారణమన్న విషయం తెలిసిందే. అధికారం కోల్పోయేందుకు కూడా వెనుకాడని వైసీపీ మైనారిటీలను వదులుకునేది లేదని తేల్చి చెప్పింది. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా.. వక్ఫ్ బిల్లుకు అనుకూలంగా ఓటేసిందన్న ప్రచారం విస్తృతంగా సాగుతుండడంతో అంతర్మథనంలో పడిపోయింది. దీని నుంచి బయట పడేందుకు ఉన్న మార్గాలపై అన్వేషణ ప్రారంభించింది. మరి ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on April 7, 2025 10:45 am
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మధ్యంతర ఎన్నికల సెగ భారీగా తగిలేలా కనిపిస్తోంది. మధ్యంతర ఎన్నికలు వచ్చే అక్టోబరు-నవంబరు మాసాల…
పెద్ది తర్వాత దర్శకుడు బుచ్చిబాబు బయట ఎక్కువ కనిపించడం లేదు. ఇరుముడి లాంటి ఒకటి రెండు ఈవెంట్స్ లో స్టేజి…
ఈ శుక్రవారం విడుదల కాబోతున్న సినిమాల్లో మహేంద్రగిరి వారాహి మీద క్రమంగా అటెన్షన్ వస్తోంది. పోటీ విపరీతంగా ఉన్నప్పటికీ కంటెంట్…
అమెరికాలో H-1B వీసాపై విదేశీ ఉద్యోగిని తీసుకోవాలంటే కంపెనీలు భారీగా అదనపు ఫీజు చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. ప్రతి H-1B…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ తాతా మధు వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపిన…
వైద్యో నారాయణో హరి అన్నారు పెద్దలు…అంటే రోగి ప్రాణాలు కాపాడే వైద్యుడు దేవుడితో సమానం అన్న నానుడిని ఇప్పటికీ చాలామంది…