Political News

అమెరికా టారిఫ్‌… కేంద్రానికి చంద్ర‌బాబు లేఖ‌!

అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండో సారి ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత‌.. ప్ర‌పంచ దేశాల దిగుమ‌తుల‌పై భారీఎత్తున సుంకాలు (టారిఫ్‌లు) విధిస్తున్న విష‌యం తెలిసిందే. త‌న-మ‌న అన్న తేడా లేకుండా.. అన్ని  దేశాల‌పైనా ఆయ‌న సుంకాల కొర‌డా ఝ‌ళి పిస్తున్నారు. దీంతో భార‌త దేశంపైనా భారీఎత్తున ప్ర‌భావం ప‌డుతోంది. కానీ.. ఈ విష‌యంపై కేంద్ర ప్ర‌భుత్వం నిమ్మ‌కు నీరెత్తిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌న్న వాద‌న కూడా ఉంది. అమెరికాతో చ‌ర్చ‌లు జ‌రుపుతామ‌ని చెబుతున్నా.. అవి సాకారం కావ‌డం లేదు. మ‌రోవైపు.. ఈ సుంకాల కార‌ణంగా ఏపీపై తీవ్ర ప్ర‌భావం పడుతోంది.

గ‌త రెండు రోజుల్లోనే అమెరికా పెంచిన సుంకాల కార‌ణంగా.. రొయ్య‌ల రంగం తీవ్రంగా దెబ్బ‌తింది. స‌ముద్ర ఉత్ప‌త్తుల‌కు కూడా గిరాకీ ప‌డిపోయింది. ఏపీ నుంచి రొయ్య‌లు, పీత‌లు, ఇత‌ర స‌ముద్ర ఉత్ప‌త్తులు విరివిగా అమెరికాకు ఎగుమ‌తి అవుతుంటాయి. ఈ క్ర‌మంలో అమెరికా పెంచిన టారిఫ్ కార‌ణంగా.. ఏపీ రొయ్యల సాగు రంగం తీవ్రంగా దెబ్బ‌తింది. దీనిపై మీడియా కూడా పెద్ద ఎత్తున ఫోక‌స్ చేసింది. ప్ర‌స్తుతం అమెరికా 27 శాతం మేర‌కు రొయ్య‌ల‌పై సుంకాలు విధించింది. దీనిని గ‌మ‌నించిన చంద్ర‌బాబు కేంద్రానికి ఆదివారం ఓ లేఖ రాశారు. దీనిలో ఆయ‌న అమెరికా సుంకాల‌పై జోక్యం చేసుకోవాల‌ని కోరారు.

ఈ మేర‌కు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌కు రాసిన లేఖ‌లో.. ఏపీలో ఎంత మంది మ‌త్స్య‌కారులు ఆక్వా సాగుపై ఆధార‌ప‌డి ఉన్నార‌న్న విష‌యాన్ని వివ‌రించారు. అంతేకాదు.. అమెరికా పెంచిన సుంకాలు.. త‌ద్వారా ఏర్ప‌డుతున్న న‌ష్టం వంటివాటిని కూడా పేర్కొన్నారు. ఏపీ ఆక్వారంగాన్ని ఆదుకోవాలని,  అమెరికా సుంకాల నుంచి ఆక్వా ఉత్పత్తులు మినహాయింపు పొందేలా అగ్ర‌రాజ్యంతో కేంద్రం చ‌ర్చ‌లు జ‌ర‌పాల‌ని ఆయ‌న విన్న‌వించారు.

రాష్ట్ర త‌ల‌స‌రి ఆదాయంలో ఆక్వా రంగం కీల‌కంగా ఉంద‌న్న విష‌యాన్ని ప్ర‌స్తావించారు. ప్ర‌స్తుతం ఏపీ ఆక్వా రంగంలో సంక్షోభం లో చిక్కుకునే ప్ర‌మాదం ఏర్ప‌డింద‌ని.. దీని నుంచి బ‌య‌ట ప‌డేయ‌క‌పోతే.. ల‌క్ష‌లాది మంది ఉపా ధి కోల్పోయే ప్ర‌మాదం ఉంద‌ని వివ‌రించారు. ఆక్వాపై 27 శాతం మేర‌కు(100కు 27 రూపాయ‌లు) సుంకాలు విధించ‌డం ద్వారా ఆక్వా కోలుకోలేని విధంగా దెబ్బ‌తింటుంద‌న్నారు. అధిక సుంకాల వల్ల ఏపీ ఆర్డర్లను ఇతర దేశాలు రద్దు చేసుకుంటున్నాయని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇక‌, ఆక్వా సాగు ఎలా ఉన్నా.. వీటి ఉత్ప‌త్తుల‌ను నిల్వ చేసుకునే స‌దుపాయాలు పెద్ద‌గా లేవ‌ని.. వీటికి కూడా కేంద్రం స‌హ‌క‌రించాల‌ని ఆయ‌న విన్న‌వించారు.

This post was last modified on April 6, 2025 11:10 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కదిలిస్తున్న ‘మంచు’ వారి వీడియో

మంచు ఫ్యామిలీ గొడవ గత కొన్ని రోజులుగా మీడియాలో హాట్ టాపిక్‌గా మారిపోన సంగతి తెలిసిందే. తండ్రీ కొడుకులు.. అన్నదమ్ములు…

37 minutes ago

రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. జ‌గ‌న్ భ‌ర‌తం ప‌డ‌తా!

"ఈ రోజు నుంచే.. ఈ క్ష‌ణం నుంచే నేను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నా.. ఏ పార్టీలో చేరేదీ త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తా. జ‌గ‌న్…

43 minutes ago

శ్రీవారికి త‌ల‌నీలాలు స‌మ‌ర్పించిన ప‌వ‌న్ క‌ల్యాణ్ స‌తీమ‌ణి!

తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం కోసం వ‌చ్చిన ఏపీ డిప్యూటీ సీఎం, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ స‌తీమ‌ణి, ఇటాలియ‌న్ అన్నాలెజెనోవో తిరుమ‌ల…

46 minutes ago

సుందరకాండకు సమస్యలు ఎందుకొచ్చాయి

నారా రోహిత్ కొత్త సినిమా సుందర కాండ టీజర్ వచ్చి తొమ్మిది నెలలు దాటేసింది. అప్పుడెప్పుడో సెప్టెంబర్ రిలీజ్ అనుకున్నారు…

3 hours ago

స్టూడెంట్‌గా దాచుకున్న సొమ్ము నుంచి కోటి ఖ‌ర్చు చేశా: నారా లోకేష్‌

మంగ‌ళగిరి నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి కోసం.. స్టూడెంట్‌గా ఉన్న‌ప్పుడు.. తాను దాచుకున్న సొమ్ము నుంచి కోటి రూపాయ‌ల‌ను ఖర్చు చేసిన‌ట్టు మంత్రి…

5 hours ago

అనకాపల్లి : బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు

నిజమే. బాణసంచా తయారీపై గానీ, టపాసుల నిల్వపై గానీ ఎక్కడ భద్రతా ప్రమాణాలు పాటిస్తున్న దాఖలాలే కనిపించడం లేదు. ఎక్కడికక్కడ నిత్యం…

6 hours ago