ఏపీలో భారీ ఎత్తున జరిగిందని భావిస్తున్న మద్యం కుంభకోణంలో గురువార ఓ కీలక పరిణామం చోటుచేసుకోగా… ఆ మరునాడు శుక్రవారం కూడా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న నాటి ప్రభుత్వ సలహాదారు, వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరున్న కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి ఏపీ హైకోర్టులో షాక్ తగిలింది. మద్యం కుంభకోణంలో విచారణకు రావాలంటూ సీఐడీ జారీ చేసిన నోటీసులను కొట్టి వేయాలంటూ కసిరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది. గురువారం ఇదే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలన్న మిథున్ రెడ్డి పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణకు చెందిన కసిరెడ్డి… జగన్ తో తనకున్న సంబంధాలతో వైసీపీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ సలహాదారు పదవిని పొందారు. ప్రభుత్వ సలహాదారు పదవి ద్వారా చేయాల్సిన పనిని పక్కనపెట్టేసిన కసిరెడ్డి..మద్యంలో ఆదాయం ఎలా సాధించాలి? దానిని ఎలా జేబుల్లో వేసుకోవాలి? ఎలా దేశాలు దాటించాలి? మద్యం కంపెనీల నుంచి నిధులను ఎలా రాబట్టాలి? ఇలా మొత్తం మద్యం కుంభకోణానికి ప్లాన్ చేశారట. ఇందుకోసం ఆయన ఏకంగా ఓ ప్రత్యేక నెట్ వర్క్ నే ఏర్పాటు చేసి ఐధేళ్ల పాటు దానిని పకడ్బందీగా నిర్వహించారట.
మొన్నటి ఎన్నికల్లో వైసీపీ అధికారం దిగిపోగానే…మద్యం కుంభకోణం వెలుగు చూసింది. కసిరెడ్డి ప్లాన్ వేస్తే… ఆయన వెనకుండి వైసీపీ కీలక నేత, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి తతంగాన్ని నడిపించారట. ఈ విషయాలను అటు సీఐడీ అదికారులతో పాటు సీఐడీ విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిలు బయటపెట్టారు. మద్యం కుంభకోణం మొత్తం కసిరెడ్డి చేతుల మీదుగానే జరిగిందని సాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మద్యం కుంభకోణం కేసులో విచారణకు రావాలంటూ సీఐడీ అదికారులు కసిరెడ్డికి నోటీసులు జారీ చేశారు.
ఈ నోటీసులను కసిరెడ్డి హైకోర్టులో సవాల్ చేశారు. తనకు సీఐడీ అధికారులు జారీ చేసిన నోటీసులను రద్దు చేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన హైకోర్టు…కసిరెడ్డి వాదనను తోసిపుచ్చింది. అంతేకాకుండా సీఐడీ అదికారులకు సహకరించాలని, విచారణకు హాజరు కావాలని ఆయనకు సూచిస్తూ కసిరెడ్డి పిటిషన్ ను కొట్టేసింది. ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని కూడా హైకోర్టు కసిరెడ్డికి తేల్చి చెప్పింది. ఫలితంగా సీఐడీ జారీ చేసిన నోటీసుల మేరకు కసిరెడ్డి విచారణకు హాజరుకాక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి..
This post was last modified on April 4, 2025 4:16 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్‌లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్‌చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…