వైసీపీలో ఫైర్ బ్రాండ్ నేతగా పేరు తెచ్చుకున్ని నగరి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆర్కే రోజాకు సంబంధించి ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ రవి నాయుడు బుధవారం సంచలన వ్యాఖ్యలు చేశారు. రోజా అరెస్టు తధ్యమని చెప్పిన ఆయన… ఏ క్షణంలో అయినా ఆమె అరెస్టు కావొచ్చంటూ ఆయన జోస్యం చెప్పారు. ఆడుదాం ఆంధ్రా పేరిట జరిగిన క్రీడా పోటీల్లో రోజా భారీ ఎత్తున అవినీతికి పాల్పడ్డారన్న రవి నాయుడు.. ఈ వ్యవహారం నుంచి రోజాను ఎవరూ కాపాడలేరంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రూ.119 కోట్ల మేర అక్రమాలకు పాల్పడ్డ రోజా ఈ కేసు నుంచి తప్పించుకకోవడం దుస్సాధ్యమని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆడుదాం ఆంధ్రాలో అసలు అవినీతే జరగలేదంటూ రోజా వివరణ ఇచ్చిన మరునాడే రవి నాయుడు ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
బుధవారం తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చిన రోజా… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన రోజా… ఆడుదాం ఆంధ్రాలో ఎలాంటి అవినీతి జరగలేదని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని తాము నిబంధనలకు అనుగుణంగానే… పక్కా ప్రణాళికతోనే నిర్వహించామని తెలిపారు. అయినా ఈ వ్యవహారంలో ఏదో తప్పు జరిగిపోయిందంటూ టీడీపీ ఆరోపణలు చేయడం తగదని కూడా ఆమె అన్నారు. నాడు శాప్ చైర్మన్ గా ఉన్న యువ నేత బైరెడ్డి సిద్ధార్థ రెడ్డికి ఇందులో పాత్ర లేదని, అయినా ఆయనను కూడా అరెస్టు చేస్తామంటూ కూటమి సర్కారు ప్రచారం చేస్తోందని ఆమె మండిపడ్డారు. అయినా అవినీతి జరిగితే కదా… ఎవరినైనా అరెస్టు చేసేది… అక్రమాలే జరగని ఆడుదాం ఆంధ్రాలో తనను అయినా, సిద్ధార్థ రెడ్డిని అయినా ఎలా అరెస్టు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
రోజా వ్యాఖ్యలు విన్నంతనే రవి నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడుదాం ఆంధ్రాపై ఇప్పటికే తమ కూటమి ప్రభుత్వం విచారణ చేపట్టిందని ఆయన తెలిపారు. ఈ విచారణ విషయం తెలిసినంతనే తీవ్ర భయాందోళనకు గురైన రోజా నెల రోజుల పాటుగా ఎక్కడో దాక్కున్నారని ఆయన ఆరోపించారు. అయితే జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిల సూచనతో ఆమె బుధవారం మీడియా ముందుకు వచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆడుదాం ఆంధ్రాలో అవినీతి జరగలేదని రోజా చెబుతున్నా… తాను తప్పు చేశానని, తన అరెస్టు తప్పదన్న భయం ఆమె ముఖంలోనే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ఓ వైపు ఆడుదాం ఆంధ్రాపై విచారణ జరుగుతుంటే… తిరుమల దర్శనాల ద్వారా రోజా వెనకేసుకున్న నిధులపైనా విచారణ జరుగుతోందని, నగరి నియోజకవర్గంలో జరిగిన అక్రమాలపైనా విచారణ జరుగుతోందని రవి నాయుడు అన్నారు. ఈ అన్నింటిలోనూ రోజా అరెస్టు కావడం ఖాయమని ఆయన తేల్చి చెప్పారు.
This post was last modified on April 3, 2025 2:07 pm
బంగారం అంటే భారతీయులకు కేవలం ఆభరణం మాత్రమే కాదు, అదొక సురక్షితమైన పెట్టుబడి. అయితే ఈ పసిడి ధరలు ఎందుకు…
ప్రేక్షకులు థియేటర్లకు వచ్చి సినిమా చూడాలని ప్రతి చిత్ర బృందం కోరుకుంటుంది. ఆ దిశగా విన్నపాలు చేస్తుంది. కానీ తీరా…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లో ఏప్రిల్ నెలకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈ నెలలో విడుదలైన…
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గురించి ప్రపంచ దేశాలకు పరిచయం అక్కర్లేదు. మహిళలపై నోరుపారేసుకునే నేతగా, స్త్రీలోలుడిగా ట్రంప్ నకు చెడ్డపేరుంది.…
గత ఏడాది టాలీవుడ్ బిగ్గెస్ట్ హిట్లలో ‘సంక్రాంతికి వస్తున్నాం’. సంక్రాంతి పండక్కి విడుదలైన ఈ మిడ్ రేంజ్ మూవీ.. ఎవ్వరూ…
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…