నిజమే… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే… ఆ గ్రామాల పూర్తి స్వరూప స్వభావాలే సమూలంగా మారిపోతాయని చెప్పక తప్పదు. పవన్ సొంతూరు మొగల్తూరుతో పాటుగా దానికి సమీపంలోని పెనుగొండల్లో ఇప్పుడు అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయి. రెండు గ్రామాల్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు కోట్ల కొలది నిధులు మంజూరయ్యాయి. తాజాగా ఈ రెండు గ్రామాలను చెత్త సమస్య నుంచి అధికార యంత్రాంగం పూర్తిగా దూరం చేయనుంది.
మొగల్తూరు, పెనుగొండల్లో ఏళ్ల తరబడి పేరుకుపోయిన చెత్తను ఎత్తివేసే కార్యక్రమం ఇప్పుడు ముమ్మరంగా సాగుతోంది. గురువారం సాయంత్రం నాటికే ఈ చెత్త తరలింపు కార్యక్రమం కూడా పూర్తి కానున్నట్లు సమాచారం. మొగల్తూరులో 9 ఏళ్లుగా 200 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. అదే సమయంలో పెనుగొండలో పదేళ్లుగా ఏకంగా 400 మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయింది. ఈ రెండు గ్రామాల్లో బుధవారం చెత్తను చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలకు తరలించే కార్యక్రమం ప్రారంభమైంది. ఇందులో స్థానిక అదికారులు తలమునకలై ఉన్నారు. ఈ చెత్త తరలింపు పూర్తి కాగానే…చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో పచ్చదనాన్ని పెంచే కార్యక్రమంతో పాటుగా స్థానికంగానే చెత్త సేకరణ, శుద్ధి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా చర్యలు సాగుతున్నాయి.
ఈ రెండు గ్రామాలకు పవన్ కల్యాణ్ స్వయంగా సందర్శించలేదు. అలాగని వాటి గురించి ఆయనకు తెలియనిదేమీ కాదు. తన యంత్రాంగానికి దిశానిర్దేశం చేసి పంపిన పవన్… ఆ రెండు గ్రామాల్లోని సమస్యలను వెలికి తీయించారు. ఇందులో భాగంగా రెండు గ్రామాల్లోని ఉన్నత పాఠశాలల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలుసుకుని… విద్యా శాఖ మంత్రిగా ఉన్న లోకేశ్ తో మాట్లాడి… పెనుగోండ స్కూల్ కు రూ.2.05 కోట్లు, మొగల్తూరు స్కూల్ కు రూ.1.71 కోట్లను మంజూరు చేయించారు. ఈ నిధులు అందేలోగానే అక్కడ చేయాల్సిన పనులకు ఏర్పాట్లు జరిగిపోతున్నాయి. ఆ పనులను అలా కొనసాగిస్తూనే…గ్రామాలను చెత్త నుంచి విముక్తి చేసే పనులకు శ్రీకారం చుట్టారు. సమీప భవిష్యత్తులోనే ఈ రెండు గ్రామాలు రాష్ట్రంలోనే మోడల్ గ్రామాలుగా అభివృద్ది చెందడం ఖాయమన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on April 2, 2025 10:08 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…