వైసీపీ అదినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీలో మరో కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. టీడీపీకి కంచుకోటగానే కాకుండా టీడీపీ దివంగత నేత, మాజీ మంత్రి పరిటాల రవీంద్ర అడ్డాగా పేరున్న రాప్తాడులో ఆయన త్వరలోనే పర్యటించనున్నారు. ఈ మేరకు ఈ విషయాన్ని మంగళవారం స్వయంగా జగనే వెల్లడించారు. త్వరలోనే రాప్తాడు వస్తానని… రాప్తాడు మండలం పాపిరెడ్డిపల్లి గ్రామంలో ఇటీవలే మరణించిన పార్టీ కార్యకర్త లింగమయ్య కుమారుడితో జగన్ చెప్పారు. వచ్చే మంగళవారం ఈ పర్యటన ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
రాప్తాడు ఎమ్మెల్యేగా ప్రస్తుతం పరిటాల రవీంద్ర సతీమణి, మాజీ మంత్రి పరిటాల సునీత కొనసాగుతున్నారు. ఇక వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి గత ఐదేళ్లుగా ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగారు. ఇటీవల జరిగిన స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికల్లో వైసీపీ, టీడీపీ శ్రేణుల మధ్య ఓ రేంజిలో గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. ఎంపీపీ పదవిని దక్కించుకునే నిమిత్తం వైసీపీకి చెందిన ఎంపీటీసీలను తమ వైపునకు తిప్పుకునేందుకు టీడీపీ విఫల యత్నాలు చేసిందని తోపుదుర్తి ఆరోపించారు. ఈ క్రమంలో పోలీసులు, టీడీపీ శ్రేణులపైకి తోపుదుర్తి దూసుకువెళ్లిన వీడియోలు ఇటీవల పెను కలకలమే రేపాయి.
ఈ గొడవల నేపథ్యంలోనే పాపిరెడ్డిపల్లికి చెందిన లింగమయ్యపై దాడి జరిగింది. దాడిలో తీవ్రంగా గాయపడ్డ లింగమయ్య ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోయారు. ఈ దాడి చేసింది టీడీపీ నేతలేనని, పరిటాల శ్రీరామ్ చిన్నాన్న కుటుంబమే స్వయంగా ఈ దాడిలో పాలుపంచుకుందని తోపుదుర్తి ఆరోపిస్తున్నారు. అయితే ఈ దాడితో తమకు ఎలాంటి సంబంధం లేదని తాజాగా మంగళవారం సునీత ఓ బహిరంగ ప్రకటన చేశారు. కుటుంబతగాదాల నేపథ్యంలో లింగమయ్యపై దాడి జరిగితే..తోపుదుర్తి కావాలనే దానికి రాజకీయ రంగు పులుముతున్నారని ఆరోపించారు.
ఇదిలా ఉంటే…లింగమయ్యపై జరిగిన దాడి టీడీపీ పనేనని సోమవారం జగన్ ఆరోపిస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. తాజాగా మంగళవారం ఉదయం ఆయన నేరుగా లింగమయ్య కుమారుడికి ఫోన్ చేసి పరామర్శించారు. లింగమయ్య మృతి బాధాకరమన్న జగన్.. మీకు అండగా ఉంటాయని ఆయన కుమారుడికి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల నుంచి తమకు ప్రాణ హానీ ఉందని బాధితుడు తెలపగా… త్వరలోనే తానే స్వయంగా వస్తానని, భయపడాల్సిన అవసరం లేదని, అందరం అండగా ఉంటామని, ధైర్యంగా ఉండాలని సూచించారు. ఈ కాల్ తర్వాత రాప్తాడుకు జగన్ వస్తున్న విషయాన్ని తోపుదుర్తి కూడా ధ్రువీకరించారు.
This post was last modified on April 1, 2025 12:21 pm
బీఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, ఎంపీ…
ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం…
ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…
ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…