వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కోసం ఏపీ పోలీసులు వేట సాగిస్తున్నారు. కాకాణి సొంత జిల్లా నెల్లూరు పరిధిలో అక్రమ మైనింగ్ జరిగిందన్న ఆరోపణలపై గతంలోనే ఓ కేసు నమోదు అయ్యింది. ఈ కేసులో నిందితులంతా కాకాణి అనుచరులే ఉండగా… తాజాగా కాకాణికి కూడా ఈ కేసులో ప్రమేయం ఉందన్న ఆధారాలతో పోలీసులు ఆయన పేరును ఏ4 గా చేర్చారు.
ఈ క్రమంలో విచారణకు రావాలంటూ కాకాణికి పోలీసులు ఆదివారం నోటీసులు జారీ చేశారు. అయితే ఆయన ఈ నోటీసులను తీసుకోలేదు. సోమవారం విచారణకు హాజరు కావాల్సి ఉన్నా అడ్రెస్ లేకుండాపోయారు. దీంతో కాకాణి ఆచూకి కోసం పోలీసులు వేట మొదలుపెట్టి…ఎట్టకేలకు ఆయనకు సోమవారం నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు హాజరు కావాలంటూ ఆదేశాలు జారీ చేశారు.
అక్రమ మైనింగ్ కేసులో విచారణకు రావాలని కోరుతూ ఆదివారం కాకాణికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు నెల్లూరులోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే ఇంటికి తాళం వేసి ఉండటం.. ఫోన్ చేయగా కాకాణి మొబైల్ స్వీచ్ఛాఫ్ అని రావడంతో ఆయన ఇంటి గేటుకు నోటీసులు అంటించారు. అయితే సోమవారం నిర్దేశిత సమయం ముగిసినా కాకాణి అడ్రెస్ కనిపించలేదు.దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కాకాణి కోసం ఆరా తీశారు. ప్రస్తుతం ఆయన నెల్లూరులో కాకుండా హైదరాబాద్ లో ఉన్నారన్న సమాచారంతో నెల్లూరు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు.
ఈ సందర్భంగా కాకాణి ఆచూకీని పోలీసులు గుర్తించారు. సోమవారం ఎలాగూ విచారణకు రాలేదు కదా… కనీసం మంగళవారమైనా విచారణకు హాజరు కావాలని ఆయనకు నోటీసులు జారీ చేశారు. మంగళవారం విచారణకు రాకపోతే చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని వారు ఆయనను హెచ్చరించారు.
అయితే విచారణకు వెళితే… ఎక్కడ తనను అరెస్టు చేస్తారోనన్న భయంతో కాకాణి పోలీసులకు కనిపించకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లుగా వార్లు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా గతంలో మాజీ మంత్రి పేర్ని నాని బెయిల్ వచ్చేదాకా ఎలాగైతే తప్పించుకుని తిరిగారో… ఇప్పుడు కాకాణి కూడా అదే రీతిన వ్యవహరిస్తున్నారన్న వాదనలూ లేకపోలేదు. ఇప్పటికే ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ కాకాణి హైకోర్టును ఆశ్రయించగా… ఆయన పిటిషన్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. దీంతో తన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ చేపట్టి.. తనకు ముందస్తు బెయిల్ మంజూరు అయ్యేదాకా పోలీసులకు కనిపించకూడదన్న భావనతో కాకాణి తిరుగుతున్నట్లుగా సమాచారం.
అయితే కాకాణి ఆచూకీని ఎట్టకేలకు పట్టేసిన పోలీసులు విచారణకు హాజరు కావాలంటే నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా విచారణకు హాజరుకాని పక్షంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ ఆయనకు పోలీసులు ఒకింత సీరియస్ వార్నింగే ఇచ్చినట్లు సమాచారం. మరి మంగళవారం నాటి విచారణకు కాకాణి హాజరవుతారా? లేదా? అన్న దానిపై రకరకాల విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on March 31, 2025 1:21 pm
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సతీమణిగానే నిన్నటిదాకా కొనసాగిన నారా భువనేశ్వరి ఇప్పుడు సరికొత్త బాధ్యతల్లోకి ఒదిగిపోయారని…
టీడీపీ సీనియర్ నాయకుడు, దెందులూరు ఎమ్మెల్యే , ఫైర్ బ్రాండ్ నాయకుడిగా పేరున్న చింతమనేని ప్రభాకర్.. తన చెయ్యి పెద్దదని…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనం రేకెత్తించి.. అనేక అనుమానాలను కూడా సృష్టించిన పాస్టర్ ప్రవీణ్ కుమార్ పగడాల మృతి వ్యవహారంలో…
ఏపీలో కీలకమైన ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలు.. గత వారం రోజులుగా నిరసనలు, ధర్నాలు చేస్తున్నారు . అయితే.. ప్రభుత్వం…
స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ... కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను…
వారంతా చిన్న చితకా కాంట్రాక్టర్లు. చిన్నపాటి పనులు చేసుకుని తమ జీవితాలను, తమపై ఆధారపడిన కూలీల జీవితాలను నడిపిస్తున్నారు. వీరంతా…