తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినాన ఆదివారం వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఊహించని షాక్ తగిలింది. నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ చేపట్టారన్న ఆరోపణలపై కాకాణిపై పోలీసులు ఇటీవలే కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇది పాత కేసే అయినప్పటికీ… కాకాణి ప్రమేయాన్నికూడా నిర్ధారించుకున్న పోలీసులు ఆయన పేరును తాజాగా ఈ కేసులో జత చేశారు. ఈ కేసులో సోమవారం విచారణకు రావాలంటూ పోలీసులు ఉగాది రోజున ఆయనకు నోటీసులు జారీ చేశారు.
ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసులు నోటీసులు తీసుకుని తన ఇంటికి వస్తున్నారన్న సమాచారం అందుకున్న కాకాణి… పోలీసులు వచ్చేలోగానే తన ఇంటికి తాళం వేసుకుని ఎక్కడికో వెళ్లిపోయారట. తీరా పోలీసులు అక్కడికి వచ్చేసరికి కాకాణి ఇంటికి తాళం ఉండటం చూసి పోలీసులు షాక్ తిన్నారట. అయితే ఫోన్ చేసి చూద్దామన్న భావనతో ఆయన మొబైైల్ కు ఫోన్ చేయగా… అది స్విచ్చాఫ్ అని వచ్చిందట. ఆ తర్వాత కాకాణి పీఏకు ఫోన్ చేసినా స్విచ్చాఫ్ అనే సందేశమే వచ్చిందట.
దీంతో కాసేపు అక్కడే వేచి చూసిన పోలీసులు… కాకాణికి అందించేందుకు తీసుకువచ్చిన నోటీసులను కాకాణి ఇంటి గేటుకు అంటించారట. ఈ నోటీసుల ప్రకారం అక్రమ మైనింగ్ కేసులో సోమవారం ఉదయం 11 గంటలకు నెల్లూరులోని డీఎస్పీ కార్యాలయంలో జరిగే విచారణకు కాకాణి హాజరుకావాల్సి ఉందట. మరి నోటీసులు తీసుకునేందుకే వెనుకాడిన కాకాణి.. సోమవారం విచారణకు హాజరవుతారా? అన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి. అయినా ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని మొన్నటికి మొన్న ఒకింత ఘనంగానే ప్రకటన చేసిన కాకాణి…ఒక్క కేసు నోటీసులు తీసుకునేందుకే ఇలా జడుసుకున్నామేరిటీ? అన్న దిశగా టీడీపీ శ్రేణుల నుంచి సెటర్డు పడిపోతున్నాయి.
This post was last modified on March 31, 2025 7:12 am
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…