ఏపీ వాణిజ్య రాజధానిగా పేరుగాంచిన విశాఖపట్టణం… గతంలో ఎలా ఉందో, భవిష్యత్తులోనూ అలాగే ఉండనుంది. వైసీపీ అధికారంలో ఉన్నంత కాలం విశాఖను ఏపీకి కార్యనిర్వాహక రాజధానిగా చేస్తారన్న ప్రచారం సాగేది. అంతేనా…రిషికొండ ను తొలిచి మరీ వందల కోట్ల నిధులు ఖర్చు పెట్టి అధునాతన సౌకర్యాలతో కూడిన రాజమహల్ లాంటి భవనాన్ని కూడా జగన్ సర్కారు నిర్మించింది. గతంలో మాట ఎలా ఉన్నా… మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తిరిగి గెలిచి ఉంటే మాత్రం జగన్ ఈ రాజ మహల్ నుంచే పాలన సాగించేవారు. రాజధానిగా మారుతుందన్న వాదనలు ఉన్నప్పుడు కూడా విశాఖలో పెద్దగా రియల్ ఎస్టేట్ ధరలు పెరిగిన దాఖలా లేదనే చెప్పాలి. కాని కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత… రాజధానిగా మారే అవకాశం విశాఖకు లేదని తెలిసిన తర్వాత విశాఖలో రియల్ దరలు ఆకాశాన్నంటేశాయి.
విశాఖ నగరంలో రియల్ ధరలు నిజంగానే సామాన్యులకు అందనంత ఎత్తుకు చేరిపోయాయి. పోనీ నగర శివారులో ఇల్లు కొందామన్నా కూడా అక్కడి ధరలు సామాన్యుడికి అందనంత ఎత్తులో ఉన్నాయన్న విశ్లేషణలు సాగుతున్నాయి. ఎప్పుడైతే భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణం మొదలైందో విశాఖ చుట్టుపక్కల పరిధిలో రియల్ ఎస్టేట్ ఒక్కసారిగా ఊపందుకుంది. అదే సమయంలో పెద్ద ఎత్తున సాగు భూములు, నిరుపయోగంగా ఉన్న భూములన్నీ రెసిడెన్షియల్, కమర్షియల్ అపార్ట్మెంట్లుగా మారిపోతున్నాయి. ఈ తరహా కార్యకలాపాలు విశాఖ నలుదిక్కులా జెట్ స్పీడుతో జరుగు తున్నాయి. వెరసి విశాఖకు ఏ దిక్కున వెళ్లి ఇల్లు కొనాలన్నా…ధరలు మాత్రం అంతకంతకూ పెరిగిపోతున్నాయన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం విశాఖకు ఓ చివర ఉన్న యారాడలో ఓ డబుల్ బెడ్ రూం ఫ్లాట్ కొనాలంటే ఏకంగా రూ.2 కోట్ల మేర పెడితే తప్పించి ఇల్లు దొరకడం లేదట. కూటమి సర్కారు అదికారంలోకి రాకముందు ఇక్కడ డబుల్ బెడ్ రూం ఇల్లు రూ.1.2 కోట్లకు లభిస్తే… అదే ఇల్లు ఇప్పుడు ఏకంగా రూ.1.9 కోట్లకు పెరిగిందట. అంటే… ఈ 10 నెలల కాలంలోనే దాదాపు గా 50 శాతం మేర ధరలు పెరిగాయి. ఇక ఇప్పటి సరకొత కల్చర్ అయిన విల్లాల విషయానికి వస్తే… విశాఖకు ఏ మూల వెళ్లినా హీనపక్షం రూ.6 కోట్లు పెడితే తప్పించి విల్లా దొరకడం లేదట. ఈ ధరలు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ధరలకు థీటుగా ఉన్నాయన్న మాట కూడా వినిపిస్తోంది. కోకాపేట లాంటి ప్రాంతంలో రూ.6 కోట్ల కంటే తక్కువకే విల్లా దొరుకు తుంటే… అదే విశాఖలో మాత్రం నగర శివారులోనూ ఆ ధరకు విల్లా దొరకడం లేదు. వెరసి అతి త్వరలోనే రియల్ రంగంలో హైదరాబాద్ ను దాటేసి విశాఖ దూసుకెళ్లిపోతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 30, 2025 4:12 pm
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…