దేశంలో ఇప్పుడు ఎక్కడ చూసినా… జమిలి ఎన్నికలు వస్తాయా? రావా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు సాగుతున్నాయి. అంతేకాకుండా కేంద్రంలో అదికారంలో ఉన్న ఎన్డీఏ జమిలి ఎన్నికలకు అనుకూలంగా పకడ్బందీగా పావులు కదుపుతున్న నేపథ్యంలో జమిలి జరిగితే పరిస్థితి ఎలా ఉంటాయన్న దిశగానూ ఆసక్తికర చర్చ సాగుతోంది. ఇలాంటి నేపథ్యంలో బీజేపీ సీనియర్ మోస్ట్ నేత, భారత మాజీ రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శనివారం ఈ విషయంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పరిస్థితి రావడానికి కారణం కాంగ్రెస్సేనని ఆయన వ్యాఖ్యానించారు. జమిలి ఎన్నికలకు తూట్లు పొడిచిన కాంగ్రెస్…ఇప్పుడు జమిలి ప్రతిపాదనకు వ్యతిరేకంగా సాగుతోందని ఆయన విమర్శించారు.
‘ఒకే దేశం-ఒకే ఎన్నిక ప్రాముఖ్యత-సవాళ్లు-ప్రభావం’ పేరిట విజయవాడలో శనివారం ఓ కీలక సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకయ్య కీలకోపన్యాసం చేశారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలను ప్రస్తావించారు. స్వతంత్ర భారతావనిలో తొలి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయని ఆయన గుర్తు చేశారు. నాడు పార్లమెంటు ఎన్నికలతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకే సారి… అంటే మనం ఇప్పుడు చెప్పుకుంటున్న జమిలి ఎన్నికలే జరిగాయని ఆయన తెలిపారు. అప్పటి నుంచి 15 ఏళ్ల పాటు… అంటే 1952 ఎన్నికలతో కలుపుకుంటే 4 సార్వత్రిక ఎన్నికలు జమిలి పద్దతిలోనే జరిగాయని ఆయన గుర్తు చేశారు.
అయితే నాడు దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన కాంగ్రెస్ నేత ఇందిరా గాంధీ… దేశంలోని పలు రాష్ట్రాల్లో కొనసాగుతున్న ప్రభుత్వాల్లో తనకు నచ్చని ప్రభుత్వాలను నిర్ధీత కాలం కంటే ముందుగానే రద్దు చేసుకుంటూ వెళ్లిపోయారని వెంకయ్య ఆరోపించారు. అలా ప్రభుత్వాలు రద్దు అయిపోయిన రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలకు ముందే ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చిందన్నారు. ఆ పరిస్థితి అలా కొనసాగుతూనే రాగా… జమిలి ఎన్నికల మాటే వినిపించలేదన్నారు. వెరసి జమిలి అనేది కొత్త పద్దతి కాదన్న వెంకయ్య… దేశంలో ఆది నుంచి అదే పద్దతి కొనసాగిందని గుర్తు చేశారు. నాడు జమిలి ఎన్నికల పద్ధతికి తూట్లు పొడిచింది కాంగ్రెస్సేనని ఆరోపించిన వెంకయ్య… ఇప్పుడు అదే పద్ధతి తీసుకొస్తామంటే అదే పార్టీ అడ్డుకుంటూ ఉండటం శోచనీయమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on March 30, 2025 10:13 am
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…
నిన్న కన్నప్ప ప్రీమియర్ జరిగిందంటూ కొన్ని ఫోటో ఆధారాలతో వార్త బయటికి రావడంతో అభిమానులు నిజమే అనుకున్నారు. కానీ వాస్తవానికి…
వైసీపీ అధికారంలో ఉండగా…2019 నుంచి 2024 వరకు ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ అదికారంలో ఉంది. ఇప్పుడూ…