జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ మనసు ఎంత సున్నితమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏ విషయం అయినా తన మనసుకు నచ్చిందంటే… దాని కోసం ఆయన ఏమైనా చేస్తారు. ఎంత దూరం అయినా వెళతారు. అది సినిమా అయినా..నిజ జీవితం అయినా ఆయన అదే వైఖరితో సాగుతారు. ఇప్పుడు రాజకీయ నేతగా ఉచ్ఛ దశలో ఉన్న పవన్ మరింతగా సున్నితంగా మారిపోయారని చెప్పక తప్పదు. ఏదైన తన దృష్టికి వచ్చి.. తన మనసును హత్తుకోవడమో, లేదంటే తన మనసును కలచివేయడం జరిగిందంటే… దాని గురించి ఆయన ప్రత్యేక శ్రద్ధ పెట్టేస్తున్నారు. అలాంటి వాటిని ఆయన ఎంత గ్యాప్ వచ్చినా గానీ మరిచిపోవడం లేదు. అందుకు నిదర్శనంగా నిలుస్తున్న ఘటన ఒకటి ఇప్పుడు చోటుచేసుకుంది.
మొన్నటి సార్వత్రిక ఎన్నికల తర్వాత టీడీపీ, బీజేపీతో కలిసి బిగ్ విక్టరీ కొట్టేసిన పవన్… ఏపీకి డిప్యూటీ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. తనకు దక్కిన గురుతర బాధ్యతను భుజానికెత్తుకున్న పవన్.. ఏదో ఏసీ గదుల్లో కూర్చునేందుకు పరిమితం కాలేదు. తనకు ఇష్టమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఆయన పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ పర్యటనల్లో ఆయన స్వామి కార్యంతో పాటు స్వకార్యం అన్నట్లుగా సాగారు. అందులో బాగంగా మొన్నామధ్య అల్లూరి జిల్లా పరిధిలోని అరకు లో పర్యటించారు. ఈ సందర్భంగా అక్కడి గిరిజన మహిళలు పవన్ పట్ల తమకున్న ప్రేమ, ఆప్యాయతలను చూపారు. పవన్ ను తమ ఇష్ట దైవంగా పరిగణిస్తున్నట్లుగా వ్యవహరించారు. నాడు వారు చూపిన ఆప్యాయత పవన్ మనసులో అలా నిక్షిప్తమైపోయింది.
ఇప్పుడు ఉగాది పండగ వచ్చిందిగా. పండుగ సంబరాల గురించి ఆలోచిస్తూ ఉండగా… అరకు గిరి మహిళలు తన పట్ల చూపిన ప్రేమాభిమానాలు పవన్ మదిలో మెదిలాయి. ఆ వెంటనే గిరి మహిళల ఇళ్లల్లో సంతోషం నింపాలని ఆయన నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడవుగా పండుగ వేళ అరకు గిరి మహిళలకు చీరలు బహూకరించాలని ఆయన తీర్మానించుకున్నారు. ఆ వెంటనే అక్కడి గిరి మహిళలకు చీరలు తెప్పించారు. వాటిని అరకు పంపి గిరి మహిళలకు అందేలా చేశారు. ఆ చీరలను చూసిన గిరి మహిళల మోములో సంతోషాలు వెల్లి విరిశాయి. ఒక్కసారి ఆప్యాయంగా పలకరించినందుకే డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా తమను గుర్తు పెట్టుకుని మరీ తమకు చీరలు పంపిన పవన్ గొప్ప మనసును వారి గుర్తు చేసుకుంటూ సంబరాల్లో మునిగిపోయారు. వెరసి గిరి మహిళల ఇళ్లలో ఉగాది సంబరాలను పవన్ రెట్టింపు చేశారని చెప్పక తప్పదు.
This post was last modified on March 30, 2025 11:44 am
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల…
రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…