Political News

టీడీపీ రికార్డును ఎవ‌రూ చెర‌ప‌లేరు: చంద్ర‌బాబు

తెలుగుదేశం పార్టీ సృష్టించిన రికార్డును ఎవ‌రూ చెర‌ప‌లేర‌ని.. ఎవ‌రూ తిర‌గ‌రాయ‌లేర‌ని ఆ పార్టీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు ఉద్ఘాటించారు. టీడీపీ 43వ వ్య‌వ‌స్థాప‌క దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన వేడుక‌ల్లో సీఎం చంద్ర‌బాబు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా తొలుత పార్టీ ప‌తాకాన్ని ఆవిష్క‌రించారు. అనంత‌రం.. పార్టీ నాయ‌కులు, అభిమానుల మ‌ధ్య 43 కేజీల కేక్‌ను క‌ట్ చేసి.. అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలిపారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. “ఒక మహనీయుడి విజన్‌ తెలుగు దేశం పార్టీ” అని అన్నారు. ఒక స‌మున్న‌త ల‌క్ష్యంతో టీడీపీ జ‌న్మించింద‌న్నారు. పార్టీ పెట్టిన 9 మాసాల్లోనే టీడీపీ అధికారం ద‌క్కించుకుని చ‌రిత్ర సృష్టించింద‌న్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం ఎన్టీఆర్ తాప‌త్ర‌యప‌డ్డార‌ని తెలిపారు. ఈ క్ర‌మంలోనే తెలుగు వారి కోసం ఆయ‌న పార్టీని స్థాపించార‌ని చెప్పారు. టీడీపీకి ప్ర‌తి ఒక్క‌రూ వారసులేన‌ని చంద్ర‌బాబు చెప్పారు.

తాను కేవ‌లం పార్టీకి అధ్య‌క్షుడిని మాత్ర‌మేన‌ని.. అంద‌రం పార్టీకి వార‌సుల‌మేన‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. ఒక ఆద‌ర్శం కోసం.. ఒక ఆత్మ‌గౌర‌వం కోసం పుట్టిన పార్టీ టీడీపీనేన‌ని చెప్పారు. ఎన్టీఆర్‌లాంటి వ్య‌క్తి మ‌ళ్లీ జ‌న్మించ‌బోర‌ని చెప్పారు. ఎన్టీఆర్ లాంటి వ్య‌క్తి మ‌ళ్లీ పుట్టాలంటూ.. మ‌ళ్లీ ఎన్టీఆరే పుట్టాల‌ని వ్యాఖ్యానించారు. ప్రతి కార్యకర్తకు న్యాయం చేస్తామ‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు హామీ ఇచ్చారు. పార్టీ కోసం కృషి చేసిన వారికి త‌ప్ప‌కుండా గుర్తింపు ఉంటుంద‌న్నారు.

తెలుగు నేల, తెలుగు వారు ఎక్క‌డున్నా.. స‌గ‌ర్వంగా చెప్పుకొనేలా పార్టీని తీర్చిదిద్దామ‌ని చంద్ర‌బాబు చెప్పారు. “మేం పెత్తందారులం కాదు. సేవ‌కులం. పార్టీలోనే ఉన్న ప్ర‌తికార్య‌క‌ర్త‌కు ఏ క‌ష్టం వ‌చ్చినా.. ఆదుకుంటాం” అని చంద్ర‌బాబు నొక్కిచెప్పారు. “పార్టీని లేకుండా చేయాల‌ని అనుకున్న‌వారు.. ఇప్పుడు లేకుండా పోయారు. కాల గ‌ర్భంలో క‌లిసిపోయారు. టీడీపీది ప్ర‌జా బ‌లం, ముహూర్త బ‌లం.” అని వ్యాఖ్యానిస్తూ.. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను ప‌రోక్షంగా విమ‌ర్శించారు.

This post was last modified on March 29, 2025 2:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రభాస్ ఇమేజ్ సరిపోవట్లేదా రాజా?

మాములుగా ప్రభాస్ కొత్త సినిమా వస్తోందంటే ఆ యుఫోరియా వేరే లెవెల్ లో ఉంటుంది. సలార్ కు పెద్దగా ప్రమోషన్లు…

24 minutes ago

జగన్ కోటి సంతకాల కృషి ఫలించేనా?

రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో నిర్మించేందుకు వ్యతిరేకంగా వైసీపీ నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కోటి…

38 minutes ago

మారిపోయిన దేవర విలన్

బాలీవుడ్ స్టార్లు ప్రైవేటు పెళ్లిళ్లకు వెళ్లి డ్యాన్సులు చేయడం ఎప్పట్నుంచో ఉన్న సంప్రదాయమే. అందుకోసం భారీగా పారితోషకాలు అందుకుంటూ ఉంటారు. షారుఖ్…

3 hours ago

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

4 hours ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

4 hours ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

4 hours ago