హైదరాబాద్ క్రికెట్ అభిమానుల కోసం తెలంగాణ ఆర్టీసీ ఓ మంచి వార్త అందించింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో జరగనున్న ఐపీఎల్ మ్యాచ్‌లకు వెళ్లే అభిమానుల రవాణా అవసరాల్ని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 24 డిపోల నుంచి మొత్తం 60 బస్సులను ఆటగాళ్లు, ప్రేక్షకుల సౌకర్యార్థం నడపనున్నారు.
ఈ సర్వీసులు ఐపీఎల్ మ్యాచ్‌లు జరిగే రోజుల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయి. మార్చి 27 నుంచి మే 21 వరకు ఉప్పల్ స్టేడియంలో జరిగే 8 మ్యాచ్‌లకు ఈ ప్రత్యేక బస్సులు సేవలందించనున్నాయి. మ్యాచ్‌ల తేదీలు ఇలా ఉన్నాయి: మార్చి 27, ఏప్రిల్ 6, 12, 23, మే 5, 10, 20, 21. ఈ రోజుల్లో ఉప్పల్‌కు వెళ్లే అభిమానులు ప్రత్యేకంగా ఈ బస్సులను వినియోగించుకోవచ్చు. ఇది ట్రాఫిక్ సమస్యలు నివారించడానికే కాకుండా, సురక్షిత ప్రయాణానికి సహాయపడనుంది.
బోయినపల్లి, ఎల్బీనగర్, కోటి, ఘట్‌కేసర్, హయత్ నగర్, ఎన్‌జీవోస్ కాలనీ, BHEL లక్డీకాపూల్, దిల్‌సుఖ్‌నగర్, మేడ్చల్, కూకట్‌పల్లి, మియాపూర్, జేబీఎస్, చార్మినార్, చాంద్రాయణగుట్ట, మెహిదీపట్నం, వంటి ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియానికి నేరుగా వెళ్లేలా బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. వీటిని వేళల వారీగా ప్రణాళిక రూపొందించి ఆట ప్రారంభానికి రెండు గంటల ముందు నుంచే ప్రారంభిస్తారు.
ఈ చర్యతో ప్రజలు సొంత వాహనాలతో వెళ్లకుండా, సరళంగా ఆట చూసేందుకు స్టేడియానికి చేరుకోవచ్చు. ట్రాఫిక్ ఇబ్బందులు, పార్కింగ్ సమస్యలు లేకుండానే క్రికెట్‌ను ఆస్వాదించేందుకు ఇది ఒక గొప్ప అవకాశం. ఫ్యాన్స్ కోసం ఆర్టీసీ ముందుచూపుతో తీసుకున్న ఈ నిర్ణయం, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ నిర్వహణకు కూడా తోడ్పడనుంది. మొత్తం మీద, ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ సందడి కోసం నగరమంతటినుండి వచ్చే అభిమానులకు ఇది చక్కటి సౌకర్యంగా నిలవనుంది.
This post was last modified on March 26, 2025 8:21 pm
ఇవాళ సల్మాన్ ఖాన్ సికందర్ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలయ్యింది. ప్రమోషనల్ కంటెంట్ బజ్ ని పెంచలేకపోయినా కండల వీరుడి మాస్…
ఏపీ సీఎం చంద్రబాబు ఉగాదిని పురస్కరించుకుని కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలుగు వారి పండుగలలో ప్రధంగా వచ్చే ఉగాదిని పురస్కరించుకుని…
నవ్యాంధ్ర ప్రదేశ్ నూతన రాజధాని అమరావతికి ఇకపై ఎలాంటి ముప్పు వాటిల్లే అవకాశమే లేదు. అంతేనా… అమరావతిని ఏపీకి రాజధానిగా…
అనూహ్యంగా రాజకీయ రంగు పులుముకున్న ఎల్2 ఎంపురాన్ కంటెంట్ గురించి అభ్యంతరాలు తలెత్తి దర్శకుడు పృథ్విరాజ్ సుకుమారన్, రచయిత గోపి…
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) - సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి మధ్య తాజా వివాదం తీవ్రంగా మారేలా కనిపిస్తోంది. ఉచిత…
తెలంగాణలో కొలువుల కోసం కోట్ల కళ్లతో ఎదురు చూస్తున్న ఉద్యోగార్థులకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం నిజంగానే…