టీడీపీ యువ నేత, నరసరావుపేట ఎంపీ, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు మంగళవారం కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ భేటీ ఏపీలో విపక్షం వైసీపీలో వణుకు పుట్టించిందన్న వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. అయితే ఈ భేటీ ఎలా జరిగిందన్నదానిపై పలు మీడియా సంస్థలు ఆసక్తికర అంశాలను ప్రస్తావిస్తూ కథనాలు రాశాయి. అమిత్ షా వద్దకు రాయలు తనంత తానుగా వెళ్లలేదని, అమిత్ షానే స్వయంగా టీడీపీ ఎంపీని పిలిపించుకుని మరీ భేటీ అయ్యారని ఆ సంస్థలు చెబుతున్నాయి. ఈ మాటలు నిజమే అయితే గనుక… వైసీపీకి గడ్డు కాలం దాపురించినట్టేనని చెప్పక తప్పదు.
సోమవారం నాటి పార్లమెంటు సమావేశాల్లో భాగంగా ఏపీలో వైసీపీ పాలనలో మద్యం కుంభకోణం జరిగిందని, దీని ద్వారా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రూ.4 వేల కోట్లను దేశం దాటించి దుబాయి పంపారని రాయలు సంచలన ఆరోపణలు గుప్పించారు. ఈ సందర్బంగా రాయలు చేసిన ప్రసంగం యావత్తు దేశ ప్రజలను ఆకట్టుకుంది. ఈ ప్రసంగాన్ని అమిత్ షా కూడా విని ఆశ్చర్యం వ్యక్తం చేశారట. ఆ తర్వాత దీని సంగతేమిటో చూద్దామంటూ రాయలును అమిత్ షా తన కార్యాలయానికి పిలిపించుకున్నారన్నది ఆ మీడియా సంస్థల కథనం సారాంశం. అమిత్ షా నుంచి పిలుపు రాగానే.. ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణానికి సంబంధించిన పూర్తి వివరాలను చేత బట్టుకుని మరీ రాయలు అమిత్ షా కార్యాలయంలోకి అడుగు పెట్టారట.
ఈ సందర్బంగా ఏపీలో చోటుచేసుకున్న మద్యం కుంభకోణం, దానికి వైసీపీ నేతలు తెర తీసిన వైనం… దాని ద్వారా వైసీపీ పెద్దలు వెనకేసుకున్న మొత్తాలు… ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన నేతలు, అధికారంలోకి రాగానే వైసీపీ నతలు కొత్త డిస్టిల్లరీలకు అనుమతులు జారీ చేయడం, వాటిని ఓ సిండికేట్ గా మార్చేసి… మద్యం ఉత్పత్తికి ముందే వసూళ్లకు ప్పాల్పడిన తీరుపై రాయలు వివిస్తూ ఉంటే… అమిత్ షా అలా ఆశ్చర్యంగా వింటూ ఉండిపోయారట. అంతేకాకుండా తాను చేసిన ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను రాయలు అందజేయగా.. వాటిని అమిత్ షా కూలంకషంగా పరిశీలించారట. మొత్తంగా పార్లమెంటులో తాను చేసిన ఆరోపణలు ఏదో అదాటుగా చేసినవి కావని, అన్నీ పక్కా ఆధారాలతోనే చేసినవి అని రాయలు.. అమిత్ షా ముందు తేల్చి చెప్పారు.
ఇప్పటికే ఢిల్లీలో అవినీతి లేని పాలన అంటూ అధికారం చేజిక్కించుకుని ఇటు బీజేపీతో పాటుగా అటు కాంగ్రెస్ కు కూడా కొరకరాని కొయ్యగా మారిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ లిక్కర్ స్కాంతో ఒక్కసారిగా ఫేడ్ అవుట్ అయిపోయారు. అదే సమయంలో ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో చూపుతూ దక్షిణాది పేరిట తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కూడా ఇప్పుడు మద్యం కుంభకోణం ఆరోపణలతో సతమతం అవుతోంది. ఇక ఏపీలో తాను సింగిల్ గా.. సింహం లా వస్తానంటూ చెబుతున్న జగన్ కూడా కేజ్రీ, స్టాలిన్ మాదిరే మద్యం కుంభకోణానికి పాల్పడ్డారన్న విషయం తెలిసినంతనే అమిత్ షా దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు సమాచారం. ఓ వైపు తప్పులు చేస్తూనే శుద్దపూసలమంటూ కలరింగ్ ఇస్తే ఎలాగన్న రీతిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అమిత్ షా… దీనిపై కాస్తంత దృష్టి పెడితే… ఆప్, డీఎంకే మాదిరే వైసీపీ కూడా తీవ్ర పరిణామాలను చవిచూడక తప్పదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 26, 2025 5:10 pm
బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…
కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…
జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…
నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…
గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…
గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…