వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో మంగళవారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుపై సుప్రీంకోర్టు జరుపుతున్న విచారణలో ఏపీ ప్రభుత్వం మంగళవారం ఓ అదనపు అఫిడివిట్ ను దాఖలు చేసింది. అందలో కడప ఎంపీగా కొనసాగతున్నవైఎస్ అవినాశ్ రెడ్డి…ఈ కేసు దర్యాప్తును తప్పుదోవ పట్టించారని సదరు అఫిడవిట్ లో రాష్ట్ర ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఈ కేసును తప్పుదోవ పట్టించే దిశగా అవినాశ్ రెడ్డి ఎలాంటి చర్యలకు పాల్పడ్డారన్న విషయాలను ఏపీ ప్రభుత్వం సమగ్రంగా కోర్టు ముందు ఉంచింది.
2019 ఎన్నికలకు ముందు పులివెందులలోని తన ఇంటిలోనే వివేకా దారుణ హత్యకు గురయ్యారు. నాడు టీడీపీ అధికారంలో వైసీపీ విపక్షంలో ఉంది. తన బాబాయి హత్యపై సీబీఐ చేత దర్యాప్త చేయించాలని డిమాండ్ చేసిన జగన్.. తాను అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ డిమాండ్ ను పక్కనపెట్టేశారన్న ఆరోపణలు లేకపోలేదు. అయితే వివేకా కుమార్తె సునీత న్యాయ పోరాటంతో ఈ కేసును దర్యాప్తు చేసేందుకు సీబీఐ ఎట్టకేలకు రంగంలోకి దిగింది. అయితే సిబీఐ దర్యాప్తును తప్పుదారి పట్టిస్తూ ఎంపీ హోదాలో అవినాశ్ రెడ్డి వ్యవహరించారట. ఈ విషయాన్ని ఇప్పుడు ఏపీ ప్రభుత్వం తన అదనపు అఫిడవిట్ లో సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
తన అఫిడవిట్ లో ఏపీ ప్రభుత్వం ఏమని చెప్పిందన్న విషయానికి వస్తే… వివేకా హత్య కేసు దర్యాప్తును ఎంపీ అవినాశ్ రెడ్డి తప్పుదోవ పట్టించారని… అవినాశ్ రెడ్ది ఆదేశాలతోనే సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డిలపై సీబీఐ అధికారి రాంసింగ్ కేసులు నమోదు చేశారని ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఈ చర్య ద్వారా వివేకా హత్య కేసు దర్యాప్తును తారుమారు చేసేందుకు అవినాశ్ యత్నించారని ఆరోపించింది. తండ్రి హంతకులను కనిపెట్టేందుకు కష్టపడుతున్న సునీత, ఆమె భర్తలపైనే ఈ కేసులో ఇరికించాలని చూశారని పేర్కొంది. ఈ విషయం బయటపడటంతో రాంసింగ్ పై కేసు నమోదు కాగా… ఆ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాజు ప్రొఫెషనల్ గా విచారణ చేపట్టలేదని తెలిపింది.
రాంసింగ్ ను విచారించే విషయంలోనూ ఎంపీ అవినాశ్ రెడ్డి కలగజేసుకున్నారని ఏపీ ప్రభుత్వం తన అఫిడవిట్ లో తెలిపింది. విచారణాధికారిగా ఉన్న రాజును అవినాశ్ రెడ్డి బెదిరించారని…దీనిని రాజు స్వయంగా అంగీకరించారని తెలిపింది. ఇలా విచారణాధికారులనే అవినాశ్ రెడ్డి బెదిరించిన వ్యవహారంలో ఏఎస్పీగా పనిచేసిన పదవీ విరమణ పొందిన రాజేశ్వర్ రెడ్డి, మరో సీనియర్ పోలీసు అధికారి రామకృష్ణారెడ్డిలేనని కూడా ఏపీ ప్రభుత్వం తెలిపింది. ఇంత పకడ్బందీగా ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన నేపథ్యంలో అవినాశ్ రెడ్డికి ఇబ్బందులు తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి.
This post was last modified on March 25, 2025 10:06 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…