ఇంకుడు గుంత, పంట కుంట… వీటి పేర్లు వేరైనా…వీటి ఉద్దేశ్యం మాత్రం ఒక్కటే. వాన నీటిని ఒడిసి పట్టి వర్షపు చుక్కలను ఎక్కడికక్కడ భూమిలోకి ఇంకిపోయేలా చేసి… ఆ ప్రాంతంలో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచడమే వీటి ఉద్దేశ్యం. తొలి దానిని టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ఎప్పుడో 20 ఏళ్ల క్రితమే ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రెండో దానిని ఇప్పుడు జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రాచుర్యంలోకి తీసుకు వస్తున్నారు. వెరసి నాటి చంద్రబాబు సంకల్పాన్ని ఇప్పుడు పవన్ తన భుజస్కందాలపైకి ఎత్తుకున్నారని చెప్పాలి.
1995-2004 మధ్యలో ఉమ్మడి ఏపీకి సీఎంగా వ్యవహరించిన చంద్రబాబు… కరువు ప్రాంతమైన రాయలసీమతో పాటుగా దక్షిణ కోస్తాంధ్రలోని నెల్లూరు, ప్రకాశం జిల్లాలు, తెలంగాణలోని మెట్ట ప్రాంతాల్లో భూగర్బ జలాల పరిమాణాన్ని పెంచేందుకు ఇంకుడు గుంతలను ప్రమోట్ చేశారు. చంద్రబాబు పిలుపుతో నాడు తెలుగు నేల వ్యాప్తంగా ఇంకుడు గుంతలు వేలు, లక్షలు, కోట్ల కొద్దీ ఏర్పాటయ్యాయి. రైతులు అయితే ఇంకుడు గుంతలు తమకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని చంద్రబాబు నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఫలితంగా ఆయా ప్రాంతాల్లో చంద్రబాబు సంకల్పం మేరకు భూగర్భ జలాల పరిమాణం భారీగానే పెరిగిపోయింది.
ఇక ఇప్పుడు పంట కుంటల పేరిట పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు. రాయలసీమ ముఖద్వారా కర్నూలుకు కూతవేటు దూరంలోని ఓర్వకల్లు మండలం పూడిచెర్ల పరిధిలో పంట కుంటలకు ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా ఎంపిక చేసిన స్థలంలో పంట కుంటలకు పవన్ భూమి పూజ చేశారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్… పంట కుంటల ప్రాధాన్యాన్ని నొక్కిచెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా 1.55 లక్షల మేర పంట కుంటలను ఏర్పాటు చేయడమే లక్ష్యంగా సాగుతున్నామని ఆయన చెప్పారు. ఇది నిరంతర ప్ర్రక్రియగా కొనసాగాల్సి ఉందని కూడా ఆయన పిలుపునిచ్చారు. పంట కుంటల చుట్టూ ఆకు కూరలు, కూరగాయల మొక్కలను పెంచుకోవాలని పవన్ సూచించారు.
This post was last modified on March 22, 2025 2:53 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…