ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మొన్నటిదాకా అత్యంత దుర్భరంగా ఉండేది. నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా వేచి చూసిన సందర్భాలు లేకపోలేదు. ఏనాడూ ఒకటో తారీఖున వారికి వేతనాలు అందిన దాఖలా కూడా లేదనే చెప్పాలి. అయితే కూటమి సర్కారు పాలన మొదలయ్యాక… పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. వేతనాల విడుదలలో అంతగా జాప్యం జరగడం లేదు. అంతేనా.. ఉద్యోగుల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐల్లో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను కూటమి సర్కారు రెండంటే రెండు దెబ్బలతో క్లియర్ చేసి పారేసింది. నిజంగానే ఇది ఉద్యోగులకు భారీ ఊరటనిచ్చేదేనని చెప్పక తప్పదు.
ఉద్యోగులకు వేతనాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేసిన గత సర్కారు…. ఉద్యోగుల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐల్లోనూ భారీ ఎత్తున బకాయిలు పెట్టింది. వేతనాలకే నిధులు లేకపోతే…ఇక ఉద్యోగుల ఈ భవిష్య నిధికి ఎలా చెల్లింపులు చేస్తామంటూ ఉద్యోగులనే నాటి ప్రభుత్వం ఎదురు ప్రశ్నించిన పరిస్థితి. అంతేకాకుండా నాటి ప్రభుత్వాన్ని నిలదీసేందుకూ ఉద్యోగులకు ధైర్యం చాలలేదనే చెప్పాలి. మొత్తంగా ఓ ఆందోళన కరమైన వాతావరణం లో పనిచేసిన ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సాహసించలేకపోయారు. దీనినే ఆసరా చేసుకున్న నాటి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. అందిన కాడికి దోచుకున్నారు. ఇష్టమొచ్చినట్లుగా అప్పులు చేశారు. కావాల్సిన కాడికి బకాయిలు పెట్టేశారు.
ఈ తరహా చర్యల కారణంగా ఉద్యోగుల సీపీఎస్, జీపీఎఫ్, ఏపీజీఏఐలకు గత సర్కారు ఏకంగా రూ.7 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టింది. అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే… ఉద్యోగులంతా ఆయన వద్దకెళ్లి తమ పరిస్థితిని ఆయన ముందు పెట్టి బోరుమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించే లక్షణమున్న చంద్రబాబు… మొన్న సంక్రాంతికి రూ.1,033 కోట్లను విడుదల చేశారు. ఫలితంగా ఉద్యోగులు సంక్రాంతి సంబరాలను ఘనంగా చేసుకున్నారు. తాజాగా ఆ బకాయిలు మొత్తాన్ని క్లియర్ చేసే దిశగా చంద్రబాబు అడుగులు వేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా… ఉద్యోగుల సమస్యల పరిష్కారం కీలకమైనదన్న భానవతో మిగిలిన బకాయిలు మొత్తం రూ.6,200కోట్లను విడుదల చేయాలని ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నిధులు శుక్రవారం ఆయా ఖాతాల్లో జమ కానున్నాయి.
This post was last modified on March 21, 2025 10:11 am
ది ప్యారడైజ్ ప్రారంభమైన కొత్తలో నిర్మాత నాని నుంచి వచ్చిన అత్యంత ఎగ్ జైట్మెంట్ ప్రకటన ఏంటో మళ్ళీ చెప్పనక్కర్లేదు.…
మరికొన్ని రోజుల్లో స్థానిక ఎన్నికలు జరగనున్నాయి. కోర్టు చిక్కులను పరిష్కరించుకొని ఈ ఏడాది చివరికల్లా లోకల్ ఎన్నికలు పూర్తి చేయాలని…
రాజమహేంద్రవరం (రాజమండ్రి) ఉభయ గోదావరి జిల్లాలకు కీలక నగరం ఇది. విద్య, వ్యాపారం, రవాణా, పర్యాటకం, పరిపాలనా పరంగా ఈ…
హిట్ 3 ది థర్డ్ కేస్, ది ప్యారడైజ్ ఇలా వరసగా రెండు సినిమాల్లో నాని వయొలెన్స్ మోతాదు మించిపోయింది.…
బాలీవుడ్ లో కేవలం రెండు కోట్ల బడ్జెట్ తో రూపొంది నాలుగు వందల కోట్ల వైపు పరుగులు పెట్టిన బ్లాక్…
2027 సంక్రాంతికి కాకా విడుదల పక్కా. ఇందులో ఎలాంటి అనుమానం లేనట్టే. పండక్కు రావాలని విశ్వంభర తెగ ట్రై చేసినా…