Political News

తమిళనాట ఖుష్బూ రచ్చో రచ్చస్య

తెలుగు నాట మన రోజా ఎలాగో తమిళనాడులో ఖుష్బూ అదే తరహా అని చెప్పొచ్చు. సినీ రంగంలో ఒక వెలుగు వెలిగాక ఇద్దరూ రాజకీయాల్లో అడుగు పెట్టి ఫైర్ బ్రాండ్‌ ఇమేజ్ తెచ్చుకున్నవాళ్లే. కాకపోతే మన రోజా లాగా ఖుష్బు బూతులు మాట్లాడదు. నోటికి ఎంతొస్తే అంత మాట మాట్లాడదు. కానీ దూకుడుగా మాత్రం ఉంటుంది. తాను ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ వాయిస్ బలంగా వినిపిస్తుంది.

ఐతే కాంగ్రెస్ పార్టీ కోసం చాలా ఏళ్ల పాటు బాగానే కష్టపడ్డా గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అప్పట్నుంచి పార్టీలో అంత చురుగ్గా లేని ఖుష్బూ ఇటీవలే భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకుంది. అధికార అన్నాడీఎంకేను కేంద్రంలోని భాజపా నియంత్రిస్తున్న మాట వాస్తవమే కానీ.. తమిళనాట మాత్రం ఆ పార్టీ బలం, ప్రభావం అంతంతమాత్రం. కానీ ఖుష్బూ వచ్చీ రాగానే పార్టీలో ఒక వేడి పుట్టించింది. రోజూ వార్తల్లో నిలుస్తూ, పార్టీ కార్యక్రమాల్ని నడిపిస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది.

తాజాగా మనుస్మృతి గురించి, మహిళల గురించి విడుదలై చిరుతైగల్ కచ్చి (వీసీకే) పార్టీ అధినేత, ఎంపీ తిరుమవాలవన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాట దుమారం రేపాయి. ఆయనకు వ్యతిరేకంగా ఖుష్బూ భాజపా మహిళా నేతలతో కలిసి ఆందోళన బాట పట్టింది. రోడ్డు మీద ధర్నాకు కూర్చుంది. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి గృహ నిర్బంధంలో ఉంచారు. ఈ వ్యవహారం తమిళ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలతో ట్విట్టర్లో ఇండియా వైడ్ ఖుష్బూ పేరు ట్రెండ్ కావడం విశేషం.

ఇదిలా ఉంటే.. ఖుష్బూ మరో రకంగా కూడా ట్విట్టర్లో హాట్ టాపిక్ అయింది. ఆమె ధర్నాలో కూర్చున్న సందర్భంగా ఒక వీడియో బైట్ ఇచ్చింది. అది పార్టీకి సంబంధించిన వాళ్లే రికార్డ్ చేశారు. ఐతే ఖుష్బూ చాలా ఆవేశంగా మాట్లాడుతుంటే.. మధ్యలో పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆమెను ఆపి రిపీట్ అన్నారు. దీనికి ఖుష్బూ కోపంగా స్పందించింది. ఇదంతా కూడా వీడియోలో రికార్డయి ట్విట్టర్లోకి వచ్చేసింది. దీన్ని పట్టుకుని ఖుష్బూ వ్యతిరేకులు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. ఆమె షూటింగ్ మోడ్‌లోనే ఉందని కామెంట్లు చేస్తున్నారు. ఐతే ఎలాగైతేనేం.. భాజపాలో చేరినప్పటి నుంచి తమిళనాడు రాజకీయాల్లో కొన్ని రోజులుగా ఖుష్బూ హాట్ టాపిక్ అవుతున్న మాట మాత్రం వాస్తవం.

This post was last modified on October 28, 2020 11:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

అసంతృప్తికి అంతులేదా.. టీడీపీలో హాట్ టాపిక్!

అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…

2 hours ago

`గోదావ‌రి సంప్ర‌దాయం`… విజ‌య‌వాడ వ‌యా హైద‌రాబాద్‌!

మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ‌.. సంక్రాంతి. ఇళ్ల‌కే కాదు.. గ్రామాల‌కు సైతం శోభ‌ను తీసుకువ‌చ్చే సంక్రాంతికి.. కోడి…

2 hours ago

డింపుల్ ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ తెలిస్తే షాకే

ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…

4 hours ago

వెంక‌య్య పిల్లలు పాలిటిక్స్ లోకి ఎందుకు రాలేదు?

బీజేపీ కురువృద్ధ నాయ‌కుడు, దేశ మాజీ ఉప‌రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య‌నాయుడు.. ప్ర‌స్తుతం ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్నారు. అయితే.. ఆయ‌న…

4 hours ago

ఖరీదైన మద్యాన్ని కూడా కల్తీ చేస్తున్న ముఠాలు

చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…

5 hours ago

బాబుకు కుప్పం ఎలానో… పవన్ కు పిఠాపురం అలా!

కుప్పం.. ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం. గ‌త 40 సంవ‌త్స‌రాలుగా ఏక ఛ‌త్రాధిప‌త్యంగా చంద్ర‌బాబు ఇక్క‌డ విజ‌యం దక్కించుకుంటున్నారు.…

6 hours ago