బహు భాషా చిత్రాల నటుడు ప్రకాశ్ రాజ్ నిత్యం సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటున్న సంగతి తెలిసిందే. నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతి అడుగును విమర్శిస్తూ సాగుతున్న ప్రకాశ్ రాజ్… మోదీతో పాటు బీజేపీకి ఎవరు అనుకూలంగా స్పందించినా… వారిపై వెనువెంటనే ప్రతిస్పందిస్తున్నారు. తాజాాగా తమిళ ప్రజలు వ్యతిరేకిస్తున్న త్రిభాషా సిద్ధాంతంపై జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లపై ఆయన స్పందించారు. శుక్రవారం జనసేన 12వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా మాట్లాడిన పవన్ త్రిభాషా సిద్ధాంతం సరికాదని… ఇంకా చెప్పాలంటే బహు భాషా సిద్ధాంతాన్ని అవలంబించాలని కూడా సూచించిన సంగతి తెలిసిందే.
పవన్ ప్రసంగాన్ని తెలుగు ప్రజలతో పాటుగా తమిళ, కన్నడ, మరాఠీలు సహా ప్రకాశ్ రాజ్ కూడా సాంతం విన్నట్టుగానే ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి పవన్ తన ప్రసంగాన్ని ముగించిన వెంటనే సోషల్ మీడియా ఖాతాలను ఓపెన్ చేసిన ప్రకాశ్ రాజ్… పవన్ వ్యాఖ్యలపై తనదైన శైలి ప్రతిస్పందనను తెలియజేశారు. ”మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం… ఇంకో భాషను ద్వేషించడం కాదు. ‘స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం’ అని పవన్ కల్యాణ్ గారికి ఎవరైనా చెప్పండి ప్లీజ్” అని ఆయన తన పోస్టులో తెలియజేశారు. ఇదంతా బాగానేే ఉన్నా… పవన్ కు ఎవరైనా చెప్పడం ప్లీజ్ అనే ప్రకాశ్ రాజ్ వ్యాఖ్యలు అయితే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
వాస్తవానికి టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ప్రకాశ్ రాజ్ బాగా దగ్గరగానే ఉంటారు. తన ప్రయాణం మెగా ఫ్యామిలీతోనే అన్నట్లుగా కూడా ఆయన సాగుతూ ఉంటారు. ఇటీవలి మా అసోసియేషన్ ఎన్నికల్లో మెగా మద్దతుతోనే ఆయన బరిలోకి దిగారు కూడా. అయితే ఆ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోయినా… మెగా ఫ్యామిలీకి దూరమైతే జరగలేదనే చెప్పాలి. ఇలాంటి తరుణంలో మెగా బ్రదర్ అయిన పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను తప్పుబడుతూ ప్రకాశ్ రాజ్ పోస్టు పెట్టడం ప్రాధాన్యం సంతరించుకుంది. అయినా పవన్ తమిళనాడ వెలుగు చూసిన సంస్కృతిని ప్రశ్నిస్తే… కర్ణాటకకు చెందిన ప్రకాశ్ రాజ్ స్పందించడం మరీ వింతగా ఉందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
This post was last modified on March 15, 2025 11:29 am
ఏపీ ప్రతిపక్ష పార్టీ(ప్రధాన కాదు) వైసీపీకి తాజాగా భారీ ఎదురు దెబ్బ తగిలింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో అతి…
కిరణ్ అబ్బవరం ఫ్లాప్ స్ట్రీక్కు బ్రేక్ వేసిన సినిమా.. క. గత ఏడాది దీపావళికి విడుదలైన ఈ చిత్రం సూపర్…
సోషల్ మీడియాలో ఇష్టానుసారం పోస్టులు పెట్టే సంస్కృతి పెరిగిపోతోందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇలాంటి వారి విషయంలో…
ఏపీలో కీలక ప్రాంతమైన గుంటూరు నగర పాలక సంస్థలో శనివారం ఓ కీలక పరిణామం చోటుచేసుకుంది. గుంటూరు మేయర్ గా…
త్రిభాషా విధానాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై రచ్చ రాజుకున్న సంగతి తెలిసిందే. జనసేన…
షాలిని పాండే గుర్తుందా. విజయ్ దేవరకొండ అనే సెన్సేషన్ తో పాటు సందీప్ రెడ్డి వంగా అనే ఫైర్ బ్రాండ్…