మా నాన్నకు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? మాకు ఎప్పుడు న్యాయం లభిస్తుంది? అని వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ మర్రెడ్డి సునీత ఆవేదనగా ప్రశ్నించారు. నేడు (మార్చి 15) వివేకానందరెడ్డి 6వ వర్ధంతిని పురస్కరించుకుని వివేకా సమాధి వద్ద ఆమె కుటుంబ సభ్యులతో కలిసి నివాళులర్పించా రు. ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సునీత.. తన తండ్రి కేసులో బాధ్యులు ఎవరో.. ఎక్కడున్నారో అందరికీ తెలిసినా.. వారికి మాత్రం ఏమీ కావడం లేదన్నారు.
“మా నాన్న హత్యకు గురై.. నష్టపోయింది మేం. ఇప్పుడు కూడా కేసు ముందుకు సాగకపోవడంతో నష్టపోతోంది కూడా మేమే. పైగా బాధితులమైన మమ్మల్ని నిందితులుగా చూపిస్తున్నారు” అని సునీత ఆవేదన వ్యక్తం చేశారు. వివేకా హత్యపై ఎంత పోరాటం చేసినా.. తమకు న్యాయం లభించడం లేదన్నారు. నిందితులు తప్పించుకుంటున్నారా? అనేది కూడా ప్రశ్నగా మారిందన్నారు. వరుసగా సాక్షులు చనిపోతున్నారని.. దీనివెనుక ఏం జరుగుతోందో కూడా అర్ధం కావడం లేదన్నారు.
రాష్ట్రప్రభుత్వం తమ కుటుంబానికి అండగా నిలవాలని సునీత వేడుకున్నారు. అయితే.. తమ తండ్రి తరఫున న్యాయం కోసం ఎంత వరకైనా పోరాటం చేస్తామని సునీత తెలిపారు. సీబీఐ మళ్లీ ఈ కేసును జీరో లెవిల్ నుంచి విచారణ జరిపించాలని తాను కోరుతున్నట్టు తెలిపారు. “హత్యకు పురిగొల్పిన వారు కళ్ల ముందే కనిపిస్తున్నారు. అయినా మాకు న్యాయం జరగడం లేదు. అసలు ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు” అని సునీత వ్యాఖ్యానించారు.
ఏం జరిగింది?
2019, మార్చి 15న వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ కేసు అనేక మలుపులు తిరిగింది. సీబీఐ విచారణ జరిగినా.. కూడా ఈ కేసులో నిందితులు ఎవరు అనేది ఇప్పటి వరకు తేలకపోవడం గమనార్హం. అంతేకాదు.. అప్రూవర్‌గా మారిన దస్తగిరికి సైతం బెదిరింపులు ఎదురయ్యాయి. ప్రస్తుతం ఈ కేసు విచారణ కొనసాగుతూనే ఉంది. మరి ఎప్పటికి తేలుతుందనేది ప్రశ్నగామారింది.
This post was last modified on March 15, 2025 10:49 am
మాస్ మార్కెట్ ని మరింత బలపరుచుకునే ఉద్దేశంతో నాని ఏరికోరి చేసిన ది ప్యారడైజ్ ఫైనల్ ఫలితం ఏంటనేది ఇంకా…
ఆ మధ్య షూటింగ్ లో ప్రమాదానికి గురైన జూనియర్ ఎన్టీఆర్ కొన్ని వారాల విశ్రాంతి తర్వాత పూర్తిగా రికవర్ అయ్యాడు.…
కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన…
2019-24 మధ్య జగన్ జమానాలో ఏపీలో నాణ్యమైన మద్యం కరువైన సంగతి తెలిసిందే. తన మంత్రులు, అనుయాయులకు సంబంధించిన డిస్టిలరీల…
ఏపీ లిక్కర్ రవాణా కుంభకోణం కేసు దర్యాప్తునకు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఏవో కారణాలు చెప్పి…
యూత్ హీరోలు ప్లానింగ్ విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఆర్థికంగా ఏమో కానీ కెరీర్ పరంగా ఇబ్బందులు చూడాల్సిన పరిస్థితులు ఇండస్ట్రీలో…