Political News

రంగ‌న్న డెత్‌.. వైసీపీకి డెత్ బెల్స్‌!

వైసీపీ అధినేత జ‌గ‌న్‌ చిన్నాన్న‌, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించిన కీల‌క సాక్షి, వివేకా ఇంటి వాచ్ మెన్‌.. రంగ‌న్న మ‌ర‌ణం.. వైసీపీని నిలువునా ద‌హించేస్తోంది. తొలుత ఈ మ‌ర‌ణాన్ని పోలీసుల ఖాతాలో వేస్తూ.. వైసీపీ అనుకూల మీడియా స‌హా ఆ పార్టీ నాయ‌కులు ప్ర‌చారం చేశారు. ఈ నేప‌థ్యంలోనే కొంద‌రు రంగంలోకి దిగి.. రంగ‌న్న భార్య‌తో పోలీసులు తీవ్రంగా కొట్ట‌డం వ‌ల్లే త‌న భ‌ర్త మృతి చెందాడ‌ని స్టేట్‌మెంట్ చెప్పించారు. ఇదేస‌మ‌యంలో కేసు కూడా పెట్టించారు. అయితే.. ఈ విష‌యం ఇప్పుడు యూట‌ర్న్ తీసుకుంది.

రంగ‌న్న మృతి.. అనంత‌ర ప‌రిణామాల‌పై కూట‌మి ప్ర‌భుత్వం తీవ్రంగా స్పందించింది. వైసీపీ నేత‌లు, అనుకూల మీడియా చేస్తున్న ప్ర‌చారాన్నితీవ్రంగా భావించిన సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. రంగన్న మృతిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు చేయించాల‌ని నిర్ణ‌యించారు. దీంతో శుక్ర‌వార‌మే.. రంగన్న భౌతిక దేహానికి పోస్టు మార్టం ముగిసి.. అంత్య‌క్రియ‌లు కూడా పూర్తి అయిన‌ప్ప‌టికీ.. తిరిగి పార్థివ దేహాన్ని శ‌నివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం.. రీ పోస్టు మార్టం కోసం మంగ‌ళ‌గిరి, తిరుప‌తి ప్రాంతాల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు క‌డ‌ప‌లోని భాకారాపేట శ్మ‌శాన వాటిక‌కు వెళ్లి.. మృత‌దేహాన్ని వెలికి తీసి.. అక్క‌డే పోస్టు మార్ట‌మ్ చేశారు.

ఈ స‌మ‌యంలో ఎవ‌రినీ ద‌రిదాపుల‌కు రాకుండా ప‌క్కా భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. రంగ‌న్న శ‌రీరంపై ఏమైనా గాయాలు ఉన్నాయా? కొట్టిన ఆన‌వాళ్లు ఉన్నాయా? అనే కోణంలో అన్నివైపుల నుంచి ఫోరెన్సిక్ నిపుణులు ద‌ర్యాప్తు చేశారు. ఈ నివేదిక‌ను ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించ‌నున్నారు. కాగా.. ఈ ప‌రిణామాలతో వైసీపీ శిబిరాలు మూగ‌బోయాయి. నిన్న‌టి వ‌ర‌కు రంగ‌న్న మృతిపై స్పందించిన ప‌లువురు నాయ‌కులు.. రీ పోస్టు మార్ట‌మ్ స‌హా.. ప్ర‌భుత్వం సీరియ‌స్‌గా తీసుకున్న నేప‌థ్యంలో ఎవ‌రికి వారు మౌనం పాటించారు. ఎప్పుడు ఏం జ‌రుగుతుందో అనే ఆదుర్దా కూడా క‌నిపించ‌డం గ‌మ‌నార్హం.

మ‌రో వైపు.. బెంగ‌ళూరులోనే ఉన్న వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. రంగ‌న్న మృత‌దేహానికి రీ పోస్టు మార్టం వ్య‌వ‌హారంపై ఎప్ప‌టిక‌ప్పు డు పార్టీ నాయ‌కుల నుంచి స‌మాచారం తెలుసుకున్న‌ట్టు తెలిసింది. త‌మ మీడియా స‌హా.. స్థానిక నాయ‌కుల ద్వారా ఆయ‌న స‌మాచారం సేక‌రించార‌ని పార్టీ నాయ‌కుల మ‌ధ్య చ‌ర్చ సాగుతోంది. జ‌గ‌న్ సూచ‌న‌ల కార‌ణంగానే ఎవ‌రూ స్పందించ‌డం లేద‌ని.. అంద‌రూ మౌనంగా ఉన్నార‌ని.. ఎప్పుడు ఏం జ‌రుగుతుంద‌నే ఆదుర్దాల‌తో ఉన్నారని తెలుస్తోంది. కాగా.. రీ పోస్టు మార్టం నివేదిక‌ను అధికారులు సోమ‌వారం ప్ర‌భుత్వానికి అందించే అవ‌కాశం ఉంది. అనంత‌రం.. స‌ర్కారు చ‌ర్య‌లు తీసుకుంటుంద‌ని స‌మాచారం.

This post was last modified on March 9, 2025 11:32 am

Share

Recent Posts

జ‌గ‌న్ విదేశీ ప‌ర్య‌ట‌నకు బ్రేక్ ప‌డుతుందా?

వైసిపి అధినేత జగన్ వచ్చే నెలలో యూరప్ పర్యటన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఆయన సర్వం సిద్ధం…

23 minutes ago

డెకాయిట్ తర్వాత దర్శనం లేదేంటి

కొన్నేళ్ల క్రితం టాలీవుడ్ లో మారుమ్రోగిన పేరు మృణాల్ ఠాకూర్. సీతారామం బ్లాక్ బస్టర్ అయ్యాక హాయ్ నాన్న విజయం…

3 hours ago

సత్తా చాటుతుందంటే మొహం చాటేసింది

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో అక్టోబర్ ఒకటి విడుదలైన బత్తా రెండు వారాలు పూర్తి చేసుకోవడానికి దగ్గరగా ఉన్నా వసూళ్లు…

3 hours ago

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

4 hours ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

11 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

14 hours ago