Political News

వృథా నీటిని వాడుకుంటే మీకేంటి నొప్పి?: చంద్ర‌బాబు

ఏపీ-తెలంగాణ రాష్ట్రాల మ‌ధ్య జ‌ల యుద్ధంలో కీల‌క ఘ‌ట్టం చోటు చేసుకుంది. గ‌త రెండు రోజులుగా ఢిల్లీలోనే తిష్ఠ‌వేసిన తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి.. ఏపీ చేప‌డుతున్న బ‌న‌క‌చ‌ర్ల‌(క‌ర్నూలు జిల్లా) ప్రాజెక్టుపై ఫిర్యాదు చేశారు. దీనిని ఎలాంటి అనుమ‌తులు లేకుండా నిర్మించేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని ఆరోపించారు. దీనివ‌ల్ల త‌మ‌కు నీరు త‌గ్గిపోతుంద‌ని.. కాబ‌ట్టి ఏపీ చేప‌డుతున్న బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును అడ్డుకోవాల‌ని ఆయ‌న కేంద్ర జ‌ల‌శ‌క్తి మంత్రి పాటిల్‌కు విన్న‌వించారు. దీనిపై ఆయ‌న సానుకూలంగా స్పందించ‌డం గ‌మ‌నార్హం. దీనికితోడు ప‌లువురు తెలంగాణ మంత్రులు కూడా ఏపీ జ‌ల‌వ‌న‌రుల‌పై విమ‌ర్శ‌లు చేశారు.

ఆయా అంశాల‌పై గ‌త రెండు రోజులుగా మౌనం వ‌హించిన ఏపీ ప్ర‌భుత్వం తాజాగా స్పందించింది. మంగ‌ళ‌వారం రాత్రి సీఎం చంద్ర బాబు ఈ విష‌యాన్ని ప్ర‌ధానంగా ప్ర‌స్తావించారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల‌ను ఉద్దేశించి ఆయ‌న ప‌రోక్ష వ్యాఖ్య‌లు చేశారు. ‘స‌ముద్రంలోకి వృథాగా పోయే నీటిని మేం వాడుకుంటే మీకు నొప్పేంటి?’ అని సూటిగా ప్ర‌శ్నించారు. అంతేకాదు.. “మీరు కావాలంటే వాడుకోండి. కానీ, స‌ముద్రంలోకి వృథాగా పోతే చూస్తూ ఊరుకుంటారా? వృథా జ‌లాల‌ను త‌రలించి.. వాడుకుంటే త‌ప్పేంటి? అవ‌స‌ర‌మైతే.. మీరూ వాడుకోవ‌చ్చు. స‌ముద్రంలో పోతున్న జ‌లాల‌ను క‌రువు పీడిత ప్రాంతాల‌కు త‌ర‌లిస్తామ‌ని చెబితే.. కొంద‌రు బాధ‌ప‌డిపోతున్నారు(రేవంత్ స‌హా మంత్రులు)” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు.

అంద‌రూ బాగుండాలి!

ఏపీ ప్ర‌జ‌లు, ఏపీ ప్ర‌భుత్వం కూడా.. తెలుగు వారు ఎక్క‌డున్న బాగుండాల‌ని కోరుకుంటార‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. అందుకే గ‌తంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టును క‌ట్టిన‌ప్పుడు కూడా తాము మాట్లాడ‌లేద‌న్నారు. కాళేశ్వ‌రాన్ని క‌ట్టి మంచి ప‌నిచేశార‌ని ఆనాడు భావించిన‌ట్టు తెలిపారు. గోదావ‌రి న‌ది ఒక్క‌టే తెలుగు వారికి జ‌ల ప్ర‌దాయ‌నిగా ఉంద‌న్న సీఎం.. ఈ న‌దిపై ఎన్ని ప్రాజెక్టులైనా క‌ట్టుకోవాల‌ని తెలంగాణ‌కు సూచించారు. బ‌న‌క‌చ‌ర్ల ప్రాజెక్టును నిర్మించ‌డం ద్వారా స‌ముద్రంలోకి వృథాగా పోతున్న నీటిని క‌రువు ప్రాంతాల‌కు త‌ర‌లించాల‌న్న‌దే త‌మ అభిప్రాయ‌మ‌ని.. ఎవ‌రినీ ముంచాల‌న్న‌ది త‌మ ఉద్దేశం కాద‌ని తేల్చి చెప్పారు. దీనికి ఎందుకో బాధ‌ప‌డుతున్నార‌ని వ్యాఖ్యానించారు.

రెండూ.. రెండు క‌ళ్లు!

“ఏపీ, తెలంగాణ రెండు క‌ళ్లు అని నేనే గ‌తంలోనే చెప్పా. ఇప్పుడు కూడా అదే మాట‌కు నిల‌బ‌డుతున్నా. రెండు రాష్ట్రాల తెలుగు వారు బాగుండాల‌న్న‌దే మా విధానం. మీరూ నీటిని వాడుకోండి. మేమూ వాడుకుంటాం. తెలుగువారు ఎక్క‌డున్నా బాగుంటారు” అని చంద్ర‌బాబు వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్ర‌జ‌ల నీటిని ఏపీ తీసేసుకుంటోంద‌ని చేస్తున్న వ్యాఖ్య‌లు అర్థ‌ర‌హిత‌మ‌ని చంద్ర‌బాబు అన్నారు. ఏపీ ప్ర‌భుత్వం ఎప్పుడూ తెలంగాణ‌కు అన్యాయం చేయాల‌ని భావించ‌డం లేద‌న్నారు. రెండు రాష్ట్రాల్లోనూ క‌రువు ప్రాంతాలు ఉన్నాయ‌ని.. ఎవ‌రు ముందుకు వ‌చ్చినా మిగులుజ‌లాలు, వృథా జ‌లాల‌ను వినియోగించుకుని రాష్ట్రాల‌ను బాగు చేసుకుంటే బాగుంటుంద‌ని తేల్చి చెప్పారు. కాగా. దీనిపై తెలంగాణ ఎలా స్పందిస్తుందో చూడాలి.

This post was last modified on March 5, 2025 9:49 am

Share

Recent Posts

అప్పుడు ప్రభాస్‌… ఇప్పుడు యష్!

బాహుబలి ఫ్రాంచైజీ తర్వాత హీరో ప్రభాస్ ఒక ఇంట్రెస్టింగ్ కెరీర్ ఫేజ్ చూశాడు. ఒక టాప్ డైరెక్టర్ క్రియేట్ చేసిన…

2 hours ago

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

7 hours ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

7 hours ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

8 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

9 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

9 hours ago