ఏపీలో ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి ఉద్దేశించిన డీఎస్సీని ఈ నెలలోనే జరిపి తీరతామని కూటమి సర్కారు మరోమారు స్పష్టం చేసింది. ఈ మేరకు మంగళవారం నాటి శాసనసభ సమావేశాల్లో భాగంగా శాసనమండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ విస్పష్ట ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెల (మార్చి)లోనే డీఎస్సీ ప్రకటనను విడుదల చేస్తామని లోకేశ్ స్పష్టం చేశారు. అంతేకాకుండా 2025-26 విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోగా కొత్త ఉపాధ్యాయులు ఆయా పాఠశాలల్లో విధుల్లో చేరేలా ఏర్పాట్లు చేస్తామని ఆయన వివరించారు.
మంగళవారం నాటి శాసనమండలి సమావేశాల్లో భాగంగా నిరుద్యోగ భృతి, యువతకు ఉద్యోగావకాశాలపై చర్చ జరపాలంటూ వైసీపీ వాయిదా తీర్మానాలిచ్చింది. ఈ వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ తిరస్కరించారు. ఆ తర్వాత ప్రశ్నోత్తరాలు, తదనంతరం సభ కార్యక్రమాల్లో బాగంగా పలు అంశాలపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ సభ్యులు… డీఎస్సీ ఎప్పుడూ అంటూ నినాదాలు చేశారు. ఈ ప్రశ్నలకు లోకేశ్ ఘాటుగా స్పందించారు. డీఎస్సీ నిర్వహణపై ఇప్పటికే చాలా సార్లు ఇదే సభలో ప్రకటన చేశామని గుర్తు చేసిన లోకేశ్… ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ నెలలోనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ప్రకటించారు.
ఇక వైసీపీ హయాంలో ఒక్కటంటే ఒక్క డీఎస్సీ కూడా విడుదల కాని విషయాన్ని కూడా లోకేశ్ ప్రస్తావించారు. ఏటా జాబ్ కేలండర్ అన్న వైసీపీ నేతలు… ఇప్పుడు ఉద్యోగ ప్రకటనలు ఇస్తామని చెబుతున్నా యాగీ చేయడం సరికాదన్నారు. అయినా ఉపాధ్యాయ నియామకాల్లో టీడీపీకి ఉన్న ఘన చరిత ఏ ఒక్క పార్టీకి లేదని కూడా ఆయన తెలిపారు. 1994 నుంచి ఉమ్మడి తెలుగు నేలలో 2,60184 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ కాగా… అందులో టీడీపీ హయాంలోనే 1,80,272 పోస్టులు భర్తీ అయ్యాయన్నారు. అంటే… ఇప్పటిదాకా భర్తీ అయిన టీచర్ పోస్టుల్లో 70 శాతం తాము ఇచ్చినవేనని లోకేశ్ గుర్తు చేశారు.
This post was last modified on March 4, 2025 12:58 pm
ఏపీలో లేడీ డాన్లు పెరిగిపోయారు.. వారి తోక కట్ చేస్తానంటూ సీఎం చంద్రబాబు నాయుడు మాస్ వార్నింగ్ ఇచ్చారు. ఈరోజు…
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…