అంతా అనుకున్నట్లుగానే కాంగ్రెస్ పార్టీ మహిళా నేత, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తన పనితీరు ఎంత కఠినంగా ఉంటుందో రెండో రోజే చూపించేశారు. శుక్రవారం అధికారికంగా పార్టీ తెలంగాణ ఇంచార్జీ బాధ్యతలు చేపట్టిన మీనాక్షి… ఒక్కటంటే ఒక్క రోజు వ్యవధిలోనే తన దెబ్బ ఎలా ఉంటుందో పార్టీ శ్రేణులకు రుచి చూపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీగా కొనసాగుతున్న చింతపండు నవీన్ అలియస్ తీన్మార్ మల్లన్నపై వేటు పడిపోయింది.
ఈ మేరకు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) క్రమశిక్షణా కమిటీ శనివారం మల్లన్నపై సస్పెన్షన్ వేటు వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. మీనాక్షి ఇచ్చిన ఆదేశాల మేరకే పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ కఠిన నిర్ణయాన్ని క్షణాల్లోనే తీసుకోక తప్పలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం తెలంగాణలో అధికార పార్టీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అంటే… మల్లన్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ కిందే లెక్క కదా. ఈ విషయాన్ని ఆయన అంతగా పట్టించుకున్న దాఖలానే కనిపించలేదు. దళిత సామాజిక వర్గానికి చెందిన మల్లన్న… నిత్యం రెడ్ది సామాజిక వర్గంపై పరుష పదజాలంతో కూడిన వ్యాఖ్యలు చేస్తూ సాగారు.
బీసీ ఎస్సీ, ఎస్టీల వర్గాలకు తనను తాను ఓ ప్రతినిధిగా ప్రచారం చేసుకుంటున్న మల్లన్న… ఆయా కుల సంఘాలు ఏర్పాటు చేస్తున్న సమావేశాలకు హాజరై ఘాటు ప్రసంగాలు చేస్తున్నారు. ప్రత్యేకించి రెడ్డి సామిజిక వర్గాన్ని… అది కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్లను టార్గెట్ చేసుకుని మల్లన్న ఇప్పటికే చాలా సమావేశాల్లో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ నెల 5న మల్లన్నకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సొంత పార్టీ నేతలపై చేసిన పరుష పదజాలానికి సంజాయిషీ ఇవ్వాలంటూ సదరు నోటీసుల్లో క్రమశిక్షణా కమిటీ మల్లన్నను ఆదేశించింది. ఈ నోటీసులకు ఈ నెల 12లోగా మల్లన్న సమాధానం ఇవ్వాల్సి ఉంది. అయితే మల్లన్న ఈ నోటీసులను లైట్ తీసుకున్నారు. అసలు తనకు నోటీసులే జారీ కాలేదన్నట్లుగా వ్యవహరించారు. ఇలాంటి క్రమంలో శుక్రవారం హైదరాబాద్ వచ్చిన మీనాక్షి… నిన్న మొత్తం పార్టీలో జరుగుతున్న వ్యవహారాలపై సమీక్షల్లో మునిగిపోయారు. ఈ క్రమంలో మల్లన్న విషయం కూడా ప్రస్తావనకు రాగానే.. పార్టీ లైన్ దాటే వారు ఎవరైనా, ఎంతటి వారైనా సహించేదే లేదని ఆమె తేల్చి చెప్పారట. దీంతో శనివారం తెల్లారగానే మల్లన్నపై సస్పెన్షన్ వేటు పడింది.
This post was last modified on March 1, 2025 1:23 pm
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…