Political News

ఆస్తుల వివాదంలో విజ‌య‌మ్మ యూట‌ర్న్‌.. జ‌గ‌న్ కు ఇబ్బందే.. !

వైఎస్ కుటుంబంలో కొన్నాళ్లుగా క‌ల‌క‌లం రేపుతున్న ఆస్తుల వివాదంలో వైఎస్ స‌తీమ‌ణి, జ‌గ‌న్ మాతృ మూర్తి.. విజ‌య‌మ్మ ఫుల్లుగా యూట‌ర్న్ తీసుకున్నారు. స‌ద‌రు ఆస్తుల‌తో జ‌గ‌న్‌కు కానీ.. ఆయ‌న స‌తీమ‌ణి భార‌తికి కానీ.. సంబంధం లేద‌ని.. ట్రైబ్యున‌ల్‌లో అఫిడ‌విట్ వేశారు. ఇదేమీ చిన్న విష‌యం కాదు. ఇది క‌నుక కోర్టు ఆమోదం పొందితే.. కీల‌క‌మైన స‌ర‌స్వ‌తి భూముల విష‌యం, వాటాల విస‌యంలో వైసీపీ అధినేత‌కు భారీ దెబ్బే త‌గ‌ల‌నుంద‌ని అంటున్నారు.

స‌రస్వ‌తి ప‌వ‌ర్ లో వాటాల విష‌యం గత ఆరు మాసాలుగా వివాదం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. త‌ను ప్రేమ‌తో ఇచ్చిన వాటాను బ‌ద‌లాయించుకునే ప్ర‌య‌త్నం చేసి.. త‌న బెయిల్ ర‌ద్దు చేయాల‌న్న కుట్ర చేస్తున్నారంటూ.. ఆరు మాసాల కింద‌ట‌.. జ‌గ‌న్ ఎన్‌సీటీఎల్‌లో దావా వేసిన విష‌యం తెలిసిందే. త‌న‌పై 2012లో న‌మోదైన అక్ర‌మాస్తుల కేసులో స‌రస్వ‌తీ భూములు స‌హా వాటాల‌ను సీబీఐ, ఈడీలు.. త‌మ స్వాధీనంలో ఉంచుకున్నాయ‌ని.. ఇప్పుడు వాటిని వేరేవారికి కేటాయిస్తే.. త‌న బెయిల్ ర‌ద్ద‌యి జైలుకు వెళ్లాల్సి ఉంటుంద‌ని కూడా గ‌తంలో ఆరోపించారు.

అప్ప‌ట్లో ఈ వివాదం తీవ్ర స్థాయిలో రాజుకుంది. క‌న్న త‌ల్లిని, చెల్లిని కూడా ఆస్తుల కోసం జ‌గ‌న్ కోర్టుకు లాగారంటూ.. ప్ర‌త్య‌ర్థి ప‌క్షాలు విమ‌ర్శ‌లు గుప్పించాయి. ఇప్పుడు ఇదే కేసులో విజ‌య‌మ్మ సంచ‌ల‌న అపిడ‌విట్ వేశారు. జ‌గ‌న్ వేసిన పిటిష‌న్‌నే ఆమె త‌ప్పుబ‌ట్టారు. స‌రస్వ‌తి భూములు కంపెనీలో వాటాలు పూర్తిగా త‌న‌వేన‌ని(97.3 శాతం) విజ‌య‌మ్మ పేర్కొన్నారు. అంతేకాదు.. జ‌గ‌న్‌, భార‌తిల‌కు ప్రస్తుతం ఎలాంటి వాటాలేలూ లేవ‌ని కూడా స్ప‌ష్టం చేశారు. ఈ నేప‌థ్యంలో అస‌లు ట్రైబ్యునల్‌లో పిటిషన్‌ వేసే అర్హత వారికి లేదన్నారు.

అంతేకాదు.. అమాయ‌కురాలైన త‌న కుమార్తె ష‌ర్మిల పేరును ఈ కేసులో ఇరికించే ప్ర‌య‌త్నాన్ని కూడా విజ‌య‌మ్మ ఖండించారు. ‘సరస్వతి పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’ వాటాల బదలాయింపులోకి షర్మిలను అనవసరంగా లాగుతున్నారని తెలిపారు. త‌మ వాటాల‌ను ష‌ర్మిల‌కు ఉదారంగా బ‌దాలిస్తున్న‌ట్టు ట్రైబ్యునల్‌ను తప్పుదోవ పట్టిస్తున్నారని జ‌గ‌న్‌, భార‌తిల‌పై విజ‌య‌మ్మ ఆరోప‌ణ‌లు గుప్పించారు. ఈ మేర‌కు జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్‌ బెంచ్ లో ప్ర‌త్యేక అఫిడ‌విట్ దాఖ‌లు చేశారు. ఇది నిరూప‌ణ అయి.. జ‌గ‌న్‌కు క‌నుక వాటాలు లేక‌పోతే.. ఆర్థికంగా ఆయ‌న‌కు న‌ష్టం. అదేస‌మ‌యంలో రాజ‌కీయంగా కుటుంబాన్ని వేదించార‌న్న అపప్ర‌ద కూడా ఎదుర‌వుతుంది.

This post was last modified on February 28, 2025 1:56 pm

Share

Recent Posts

ఖైరతాబాద్ నుంచి జనసేన పోటీ

ఏ నిముషంలో దానం నాగేందర్ పార్టీ మారి ఎమ్మెల్యే పదవి కోల్పోయాడో కానీ తెలంగాణా రాజకీయాలు మరింత సందడిగా మారిపోయాయి.…

2 minutes ago

ఫోన్ కోసం పుట్టిన పసికందునే అమ్మేశారు

ప్రపంచీకరణ నేపథ్యంలో మానవ సంబంధాలన్ని అంగడిలో సరుకులుగా మారిపోతున్నాయి. బంధాలు, అనుబంధాలు ఖరీదైన వస్తువులుగా మారిపోయాయి. పాపాయి కంటే రూపాయికే…

1 hour ago

జూనియర్ ఇచ్చిన జోష్ సరిపోతుందా

ఎల్లుండి విడుదల కాబోతున్న 'డోంట్ ట్రబుల్ ది ట్రబుల్' ప్రమోషన్ల ఘట్టం చివరి అంకాన్ని నిన్న దిగ్విజయంగా పూర్తి చేశారు.…

1 hour ago

పార్టీ క‌న్నా ప‌రువు కాపాడుకునేదెలా…

కొంతమంది నాయకుల విషయంలో పార్టీ ముందు.. తర్వాత నాయకులు.. అనే మాట వినిపిస్తుంది. నిజంగా రాజకీయాల్లో కొత్తగా వచ్చినవారు యువతరం…

1 hour ago

విజయవాడలో 10 కోట్లు… దేశంలోనే మొదటిసారి

సైబ‌ర్ నేరాల గురించి త‌ర‌చుగా వార్త‌లు వ‌స్తున్నాయి. బాధితుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ప్ర‌భుత్వాలు స‌హా రిజ‌ర్వ్ బ్యాంకు…

2 hours ago

ఒక్క యాడ్‌కు 40 కోట్ల పారితోష‌కం?

చాలా ఏళ్ల నుంచి త‌మిళ సినిమాను ఏలుతున్న హీరోల్లో అజిత్ ఒక‌డు. సూప‌ర్ స్టార్ ర‌జినీకాంత్, ద‌ళ‌ప‌తి విజ‌య్ త‌ర్వాత…

2 hours ago