Political News

నారా లోకేష్ 2.0

దేశంలోని రాజకీయ నాయకుల్లో అత్యధికంగా సోషల్ మీడియా ట్రోలింగ్ ఎదుర్కొన్న వాళ్లలో నారా లోకేష్ ఒకడు. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీని సోషల్ మీడియా జనాలు ఒక ఆడుకునేవాళ్లు. ఇప్పటికీ ఆడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో నారా లోకేష్ అదే స్థాయిలో టార్గెట్ అయ్యాడు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండా ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి చేపట్టడం, మరీ లావుగా ఉండి యువతను ఇన్‌స్పైర్ చేసేలా లేకపోవడం, విషయ పరిజ్ఞానంలో వెనుకబడటం, అన్నింటికీ మించి వేదికల మీద మాట్లాడేటపుడు తడబాటు లోకేష్‌కు ప్రతికూలంగా మారాయి.

లోకేష్‌ను ఒక అసమర్థుడిలా ప్రొజెక్ట్ చేస్తూ విపరీతంగా ట్రోల్ చేసేవాళ్లు నెటిజన్లు. అలాగే రాజకీయ ప్రత్యర్థులు కూడా లోకేష్‌ను ఎంతగా విమర్శించేవాళ్లో, ఎద్దేవా చేసేవాళ్లో తెలిసిందే.

ఐతే లాక్ డౌన్ టైంలో నారా లోకేష్ ఆత్మపరిశీలన చేసుకున్నాడో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్య అతడిలో చాలా మార్పు కనిపిస్తోంది. తన లోపాలన్నింటినీ సవరించుకునే పనిలో పడ్డట్లే కనిపిస్తున్నాడు లోకేష్. ముందుగా తన అవతారాన్ని మార్చుకున్నాడు. బాగా సన్నబడి మామూలు స్థాయికి చేరాడు. భాష మీద పట్టు సాధించాడు. బెదురు పోయింది. స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అన్నింటికీ మించి జనాల్లో తిరుగుతున్నాడు.

ప్రజల ఆదరణ, ఆమోదం పొందాలంటే క్షేత్ర స్థాయిలో తిరగడానికి మించి మార్గం లేదని అతను గుర్తించినట్లే ఉంది. వరదలతో కష్టాలు పడుతున్న రైతుల కోసం పొలాల్లో తిరిగాడు. తరచుగా మీడియాతో మాట్లాడుతున్నాడు. ఇంతకుముందులా అక్కడ తడబాటు కనిపించడం లేదు. మామూలు విషయాలు చెప్పడానికే ఇబ్బంది పడ్డ లోకేష్.. ఇప్పుడు వైకాపాపై సూటిగా విమర్శలు చేయగలుగుతున్నాడు. పంచ్‌లు వేస్తున్నాడు.

అన్నింటికీ మించి హైలైట్ ఏంటంటే.. తాజాగా ఒక ప్రెస్ మీట్లో తాను చెప్పాల్సింది అంతా చెప్పేశాక మీడియావాళ్లు ప్రశ్నలు వేయమని ఒకటికి రెండుసార్లు తనే రెట్టించి అడిగాడు. ‘‘నేను జగన్ లాగా పారిపోను. ప్రశ్నలేయండి’’ అంటూ ఏపీ సీఎంకు గట్టి పంచే వేశాడు లోకేష్. చంద్రబాబు వారసుడిలో ఈ మార్పు తెలుగుదేశం వర్గాల్లో ఉత్సాహం నింపుతుందనడంలో సందేహం లేదు.

This post was last modified on October 24, 2020 6:10 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

1 hour ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

2 hours ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

2 hours ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

4 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

4 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

4 hours ago