Political News

రేవంత్ కు మోదీ ఫోన్.. సీఎంకు పీఎం భరోసా

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. శనివారం రాత్రి 7 గంటల సమయంలో రేవంత్ కు కాల్ చేసిన మోదీ… శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ (ఎస్ఎల్బీసీ)లో చోటుచేసుకున్న ప్రమాదంపై ఆరా తీశారు. ఎస్ఎల్బీసీలో చిక్కుకుపోయిన కార్మికులను రక్షించేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని, భయపడాల్సిన అవసరం ఏమీ లేదని ఆయన రేవంత్ కు భరోసా ఇచ్చారు. ఇందుకోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపనున్నట్లుగా మోదీ చెప్పారు.

శనివారం ఉదయం ఎస్ఎల్బీసీ సొరంగంలో ఉన్నట్లుండి పైకప్పు కూలింది. కార్మికులు పని ప్రారంభించే సమయంలోనే ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన సమయంలో 50 మందికి పైగానే కార్మికులు ఉన్నారు. ఎస్ఎల్బీసీ సొరంగంలో 14వ కిలో మీటర్ వద్ద సొరంగం పైకప్పు కూలిపోయింది. దాదాపుగా 3 కిలో మీటర్ల మేర పైకప్పు కూలిపోయింది. ఈ క్రమంలో సొరంగంలోని రింగులు ఊడిపోవడంతో లోపల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో లోపల చిక్కుబడిపోయిన కార్మికులను బయటకు తీసుకురావడం కష్టంగా మారింది.

అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రమాదం గురించి తెలిసినంతనే ఘటనాస్థలానికి పరుగులు పెట్టారు. అగ్ని మాపక శాఖ డీజీ కూడా తన సిబ్బందితో కలిసి హుటాహుటీన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సొరంగంలో చిక్కుకుపోయిన కార్మికులను బయటకు తీసుకువచ్చే పనులు ముమ్మరంగా కొనసాగించారు. చీకటి పడే సమయానికి 42 మంది కూలీలను బయటకు తీసుకురాగా.. వారిలో 13 మంది గాయపడినట్టుగా తెలుస్లోంది. వీరిని హుటాహుటీన సపీమంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక సొరంగంలోనే మరో 8 మంది చిక్కుకుపోయారని తేలడం.. అదే సమయంలో చీకటి పడటంతో రాష్ట్ర ప్రభుత్వ వర్గాల్లో ఆందోళన నెలకొంది.

ఈ ప్రమాదంపై సమాచారం తెలిసినంతనే… ఘటన జరిగిన తీరుపై ప్రధాని ఉన్నతాధికారులతో ఆరా తీశారు. ఆ వెంటనే రేవంత్ రెడ్డికి ఫోన్ చేశారు. ఈ సందర్భంగా ప్రమాదం జరిగిన తీరు… దానిపై తమ ప్రభుత్వం స్పందించిన తీరు…ఇప్పటిదాకా కొనసాగిన చర్యలు, ఇంకా చిక్కుబడిపోయిన కార్మికుల గురించి రేవంత్ ఆయనకు పూసగుచ్చినట్లు వివరించారు. దీంతో భయపడాల్సిందేమీ లేదని… కార్మికులను బయటకు తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని మోదీ హామీ ఇచ్చారు. అంతేకాకుండా అప్పటికప్పుడే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపుతున్నామని, వారి సేవలు వినియోగించుకుని కార్మికులను బయటకు తీసుకురావాలని సూచించారు. ఈ విషయంలో మరే సహకారం కావాలన్నా అడగాలని కూడా రేవంత్ కు మోదీ సూచించారు.

This post was last modified on February 22, 2025 9:26 pm

Share

Recent Posts

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 minutes ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

7 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

8 hours ago