సోషల్ మీడియా యాక్టివిస్టులకు నిజంగానే ఎంత చెప్పినా… వారు చేస్తున్నతప్పేమిటన్నది తెలియరానట్టుంది. ఎందుకంటే.. సోషల్ మీడియాలో వారు పెడుతున్న పోస్టులు అవతలి వారిని ఎంతటి మానసిక వేదనకు గురి చేస్తున్నాయన్న విషయం ఇప్పటికే అందరికీ తెలిసివచ్చింది. ఈ విషయాలపై స్వయంగా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా పలుమార్లు సంచలన వ్యాఖ్యలే చేసింది. అయినా కూడా సోషల్ మీడియా యాక్టివిస్టుల వైఖరిలో లేశమాత్రం మార్పు కూడా రావట్లేదు. అందుకు నిదర్శనమే జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ః ఫొటోలను మార్ఫింగ్ చేస్తున్న కొందరు వ్యక్తులు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అయితే దీనిపై ఏపీలో ఇప్పుడు వరుసబెట్టి కేసులు నమోదు అయిపోతున్నాయి.
ఇటీవలే ధర్మ పరిరక్షణ యాత్ర పూర్తి చేసుకున్న తర్వాత సతీసమేతంగా పవన్ మహా కుంభమేళాకు వెళ్లిన సంగతి తెలిసిందే. కుమారుడు అకీరా నందన్ తో కలిసి పవన్ దంపతులు ప్రయాగ్ రాజ్ లో పుణ్య స్నానాలు ఆచరించారు. ఈ సందర్భంగా పవన్ చొక్కా తీసి స్నానం ఆచరించారు. ఈ సందర్బంగా తీసిన ఫొటోలు, వీడియోలను చేజిక్కించుకున్న కొందరు దుర్మార్గులు ఆ ఫొటోలను మార్ఫింగ్ చేశారు. హాస్య నటుడు సంపూర్ణేశ్ బాబు ఫొటోలతో పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి వికృతానందం పొందుతున్నారు. ఈ ఫొటోలు సోసల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పవన్ ఫ్యాన్స్, జన సైనికులు రంగంలోకి దిగిపోయారు. పవన్ ఫొటోలను మార్ఫింగ్ చేసి. ఆ ఫొటోలను వైరల్ చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై వరుసగా పోలీస్ స్టేషన్లకు వెళ్లి ఫిర్యాదులు చేస్తున్నారు.
ఈ క్రమంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే పవన్ మార్ఫింగ్ ఫొటోలపై కేసులు నమోదు అయ్యాయి. ఈ ఫొటోలను హర్షవర్ధన్ అనే సోషల్ మీడియా యాక్టివిస్టు మార్ఫింగ్ చేశాడని ప్రాథమికంగా గుర్తించారు. చిత్తూరులోని గ్రీమ్స్ పేటకు చెందిన ఇతడిపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లకు కంప్లైంట్ లు పోటెత్తుతున్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా కావలి పోలీస్ స్టేషన్ లో జనసైనికులు ఫిర్యాదు ఆధారంగా అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇక చిత్తూరులోని 2 టౌన్ పీఎస్ లోనూ జనసైనికుల ఫిర్యాదుతో అతడిపై ఇంకో కేసు నమోదు అయ్యింది. జనసేన బలంగా ఉన్న తిరుపతిలోనూ ఆ పార్టీ శ్రేణుల ఫిర్యాదుతో హర్షవర్ధన్ పై కేసు నమోదు అయ్యింది. పరిస్థితి చూస్తే… శుక్రవారం సాయంత్రానికి రాష్ట్రవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో ఈ వ్యవహారంపై పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on February 21, 2025 2:43 pm
ఏపీ రాజధాని అమరావతిలో తెలంగాణా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ అంతర్జాతీయ ప్రమాణాలతో హోటల్ నిర్మిస్తున్నట్లు పుకార్లు షికార్లు…
ఆదర్శ కుటుంబం ఏకె 47 విడుదల అక్టోబర్ 9 నుంచి మళ్ళీ వాయిదా పడిందనే వార్త సోషల్ మీడియాలో గుప్పుమని…
బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఓ పెద్ద హిట్టు కొట్టి చాలా ఏళ్లయిపోయింది. అసలే ఫ్లాపుల్లో ఉన్న అతడికి…
భారత ఎన్నికల సంఘంలో అత్యంత వివాదాస్పద కమిషనర్ గా పేరొందిన జ్ఞానేష్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటుంది. కేంద్రంలోని బీజేపీ…
యువత జీవితంలో కెరీర్, ఉద్యోగం, ఆర్థిక బాధ్యతలు కీలక దశను నిర్ణయిస్తాయి. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి…
ఐటీ రంగానికి కేంద్రంగా మారిన తెలంగాణలోని సైబరాబాద్‌కు ప్లస్‌గా అమరావతిని నిర్మిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…