మన దేశంలో నివసిస్తున్న పౌరులు ఎవరైనా సరే భారత రాజ్యాంగాన్ని గౌరవించాల్సిందే. భారత దేశంలో అమలవుతున్న చట్టాలను, నియమనిబంధనలను ప్రధాని మొదలు సామాన్యుడి వరకు అందరూ పాటించాల్సిందే. అయితే, ఏపీ మాజీ సీఎం, వైసీపీ అధినేత, ప్రస్తుతం పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్ మాత్రం ఈ చట్టాలు తనకు వర్తించవు అన్నరీతిలో వ్యవహరిస్తున్న వైనం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో జగన్ గుంటూరు మిర్చి యార్డు పర్యటనకు ఈసీ, ఎన్నికల అధికారి అయిన గుంటూరు జిల్లా కలెక్టర్, పోలీసులు అనుమతి నిరాకరించారు.
అయినా సరే చిత్తూరులో పుష్పగాడి రూల్ అన్నట్లు…గుంటూరులో జగన్ రూల్ అంటూ వైసీపీ సోషల్ మీడియా ఇచ్చిన ఎలివేషన్లకు తగ్గట్లుగానే జగన్ గుంటూరు మిర్చి యార్డులో పర్యటించారు. అనుమతి లేకుండా పర్యటించిందే కాకుండా పోలీసులు తనకు భద్రత కల్పించలేదంటూ వాపోయారు జగన్. ఈ క్రమంలోనే తాజాగా జగన్ తో పాటు 8 మంది వైసీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.
జగన్ తోపాటు ఈసీ ఆదేశాలు బేఖాతరు చేస్తూ మిర్చి యార్డులో పర్యటించిన అంబటి రాంబాబు, కొడాలి నాని, లేళ్ల అప్పిరెడ్డి, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నందిగం సురేశ్ తదితరులపై కూడా గుంటూరు జిల్లా నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఈసీ ఆదేశాలతో కేసు నమోదైంది. జగన్ టూర్ వల్ల మిర్చియార్డు ముందు గుంటూరు కొండమోడు మెయిన్ రోడ్డు మీద భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. నిత్యం వేలాది వాహనాలు ప్రయాణించి ప్రధాన రహదారిపై గంటలకొద్దీ వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఇక, వైసీపీ నేతలు తమ వాహనాలకు రోడ్డుపక్కనే పార్క్ చేయడంతో యార్డుకు వచ్చే వాహనాలు కూడా రోడ్డుపైనే నిలిచిపోయాయి. దీంతో, మిర్చి యార్డులో పెట్టేందుకు వచ్చిన రైతులు ఇబ్బంది పడ్డారు.
This post was last modified on February 20, 2025 6:01 am
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌కు వరుసగా లభిస్తున్న గౌరవాలు ఆయన వ్యక్తిత్వానికి మరో కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తున్నాయి. భారతీయ సంస్కృతి,…
మెగాస్టార్ చిరంజీవి.. పోస్టర్ మీద ఈ పేరు చూస్తే చాలు.. కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవాళ్లు ఒకప్పుడు. ఆయన ఫ్లాప్…
తెలంగాణలో ఓ మహిళా ఐఏఎస్ అధికారిపై నల్గొండ జిల్లాకు చెందిన ఓ సీనియర్ మంత్రి మనసు పారేసుకున్నారని, లేటు వయసులో…