ఆంధ్రప్రదేశ్‌లో గత పర్యాయం అధికారంలో ఉన్న చంద్రబాబు సర్కారు ప్రచార యావ గురించి ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నెన్ని విమర్శలు చేసిందో గుర్తుండే ఉంటుంది. బాబుకు పబ్లిసిటీ పిచ్చని, అందుకోసం వందల కోట్లు తగలెడుతున్నారని జగన్ అండ్ కో విమర్శించారు. ఇంకా చాలా విషయాల్లో వృథా ఖర్చు గురించి జగన్ ఘాటు విమర్శలు చేశారు. విభజన తర్వాత ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మీద బాబు అదనపు భారం మోపుతున్నారని అన్నారు.
ఇన్నేసి విమర్శలు చేశాక అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు అలాంటి తప్పులేమీ చేయదని అంతా అనుకున్నారు. కానీ బాబుకు, జగన్‌కు తేడా ఏమీ కనిపించలేదు. పైపెచ్చు ప్రచార హడావుడిలో జగన్ సర్కారు రెండాకులు ఎక్కువే చదివిందన్న విమర్శలు వచ్చేలా అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి.
వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వ కార్యాలయాలకు వైకాపా పార్టీ రంగులు వేయడం దగ్గర్నుంచి ఎన్నో విషయాల్లో జగన్ సర్కారు శ్రుతి మించే వ్యవహరించింది. ఈ మధ్య జగనన్న విద్యా కానుక అంటూ విద్యార్థులకు కిట్లు ఇచ్చి అందులో బెల్టుల మీద కూడా జగనన్న పేరు వేయడం గమనార్హం. ఇలా చాలా పథకాల విషయంలో చేశారు. జగన్ పేరు చిరస్థాయిగా ఉండిపోవాలని ఇలాంటి విపరీత చర్యలెన్నో చేస్తున్నారు.
ఇవి చాలవని తాజాగా జగన్ పేరును చిరస్థాయిగా నిలిపేందుకు ఏపీ సర్వే అధికారులు ఏర్పాట్లు చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. జగన్ బొమ్మలతో కూడిన సరిహద్దు రాళ్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయట ఏపీలో. ముందు భాగాన జగన్ బొమ్మ, వెనుక భాగాన బాణం గుర్తు ఉండేలా ఖరీదైన గ్రానైట్ రాళ్లపై చెక్కించి వాటిని సరిహద్దు రాళ్లుగా రాష్ట్ర వ్యాప్తంగా వినియోగించాలని భావిస్తున్నారట. ఇందుకోసం ఐదు వేల గ్రానైట్ రాళ్లను ఆర్డర్ చేసే ప్రయత్నంలో ఉన్నారట. ఇందుకోసం వందల కోట్లు ఖర్చు కావడం ఖాయం. జగన్‌ను మెప్పించేందుకు సర్వే అధికారులు ఇలా చేస్తున్నారా లేక ప్రభుత్వం నుంచే ఇందుకు ఆదేశాలు వచ్చాయా అన్నది తెలియదు కానీ.. జనం డబ్బులతో రాజకీయ నాయకులు చేసుకునే పబ్లిసిటీలో ఇది కొత్త దుస్సంప్రదాయం అవుతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on October 23, 2020 12:19 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…