Political News

కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌ల‌మిస్తున్న ప‌వ‌న్ క‌ల్యాణ్‌

వ‌చ్చే 15 ఏళ్ల‌పాటు కూట‌మి అధికారంలో ఉండాల‌ని జ‌న‌సేన అధినేత‌, ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌ బ‌లంగా చెబుతున్న విష‌యం తెలిసిందే. ప‌దే ప‌దే ఈ విష‌యాన్ని చెప్ప‌డం ద్వారా వైసీపీని బ‌లంగా ఎదుర్కొనేందుకు కూట‌మిగా ఉండ‌డం ఒక్క‌టే కీల‌క మంత్ర‌మ‌న్న విష‌యాన్ని ఆయ‌న తేల్చేస్తున్నారు. అయిన‌ప్ప‌టికీ క్షేత్ర‌స్థాయిలో లోపాలు క‌నిపిస్తూనే ఉన్నాయి. నాయ‌కుల మ‌ధ్య కీచులాట‌లు కూడా కొన‌సాగుతున్నాయి. ఈ క్ర‌మంలో తాజాగా మ‌రింత కీల‌క దిశానిర్దేశం చేస్తూ ప‌వ‌న్ క‌ల్యాణ్ అసెంబ్లీలో ప్ర‌సంగించారు.

ప్ర‌ధానంగా మూడు విష‌యాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు.

1) చేసింది చెప్పుకోలేక పోవ‌డం: ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం చేస్తున్న మంచి ప‌నులు, తీసుకువ‌స్తున్న పెట్టుబ‌డులు, నిర్వ‌హిస్తున్న కార్య‌క్ర‌మాలు, చేస్తున్న సంక్షేమం వంటి అనేక అంశాల‌ను ప‌వ‌న్ క‌ల్యాణ్ ప‌రోక్షంగా ప్ర‌స్తావించారు. చేసిందిచెప్పుకోలేక పోతున్నామ‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ క్ర‌మంలో వైసీపీని ఆయ‌న ఉద‌హ‌రించారు. వైసీపీ స‌భ్యులు 11 మంది మాత్ర‌మే ఉన్న‌ప్ప‌టికీ 11 వంద‌ల మంది ఉన్న‌ట్టు మాట్లాడ‌తార‌ని చెప్పారు. దీనికి కార‌ణం వారు చెప్పేది బ‌లంగా న‌మ్ముతున్నార‌ని వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో కూట‌మి ప్ర‌భుత్వం, నాయ‌కులు ఏ కార‌ణంతోనో చేసింది చెప్పుకోలేక‌పోతున్నామ‌ని వ్యాఖ్యానించారు. అంటే ఒక‌ర‌కంగా చేసింది ప్ర‌చారం చేసుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ తేల్చి చెప్పారు. దీనికి పార్టీల‌కు అతీతంగా అంద‌రూ ముందుకు సాగాల‌న్న అంశాన్ని ఆయ‌న ప్ర‌స్తావించారు.

2) ఏకాభిప్రాయం: వివిధ ఉద్దేశాలు, విభిన్న సిద్ధాంతాలు ఉన్న బీజేపీ, జ‌న‌సేన‌, టీడీపీలు ఒకే జ‌ట్టుగా ఉన్నాయి. కూట‌మి అధికారంలోకి వ‌చ్చాయి. అయితే ఆయా పార్టీల నాయ‌కులు ఏకాభిప్రాయంతో ఉండ‌డం లేద‌న్న‌ది వాస్త‌వం. ఈ విష‌యాన్నే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావించారు. వేర్వేరు స‌మూహాలు, సిద్ధాంతాల నుంచి వ‌చ్చిన‌ప్ప‌టికీ నాయ‌కుల మ‌ధ్య ఏకాభిప్రాయాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఏకాభిప్రాయంతోనే ముందుకు సాగాల‌ని కూడా పేర్కొన్నారు. త‌ద్వారానే కూట‌మి ప‌ది కాలాల పాటు నిల‌బ‌డుతుంద‌న్నారు.

3) కులాల ప్ర‌స్తావ‌న: వైసీపీ నేత‌లు ఇష్టం వ‌చ్చిన‌ట్టు తిట్టి కులాల వెనుక దాక్కుంటున్నార‌ని పేర్కొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌జ‌ల‌కు నిజాలు తెలియాల‌ని చెప్పారు. అంటే నాయ‌కులు ఈ విష‌యంపై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు.

మొత్తంగా కూట‌మి పార్టీలు విజ‌య‌వంతంగా ముందుకు సాగేందుకు అనుస‌రించాల్సిన వ్యూహాన్ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ఆవిష్క‌రించారు. ఒక‌ర‌కంగా చెప్పాలంటే ఈ మూడు ఫార్ములాల‌ను ఒంట‌బ‌ట్టించుకుంటే కూట‌మికి వెయ్యి ఏనుగుల బ‌లం చేకూరుతుంద‌న‌డంలో ఎలాంటి సందేహం లేద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు.

This post was last modified on March 7, 2026 10:07 am

Share

Recent Posts

విశ్వక్ సేన్ వేగం… 36 రోజుల్లో 3 సినిమాలు

ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…

22 minutes ago

చూసుకుందాం అంటున్న స్పిరిట్ నిర్మాత‌

సందీప్ రెడ్డి వంగ‌నే కాదు.. ఆయ‌న సోద‌రుడు ప్ర‌ణ‌య్ రెడ్డి వంగ కూడా మామూలోడు కాద‌ని.. ఆయ‌న కాన్ఫిడెన్స్ లెవెల్…

57 minutes ago

ఎన్నికల ఫలితాలపై AI ప్రభావం

AI వల్ల ఉద్యోగాలు, బ్యాంకింగ్, విద్య రంగాల్లో మార్పులు వస్తున్నాయనే ఆందోళన ఇప్పటికే ఉంది. ఇప్పుడు ఎన్నికలపైనా దీని ప్రభావం…

1 hour ago

బుమ్రా తిరిగొచ్చాడు.. కానీ..

రెండు నెలల విరామం తర్వాత జస్ప్రీత్ బుమ్రా మళ్లీ టీమ్ఇండియాతో చేరారు. ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 సిరీస్‌కు ముందు ఢిల్లీలో జరిగిన…

2 hours ago

హనుమాన్ అంశ్… అసలు ఈ బాబా కథేంటి?

హనుమాన్ అంశ్ కలెక్షన్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతున్నాయి. రూ.2 కోట్ల లోపు బడ్జెట్‌తో మొదలైన సినిమా రూ.200 కోట్ల…

5 hours ago

యేషనాగుల డ్యాన్స్ ఓదెల నిర్ణయమే

నాని కొత్త సినిమా ‘ది ప్యారడైజ్’ నుంచి వచ్చిన తొలి పాట ‘ఆయా షేర్’ అద్భుతమైన స్పందన తెచ్చుకుని ఎక్కడికో…

5 hours ago