తెలంగాణలో ఇక రాజకీయం రసవత్తరంగా మారనుందా? విపక్ష బీఆర్ఎస్ మరింతగా చెలరేగిపోనుందా? అధికార కాంగ్రెస్ దూకుడుకు చెక్ పడిపోతుందా? క్రమంగా పుంజుకుంటున్న బీజేపీకి ఇక కష్టకాలమే రానుందా?… ఈ అన్ని ప్రశ్నలకు త్వరలోనే సమాధానం లభించనుంది. ఇందుకు కొంత సమయం పట్టినా… తెలంగాణ రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు అయితే కనిపించనుందని చెప్పక తప్పదు. ఎందుకంటే… 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర పెద్దగా బయటకు వచ్చిందే లేదు. తదుపరి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉంది కదా.. అప్పటిదాకా కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటారులే అన్న వాదనలకు ఫుల్ స్టాప్ పెట్టిన కేసీఆర్… బుధవారం బయటకు వచ్చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో మరింత క్రియాశీలకంగా పనిచేసే దిశగా ఆయన ఓ కీలక నిర్ణయం అయితే తీసుకున్నారన్న వాదనలు బీఆర్ఎస్ నుంచి వినిపిస్తున్నాయి.
బుధవారం ఉదయం ఎర్రవరి ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన కేసీఆర్ నేరుగా… సికింద్రాబాద్ వెళ్లారు. అక్కడ పాస్ పోర్టు ఆఫీస్ కు వెళ్లనున్న కేసీఆర్ తన పాస్ పోర్టును అప్ గ్రేడ్ చేయించుకుంటారు. ఆ తర్వాత నంది నగర్ లోని తన నివాసానాకి చేరుకుని… మధ్యాహ్న భోజనం తర్వాత తన ఇంటి నుంచి నేరుగా బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ కు చేరుకుంటారు. అక్కడ జరగనున్న పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన కీలక ఉపన్యాసం చేస్తారు. ఈ ప్రసంగంతో కేసీఆర్ దాదాపుగా ఏడాది కాలం తర్వాత తిరిగి రాజకీయంగా యాక్టివేట్ కానున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ స్పీచ్ బీఆర్ఎస్ శ్రేణులను మంత్రముగ్ధులను చేయనుందన్న వాదనలు అయితే వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వైరి వర్గాలకు ఓ స్పష్టమైన హెచ్చరికలు కూడా జారీ అయ్యే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం మనం పిలుస్తున్న బీఆర్ఎస్… టీఆర్ఎస్ గా ప్రస్థానం మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ ఆవిర్భవించి ఈ నెల 27 నాటికి సరిగ్గా 25 ఏళ్లు పూర్తి కానుంది. ఈ సందర్భంగా పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించేందుకు కేసీఆర్ తీర్మానించారు. ఈ వేడుకలకు సన్నాహకంగానే బుధవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణ, అందుకోసం తీసుకోవాల్సిన చర్యలు… వేడుకలకు వేదిక, జన సమీకరణ తదితర అంశాలన్నింటినీ కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అంతేకాకుండా పార్టీ మరింతగా క్షీణించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సమగ్ర చర్చ జరగనున్నట్లు సమాచారం.
This post was last modified on February 19, 2025 1:07 pm
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ఆ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని సీపీఐ సీనియర్ నేత నారాయణ డిమాండ్…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే మరో 40 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్టు తెలిపారు.…