Political News

బీజేపీ లో చేరికపై స్పందించిన కేశినేని నాని!

విజ‌య‌వాడ మాజీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ నాయ‌కుడు కేశినేని నాని.. తిరిగి వైసీపీ గూటికి చేరుతార‌ని.. గ‌త నాలుగు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అదేస‌మ‌యంలో కాదు, మా పార్టీలోకి వ‌స్తున్నారంటూ.. బీజేపీ నాయ‌కులు కూడా అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో చెబుతున్నారు.

వైసీపీలోకి రావాల‌ని నాని ప్ర‌య‌త్నిస్తున్నార‌ని.. వైసీపీ శిబిరం నుంచి లీకులు వ‌స్తున్నాయి. ఆయ‌న‌కు, జ‌గ‌న్‌కు మ‌ధ్య గ‌ట్టి అనుబంధం ఉంద‌ని.. ఈ క్ర‌మంలో తిరిగియాక్టివేట్ అవుతున్నార‌న్న‌ది వైసీపీ నేత‌ల మాట‌.

ఇక‌, బీజేపీ అగ్ర‌నాయ‌కులు నితిన్ గ‌డ్క‌రీ, అమిత్‌షా వంటివారితో నానికీ ప్ర‌త్యేక అనుబంధం ఉంద‌ని.. ఈ నేప‌థ్యంలో నాని త్వ‌ర‌లోనే బీజేపీ గూటికి చేరుతారంటూ.. ఆ పార్టీ నాయ‌కులు చెబుతున్నారు.

అయితే.. తాజాగా ఈ వ్యాఖ్య‌ల‌పై నాని రియాక్ట్ అయ్యారు. “నా రాజకీయ రిటైర్మెంట్ గురించి మరోసారి నా వైఖరిని స్పష్టం చేస్తున్నాను. గ‌త‌ ఏడాది జూన్ 10న రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు అధికారికం గా ప్రకటించాను. ఆ నిర్ణయం మారదు“ అని నాని తాజాగా ప్ర‌క‌టించారు.

అంతేకాదు.. తాను రాజ‌కీయాల నుంచి త‌ప్పుకొన్న‌ప్ప‌టికీ.. ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లో ఉండాల్సిన అవసరం లేదని హృదయపూర్వకంగా నమ్ముతున్నట్టు తెలిపారు. ప్రజాసేవ అనేది జీవితాంతం నిబద్ధత అని, కుల, మత, రాజకీయాలకు అతీతంగా ఉంటుందని పేర్కొన్నారు.

విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానన్న నాని… సమాజానికి త‌న‌ సేవ ఏ రాజకీయ పార్టీతో లేదా పదవితో ముడిపడి లేదని స్ప‌ష్టం చేశారు.

`విజయవాడలోని నా తోటి పౌరుల శ్రేయస్సు.. నా లోతైన అంకితభావంతో ముడిపడి ఉంది. నా రాజకీయ పునరాగమనానికి సంబంధించి నిరాధారమైన వార్తలను విస్మరించమని నేను అందరినీ కోరుతున్నాను. విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గం, దానిలోని ప్రజల అభివృద్ధి, శ్రేయస్సుకు అన్ని విధాలుగా సహకరించడంపై మాత్రమే నా దృష్టి ఉంది“ అని నాని పేర్కొన్నారు.

కాగా.. గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేరిన నాని ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. అనంత‌రం.. రాజ‌కీయంగా దూర‌మ‌వుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు.

This post was last modified on February 17, 2025 1:38 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

5 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

6 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

6 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

7 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

7 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

7 hours ago