Political News

అమరావతిలో బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్: బాలకృష్ణ

హిందూపురం ఎమ్మెల్యే, టాలీవుడ్ హీరో నందమూరి బాలకృష్ణ ఇటు రాజకీయాలలో..అటు సినిమా షూటింగులలో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ కు సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రం క్రమం తప్పకుండా పాల్గొంటారు. క్యాన్సర్ బాధితుల కోసం తన తండ్రి నందమూరి తారకరామారావు ప్రారంభించిన ఆ ఆసుపత్రిని బాలకృష్ణ అభివృద్ధి చేశారు.

ఒక్కొక్క విభాగాన్ని విస్తరించుకుంటూ అంతర్జాతీయ వైద్య సేవలను పేదలకు, సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలోనే ఈ రోజు హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో పీడియాట్రిక్‌ వార్డు, పీడియాట్రిక్‌ ఐసీయూను బాలకృష్న ప్రారంభించారు. క్యాన్సర్‌ బాధితులు మనోధైర్యంతో ఉంటే కచ్చితంగా కోలుకుంటారని ఆయన అన్నారు.

క్యాన్సర్‌తో ఎంతోమంది బాధపడుతున్నారని, ఇప్పటివరకు 200 మంది చిన్నారులకు బోన్ మార్పిడి చేశామని చెప్పారు. ఆర్థిక స్థోమత లేని వారికి క్యాన్సర్ వైద్యం అందించడమే తమ లక్ష్యం అని అన్నారు. క్యాన్సర్ మహమ్మారిపై ప్రజల్లో అవగాహన కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. ఈ సందర్భంగా ఆయన కీలక ప్రకటన చేశారు.

ఆసుపత్రి విస్తరణలో భాగంగా అమరావతిలోని తుళ్లూరులో మరో 8 నెలల్లో క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభిస్తామని బాలకృష్ణ తెలిపారు. అమరావతిలో బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్, రీసెర్చ్‌ సెంటర్‌ నిర్మాణానికి ఏపీ ప్రభుత్వం ఆల్రెడీ 15 ఎకరాలను కేటాయించింది. ఆసుపత్రి నిర్మాణం చేపట్టే ప్రాంతాన్ని ఆసుపత్రి చైర్మన్ బాలకృష్ణతోపాటు సీఆర్డీఏ కమిషనర్‌ కాటమనేని భాస్కర్‌ పరిశీలించారు.

ఫేజ్‌-1లో 300 పడకలతో బసవ తారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్‌ హాస్పిటల్ ను తుళ్లూరులో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. భవిష్యత్తులో దీన్ని 1000 పడకలకు విస్తరించే యోచనలో ఉన్నారు. ఈ ప్రాంతంలో నిర్మాణానికి అడ్డుగా ఉన్న హెటీ విద్యుత్‌ లైన్ల తొలగింపు పూర్తి కాగానే నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

This post was last modified on February 15, 2025 1:21 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాహుల్ చేతికి ర‌క్త‌పు మ‌ర‌క‌లు: కేటీఆర్

బీఆర్ ఎస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌, ఎంపీ…

1 hour ago

‘జాక్’కు అడ్డం పడుతున్న ఆ డిజాస్టర్

ఒక సినిమా భారీ నష్టాలు మిగిలిస్తే.. ఆ చిత్రలో భాగమైన వాళ్లు చేసే తర్వాతి చిత్రం మీద దాని ఎఫెక్ట్ పడడం…

1 hour ago

ఏపీలో సర్కారీ వైద్యానికి కూటమి మార్కు బూస్ట్

ప్రభుత్వ వైద్య సేవల గురించి పెదవి విరవని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. వాస్తవ పరిస్థితులు అలా ఉన్నాయి మరి.…

3 hours ago

వైసీపీ ఆ ఇద్దరి రాజకీయాన్ని చిదిమేసిందా?

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో మొదలైన పార్టీ వైసీపీ..ఎందరో నేతలను రాజకీయాల్లోకి తీసుకొచ్చింది. కొందరిని అసెంబ్లీలోకి అడుగుపెట్టిస్తే… మరికొందరిని…

4 hours ago

‘టెస్ట్’ మ్యాచులో ఓడిపోయిన ప్రేక్షకుడు

ఆర్ మాధవన్, నయనతార, సిద్దార్థ్. ఈ మూడు పేర్లు చాలు ఒక కంటెంట్ మీద ఆసక్తి పుట్టి సినిమా చూసేలా…

5 hours ago

బోలెడు శుభవార్తలు చెప్పిన జూనియర్ ఎన్టీఆర్

దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…

5 hours ago