కోలీవుడ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చి ఇంకా ఏడాది కూడా కాలేదు… అప్పుడే ఆయన ఏకంగా కేంద్ర ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న వీఐపీల జాబితాలోకి చేరిపోయారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. అయితే ఆ ఎన్నికలకు ముందే విజయ్ కి ఈ మాదిరి ఎలివేషన్ వచ్చేసిందంటూ ఆయన ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.
తమిళగ వెట్రి కజగమ్ పేరిట గతేడాది ఆగస్టులో రాజకీయ పార్టీ పెట్టిన విజయ్… ఇప్పటిదాకా ఎన్నికల బరిలోకి దిగలేదు. వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే.
అయినా ఎన్నికలు జరగకుండా… ఎన్నికల్లో పోటీ చేయకుండా విజయ్ కి నేరుగా కేంద్ర ప్రభుత్వమే భద్రత కల్పించే స్థాయి ఎలా వచ్చిందన్న విషయానికి వస్తే… సినిమాల్లో ఉన్నంతకాలం విజయ్ కి పెద్దగా బెదిరింపులు ఎదురు కాలేదు. కోట్లాది మంది అభిమానులు ఉన్న విజయ్…తన సొంత సెక్యూరిటీతోనే ఇప్పటిదాకా సాగారు.
అయితే ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించారో…ఆయనకు బెదిరింపులు మొదలయ్యాయట. ఇటీవలి కాలంలో సదరు బెదిరింపులు మరింతగా ఎక్కువయ్యాయట. ఇదే విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ వర్గాలు.. కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు నివేదించాయట.
నిఘా వర్గాల నివేదికను పరిశీలించిన కేంద్రం వై కేటగిరీ భద్రతను విజయ్ కి కేటాయించింది. ఈ మేరకు కేంద్ర హోం శాఖ ఉత్తర్వులు జారీ చేయగా… ఒకటి, రెండు రోజుల్లోనే సదరు భద్రత విజయ్ కి అందనుంది. వై కేటగిరీ భద్రత కింద విజయ్ కు 8 మందితో కూడిన భద్రతా సిబ్బంది రక్షణ కల్పిస్తారు. వీరిలో ఇద్దరు కమెండోలు కాగా… మిగిలిన వారు స్థానిక పోలీసులు ఉండనున్నారు.
విజయ్ కు ఈ భద్రతను కల్పించిన కేంద్రం… ఓ కండీషన్ ను కూడా పెట్టింది. విజయ్ తమిళనాడులో పర్యటించినప్పుడే మాత్రమే ఈ కేటగిరి భద్రత ఆయనకు లబిస్తుందట. తమిళనాడు దాటితే ఆయనకు ఈ భద్రత వర్తించదని కేంద్రం తన ఉత్వర్లుల్లో పేర్కొంది.
This post was last modified on February 15, 2025 12:24 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…