కేంద్రంలోని ఎన్డీఏ సర్కారు గురువారం సాయంత్రం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జాతుల వైరంతో అట్టుడికిపోయిన ఈశాన్య రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ గురువారం సాయంత్రం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
మణిపూర్ లో అధికార పార్టీగా బీజేపీనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రెండు రోజుల క్రితం సీఎంగా ఉన్న బీజేపీ సీనియర్ నేత బీరేన్ సింగ్ తన పదవికి రాజీనామా చేశారు. తదనంతరం రెండు రోజులకే కేంద్ర ప్రభుత్వం మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను విధిస్తూ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
వాస్తవానికి మణిపూర్ లో జాతుల వైరం నేపథ్యంలో గత కొంత కాలంగా అట్టుడుకుతోంది. పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలను కవర్ చేయడానికి వెళ్లిన మీడియా ప్రతినిధుల మీద కూడా అక్కడ దాడులు జరిగాయి.
మొత్తంగా అక్కడి పరిస్థితులు దారుణ స్థితికి అద్దంగా నిలిచాయి. అయినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గానీ, ఇతర కేంద్ర మంత్రులు గానీ… మణిపూర్ హింసపై నోరే మెదపలేదని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. మణిపూర్ లో బీజేపీ సీఎం రాజీనామా చేయాలని కూడా డిమాండ్ చేశాయి.
విపక్షాల ఆరోపణలు తనకు ఎంతమాత్రం వినిపించలేదన్న ధోరణిలో సాగిన బీజేపీ… ఢిల్లీ ఎన్నికలు ముగిసే దాకా సైలెంట్ గానే సాగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాదించినంతనే మణిపూర్ అంశంపై దృష్టి సారించిన బీజేపీ అగ్ర నేతలు… బీరేన్ సింగ్ తో రాజీనామా చేయించారని తెలుస్తోంది.
రాజీనామాకు ముందు ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనేతలను కలిసిన సంగతి తెలిసిందే. తాజాగా మణిపూర్ లో రాష్ట్రపతి పాలనను విధించిన కేంద్రం… అక్కడి పరిస్థితులను పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చిన తర్వాతే కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించనుందన్న దిశగా విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 13, 2025 7:57 pm
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…