మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్ద ఇటీవల జరిగిన కొన్ని పరిణామాలు చర్చనీయాంశం అయ్యాయి. తాడేపల్లి ప్యాలెస్ మీద ప్రత్యర్థి పార్టీల మద్దతుదారులు పదే పదే దాడి చేస్తున్నట్లుగా వైసీపీ వైపు నుంచి ఆరోపణలు వినిపించాయి. అంతకుముందు జరిగిన చిన్న చిన్న సంఘటనల గురించి ఎవరూ పట్టించుకోలేదు కానీ.. ఇటీవల జగన్ ఇంటి ముందు అగ్ని ప్రమాదం జరగడం మాత్రం చర్చనీయాంశంగా మారింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగగా.. అగ్నిమాపక సిబ్బంది వచ్చి వాటిని ఆర్పారు.
జగన్ మీద కక్ష గట్టిన టీడీపీ, జనసేన మద్దతుదారుల పనే ఇదని వైసీపీ నేతలు ఆరోపించారు. జగన్ ఇక్కడ పెద్దగా ఉంటున్నది లేకపోయినా.. ఆయన భద్రత పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు భద్రతను పెంచింది కూడా.
కాగా జగన్ ఇంటి వద్ద జరిగిన అగ్ని ప్రమాదానికి కారణాలేంటో తెలుసుకునేందుకు ప్రభుత్వం విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా పోలీసు అధికారులు ఇంటి ముందున్న సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వమని అడగ్గా.. అటు వైపు నుంచి సరైన సమాధానం రావట్లేదని సమాచారం. జగన్ ఇంటి మేనేజ్మెంట్ చూసుకునే వ్యక్తులు.. ఇంటి బయట పెట్టినవి డమ్మీ సీసీటీవీ కెమెరాలని.. వాటి విజువల్స్ లేవని సమాధానం ఇస్తున్నారట. జగన్ ఎనిమిది నెలల ముందు వరకు ముఖ్యమంత్రి. ఆయన ఇంటి ముందు ఇలా డమ్మీ కెమెరాలు పెట్టడం ఏంటి అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
జగన్ సీఎం కుర్చీ నుంచి దిగిపోయిన తర్వాత అయినా సరే.. అలాంటి కెమెరాలను ఎలా పెడతారన్నది సందేహం. ఇది అగ్ని ప్రమాదాం విషయంలో అనేక సందేహాలకు తావిస్తోంది. జగన్ మీద సానుభూతి కోసం అగ్ని ప్రమాదం డ్రామా నడిపారని.. ఇది ఐప్యాక్ స్క్రిప్టే అని.. లేకపోతే సీసీటీవీ ఫుటేజ్ ఇవ్వడానికి ఏం ఇబ్బంది అని టీడీపీ, జనసేన మద్దతుదారులు సోషల్ మీడియాలాో వైసీపీకి ప్రశ్నలు సంధిస్తున్నారు. మరి అటు నుంచి ఏం సమాధానం వస్తుందో చూడాలి.
This post was last modified on February 12, 2025 5:54 pm
మార్చి 28 హరిహర వీరమల్లు రావడం లేదనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ నిర్మాణ సంస్థ నుంచి అధికారిక…
2019 లో స్వయంగా పోటీ చేసిన రెండు చోట్ల ఓడినప్పటికి, ఎంతో అభిమానగణం ఉన్నా, అభిమానాన్ని ఓట్ల రూపంలోకి మార్చే…
బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్కు ఇప్పటికే రెండుసార్లు పెళ్లయింది. ముందుగా తన చిన్ననాటి స్నేహితురాలు రీనా దత్తాను ప్రేమించి…
హీరోగా ఎంత స్థాయిలో ఉన్నా అభిరుచి కలిగిన నిర్మాతగానూ ఋజువు చేసుకోవాలని తాపత్రయపడుతున్న న్యాచురల్ స్టార్ నాని స్వంత బ్యానర్…
కూటమి పాలనలో ఏపీ పారిశ్రామికంగా పరుగులు పెడుతోంది. కూటమి పాలన మొదలైన తొలి 9 నెలల్లోనే దాదాపుగా రూ.7 లక్షల కోట్ల…
వైసీపీ మరింత డీలా పడనుందా? ఆ పార్టీ వాయిస్ మరింత తగ్గనుందా? అంటే.. ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రస్తుతం…