Political News

చంద్ర‌బాబుకు ష‌ర్మిల విన్న‌పం.. విష‌యం ఏంటంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల ఆస‌క్తిక‌ర విన్న‌పం చేశారు. త‌ర‌చుగా కేం ద్రంపై విమ‌ర్శ‌లు గుప్పిస్తూ.. చంద్రబాబుకు విన‌తులు స‌మ‌ర్పించే ష‌ర్మిల‌.. ఈ సారి కూడా.. ఇలాంటి ప్ర‌తిపాద‌నే తెర‌మీదికి తెచ్చారు. విజ‌య‌వాడ ప‌శ్చిమ ప్రాంతంలో నిర్మాణం పూర్త‌వుతున్న జాతీయ ర‌హ దారి విష‌యాన్ని ఆమె ప్ర‌స్తావించారు. ఈ ర‌హ‌దారిని వాయు వేగంతో పూర్తి చేస్తున్న సీఎం చంద్ర‌బాబుకు ష‌ర్మిల కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. దీనిని పూర్తి చేసేందుకు మీరు ప‌డుతున్న శ్ర‌మ విజ‌యవంతం అవుతుంది అని పేర్కొన్నారు.

అయితే.. విజ‌య‌వాడ ప‌శ్చిమ జాతీయ ర‌హ‌దారికి విజ‌య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మాజీ ఎమ్మెల్యే, ది వంగ‌త వంగ‌వీటి మోహ‌న్‌రంగా పేరు పెట్టాల‌ని ష‌ర్మిల విన్న‌వించారు. “వంగ‌వీటి మోహ‌నరంగా విజ‌య వాడ ప‌శ్చిమ జాతీయ ర‌హ‌దారి” అని పేరు పెట్టేలా కేంద్రాన్ని ఒప్పించాల‌ని ష‌ర్మిల విజ్ఞ‌ప్తి చేశారు. విజ య‌వాడ తూర్పు నియోజ‌క‌వ‌ర్గంలో రంగాకుఎంతో అనుబంధం ఉంద‌ని.. ఆయ‌నను ఇప్ప‌టికీ ఆ ప్రాంత ప్ర‌జ‌లు మ‌రిచిపోలేద‌ని పేర్కొన్నారు. సాధార‌ణ ప్ర‌జ‌ల ప‌క్షాన రంగా ఎంతో కృషి చేశార‌ని తెలిపారు.

ఈ నేప‌థ్యంలో స‌ద‌రు జాతీయ ర‌హ‌దారికి రంగా పేరు పెట్ట‌డం స‌ముచితంగా ఉంటుంద‌ని కూడా .. ష‌ర్మిల పేర్కొన్నారు. ఈ విష‌యంలో కేంద్రపై అవ‌స‌రమైతే ఒత్తిడి తెచ్చ‌యినా.. రంగా పేరు పెట్టాల‌ని చంద్ర‌బాబుకు ష‌ర్మిల సూచించ‌డం గ‌మ‌నార్హం. అయితే.. ఈ జాతీయ ర‌హదారిలో కేంద్రం వాటా 70 శాతం కాగా.. రాష్ట్ర వాటా 30 శాతంగా ఉంది. దీంతో కేంద్రం తీసుకునే నిర్ణ‌య‌మే ఫైన‌ల్‌. దీంతో చంద్ర‌బాబుకు ష‌ర్మిల ముందే విన్న‌వించ‌డం గ‌మ‌నార్హం.

ఏంటీ ర‌హ‌దారి?

గుంటూరులోని కాజా టోల్ గేట్ నుంచి గ‌న్న‌వ‌రంలోని పెద్ద అవుట ప‌ల్లి వ‌రకు అంటే.. సుమారు 48 కిలో మీట‌ర్ల మేర‌.. నిరంత‌రం ర‌ద్దీగా ఉంటోంది. ఇక్క‌డ జాతీయ స్థాయిలో ట్రాఫిక్ కూడా ఎక్కువ‌గా ఉంటోంది. ఈ నేప‌థ్యంలో ఈ రెండు ప్రాంతాల మ‌ధ్య ప్ర‌త్యేక జాతీయ ర‌హ‌దారి ఏర్పాటు చేయాల‌న్న‌ది.. ప్ర‌తిపాదన‌. దీని పై ఎప్పుడో కేంద్రానికి విన్న‌పాలు అంద‌డంతో.. కేంద్రం కూడా వెంట‌నే స్పందించి.. నిర్మాణం చేప‌ట్టింది. ఈ ర‌హ‌దారి విజ‌య‌వాడ ప‌శ్చిమ ప్రాంతం నుంచి తూర్పు నియోజ‌క‌వ‌ర్గం మీదుగా.. గన్న‌వ‌రం చేరుకుంటుంది. దీనివ‌ల్ల ట్రాఫిక్ త‌గ్గ‌డంతోపాటు.. సుమారు 15 కిలో మీట‌ర్ల దూరం కూడా త‌గ్గుతుంది. ఇది ఇప్ప‌టికే 90 శాతం పనులు పూర్తి చేసుకుని.. వ‌చ్చే ఉగాది నాటికి ప్రారంభించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

This post was last modified on February 11, 2025 4:31 pm

Share
Show comments
Published by
Satya
Tags: Sharmila

Recent Posts

నెక్స్ట్ సుబ్బారెడ్డి, ధర్మారెడ్డిల వంతు!

తిరుమల లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలపై జరగుతున్న దర్యాప్తు సంచలన పరిణామాలకు దారి తీయనుంది. అసలు తిరుమల…

31 minutes ago

బుల్లిరాజు ఎంత పాపులరైపోయాడంటే..

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలో మోస్ట్ సర్ప్రైజింగ్, ఎంటర్టైనింగ్ ఫ్యాక్టర్ అంటే బుల్లిరాజు అనే పాత్రలో రేవంత్ అనే చిన్న కుర్రాడు…

46 minutes ago

రామ్ చరణ్ 18 కోసం కిల్ దర్శకుడు ?

గత ఏడాది బాలీవుడ్ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్న సినిమా కిల్. ఒక రాత్రి పూట రైలులో జరిగే మారణ…

52 minutes ago

వేలంటైన్స్ డే.. పాత సినిమాలదే పైచేయి?

ఫిబ్రవరి మామూలుగా సినిమాలకు అంతగా కలిసొచ్చే సీజన్ కాదు. సినిమాలకు మహారాజ పోషకులైన యూత్ పరీక్షలకు సంబంధించిన హడావుడిలో ఉంటారు…

2 hours ago

లోక్ సభలో లిక్కర్ గోల.. ఏపీ ఎంపీల సిగపట్లు

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఏపీకి సంబంధించిన సమస్యలు వరుసగా ప్రస్తావనకు వస్తున్నాయి. అందులో భాగంగా మంగళవారం నాటి లోక్…

2 hours ago

జగన్ తెగింపుపై చంద్రబాబు కామెంట్స్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా పెను సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, కల్తీ…

3 hours ago