వైసీపీ మహిళా నేత, మాజీ మంత్రి విడదల రజిని సోమరువారం ఏపీ హై కోర్టును ఆశ్రయించారు. తనపై నమోదు అయిన కేసులో తనను పోలీసులు అరెస్ట్ చేయకుండా ఉండేలా ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆమె కోర్టును కోరారు. ఈ మేరకు రజిని తరఫు లాయర్లు హై కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ ఫై నేడు విచారణ జరిగే అవకాశాలు ఉన్నాయి. తనకు ముందస్తు బెయిల్ వస్తుందని రజిని ఆశాభావంతో ఉన్నట్టుగా సమాచారం.
సాధారణ కేసుల్లో అయితే… రాజకీయ నేతలు కాబట్టి.. వారి ప్రత్యర్థులు తప్పుడు కేసులు పెడుతుంటారులే అన్న కోణంలో ఆలోచించే కోర్టులు ముందస్తు బెయిల్ లు మంజూరు చేస్తూ ఉంటాయి. అయితే.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయ్యే కేసుల్లో అసలు బెయిల్ అన్నదే మంజుకు కాదు కదా. మరి విడదల రజినిపైన కూడా నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు కేసు కదా. ఈ లెక్కన రజినీకి హై కోర్టులో బెయిల్ రాదనే చెప్పాలి.
కూటమి సర్కారు పాలన మొదలు అయ్యాకా.. చాలా మంది వైసీపీ నేతలపై కేసులు నమోదు అయ్యాయి. వారిలో ఒక్క బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేష్ మినహా మిగిలిన వారంతా ముందస్తు బెయిల్ తీసుకుని అరెస్ట్ ల నుంచి తప్పయించుకున్నారు. మాచెర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి అరెస్ట్ అయినా ఆయన కూడా బెయిల్ తీసుకుని బయటకు వచ్చారు. అయితే.. రజినీపై నమోదు అయిన కేసు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ నిరోధక చట్టం కింద నమోదు అయిన కేసు కావడంతో ఆమెకు బెయిల్ వచ్చే పరిస్థితి లేదనే చెప్పాలి. ఆంటే… విడదల రజిని అరెస్ట్ కాక తప్పదా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.
This post was last modified on February 11, 2025 11:55 am
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…