ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 27 ఏళ్ళ అనంతరం ఢిల్లీ గడ్డపై బీజేపీ జెండా ఎగురుతుండడంతో ఆ ప్రభావం నేషనల్ పాలిటిక్స్ పై తీవ్ర ప్రభావం చూపనున్నట్లు అర్ధమవుతుంది. ఇక ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఓటమిని ఎదుర్కొంటుండగా, రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఢిల్లీ సెక్రటేరియట్‌ను సీజ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా, ఆప్ ప్రభుత్వం కీలక ఫైళ్లు గల్లంతు కాకుండా చూడటమే ఈ నిర్ణయానికి కారణంగా చెబుతున్నారు. ఎన్నికల ఫలితాలు పూర్తికావడంతోనే లెఫ్టినెంట్ గవర్నర్ చర్యలు తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది. గత పదేళ్లుగా ఆమ్ ఆద్మీ పార్టీపై బీజేపీ తీవ్ర అవినీతి ఆరోపణలు చేస్తూ వచ్చింది. ముఖ్యంగా లిక్కర్ స్కామ్, శీష్ మహల్ ఖర్చుల వివాదం, ప్రభుత్వ నిధుల దుర్వినియోగంపై ఆప్ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.
ఇదే సమయంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వస్తే కాగ్ నివేదికలు అసెంబ్లీలో ప్రవేశపెడతామని ప్రకటించారు. ఇప్పుడు ఆ ప్రక్రియ మొదలైనట్టేనని భావిస్తున్నారు. ఇక ఫలితాల విషయానికొస్తే, ఢిల్లీలో ఈసారి ఓటర్లు పెద్ద మార్పునే తీసుకొచ్చారు. 70 స్థానాలకు గాను 48 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంది. ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా తన సొంత నియోజకవర్గమైన న్యూఢిల్లీలో ఓటమి పాలయ్యారు.
అదే విధంగా, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా జంగ్‌పురా నియోజకవర్గంలో పరాజయం చెందారు. ఆప్ మిగతా 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, బీజేపీ విజయం తథ్యమైపోయింది. కాంగ్రెస్ పార్టీ మరింత దారుణమైన పరిస్థితిని ఎదుర్కొంది. ఆ పార్టీ ఏకంగా ఒక్క సీటును కూడా గెలుచుకోలేకపోయింది. గత ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రభంజనం కారణంగా ఖాతా తెరవలేకపోయిన కాంగ్రెస్, ఈసారి బీజేపీ ఆధిపత్యానికి పూర్తిగా డౌన్ అయ్యింది. దీంతో, ఢిల్లీ రాజకీయాలు పూర్తిగా ద్విపాక్షిక పోరుగా మారాయి.
ఒక్కసారి బీజేపీ అధికారంలోకి రాగానే, ఆప్ పాలనలో జరిగిన అవినీతిపై పెద్ద ఎత్తున దర్యాప్తు జరిగే అవకాశముంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్, అవినీతి కేసుల్లో నేరుగా కీలక నేతలు ఫోకస్ అవుతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇక సెక్రటేరియట్ సీజ్ చర్యలతో బీజేపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టగానే కీలక ఆధారాలు వెలుగులోకి రావచ్చని భావిస్తున్నారు. మొత్తం మీద, ఢిల్లీ ఎన్నికల ఫలితాలు కేజ్రీవాల్ కోసం ఎంత నిరాశ కలిగించాయో, బీజేపీకి అంతంత ఉత్సాహాన్నిస్తోంది.
This post was last modified on February 8, 2025 4:33 pm
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ఏ మాత్రం తగ్గకపోవడానికీ, తరచూ మళ్లీ మళ్లీ ఘర్షణలు చెలరేగడానికీ, అంతర్జాతీయ శక్తుల ఆడంబర నీతులు…
వైసీపీ హయాంలో పదవులు దక్కించుకున్న వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు? నాడు నెలకు 3 లక్షలకు పైగానే వేతనాల రూపంలో…
నితిన్ కెరీర్లో చాలా కీలకమైన సినిమా.. తమ్ముడు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌కు ఓ మోస్తరు హిట్ కూడా లేదు. చెక్,…
జనసేనాని, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్.. కొన్ని రోజుల కిందటే మళ్లీ ‘పవర్ స్టార్’గా మారారు. రాజకీయ నేతగా, మంత్రిగా…
ప్రస్తుతం వార్ 2, ప్రశాంత్ నీల్ సినిమా, దేవర 2లకు కమిట్ మెంట్ ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఆ తర్వాత…
ఇటీవల టెస్ట్ క్రికెట్‌కు వీడ్కోలు చెప్పిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలవడం…